whiskey brands  : ఈ ఫేమస్‌ విస్కీ బ్రాండ్లు భారత్‌లోనే తయారవుతాయని మీకు తెలుసా..?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మద్యం ప్రియులు ఎక్కువగా ఇష్టపడేది విస్కీని. జిన్‌, రమ్‌, వోడ్కా, స్కాచ్‌ లాంటి ఎన్ని రకాల లిక్కర్స్‌ ఉన్నా.. వీస్కీకి ఉండే ఆదరణ వేరు. అయితే ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే విస్కీలలో కొన్న బ్రాండ్ల విస్కీలు మాత్రం బాగా ఫేమస్‌. ఇండియాలోనే కాదు. దేశ విదేశాల్లో కూడా ఈ విస్కీలకు మంచి గిరాకీ ఉంటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 24, 2023 | 02:26 PMLast Updated on: Dec 24, 2023 | 2:26 PM

Do You Know That These Famous Whiskey Brands Are Made In India

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మద్యం ప్రియులు ఎక్కువగా ఇష్టపడేది విస్కీని. జిన్‌, రమ్‌, వోడ్కా, స్కాచ్‌ లాంటి ఎన్ని రకాల లిక్కర్స్‌ ఉన్నా.. వీస్కీకి ఉండే ఆదరణ వేరు. అయితే ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే విస్కీలలో కొన్న బ్రాండ్ల విస్కీలు మాత్రం బాగా ఫేమస్‌. ఇండియాలోనే కాదు. దేశ విదేశాల్లో కూడా ఈ విస్కీలకు మంచి గిరాకీ ఉంటుంది. కొత్త ఫ్లేవర్‌ వచ్చిందంటే చాలు ఎగబడి కొనేస్తుంటారు. అలాంటి బ్రాండ్స్‌లో అమృత్‌, ఇంద్రి, రాంపూర్‌ బ్రాండ్లు బాగా వినిపించే పేర్లు. ఇక్కడ హైలెట్‌ పాయింట్‌ ఏంటి అంటే.. ఈ మూడు బ్రాండ్లు కూడా ఇండియాలోనే తయారవుతాయి.

ఇంద్రి అయితే ప్రపంచంలో అత్యుత్తమ విస్కీ బ్రాండ్‌గా అవార్డ్‌ కూడా సొంతం చేసుకుంది. ఈ మూడు బ్రాండ్‌లకు ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో ఉన్న క్రేజ్‌ భారత్‌ను లాభాల బాటలో నడిపిస్తోంది. కేవలం ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు మద్యం ఎగుమతుల ద్వారా భారత్‌కు 230 మిలియన్‌ డాలర్లు లాభం వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ఇక గతేడాది మద్యం ద్వారా భారత్‌కు అంతర్జాతీయంగా వచ్చిన ఆదాయం 325 మిలియన్‌ డాలర్లు. భారత విస్కీలకు విదేశాల్లో ఇంత డిమాండ్ ఉండటానికి కారణం ఇక్కడ ఉండే వాతావరణం. భారత్‌లోని వాతావరణం కారణంగా కేవలం ఒక్క సంవత్సరంలో లిక్కర్‌ మాల్ట్‌ అవుతుంది.

నిజానికి లిక్కర్‌ మాల్ట్‌ అయ్యి విస్కీగా మారడానికి 2 నుంచి 3 సంవత్సరాల టైం పడుతుంది. ఆ విస్కీలు మాత్రమే రుచిలో అద్భుతంగా ఉంటాయి. కానీ భారత్‌లో తయారయ్యే విస్కీలు కేవలం ఒక్క సంవత్సరం మాల్ట్‌ చేసినా అదే రుచిని ఇస్తాయి. తక్కువ టైంలోనే ప్రొడక్షన్‌ ఉటుంది కాబట్టి ఇక్కడ విస్కీ అందుబాటు ఎక్కువగా ఉంటుంది. టేస్ట్‌ కూడా సరిగ్గా కుదరడంతో ఇండియన్‌ విస్కీ అంటే పడి చచ్చిపోతున్నారు విదేశీయులు.