Elon Musk : స్ట్రెస్ పోగొట్టుకు నేందుకు మస్క్ ఏం చేస్తారో తెలుసా..?
మనం చేసేది జాబ్ కావొచ్చు.. బిజినెస్ కావొచ్చు.. ప్రొఫెషనల్ లైఫ్ పరంగా ఖచ్చితంగా స్ట్రెస్ ఉంటుంది. ఇక సొసైటీలో మంచి పొజిషన్‌లో ఉన్నోళ్లు, సెబ్రిటీలు, బిలియనీర్లకు అయితే స్ట్రెస్ పీక్స్‌లో ఉంటుంది.
మనం చేసేది జాబ్ కావొచ్చు.. బిజినెస్ కావొచ్చు.. ప్రొఫెషనల్ లైఫ్ పరంగా ఖచ్చితంగా స్ట్రెస్ ఉంటుంది. ఇక సొసైటీలో మంచి పొజిషన్‌లో ఉన్నోళ్లు, సెబ్రిటీలు, బిలియనీర్లకు అయితే స్ట్రెస్ పీక్స్‌లో ఉంటుంది. ఎందుకంటే ఒక స్థాయికి ఎదగడం ఎంత కష్టమో.. ఆ స్థాయిని అలాగే కాపాడుకోవడం అంతకంటే వంద రేట్లు కష్టం. ప్రతీ క్షణం ప్రతీ విషయంలో పక్కవారితో పోటీ పడాలి. అయితే ఈ స్ట్రెస్‌ను పొగొట్టుకునేందుకు చాలా మంది చాలా రకాల అలవాట్లు చేసుకుంటారు. అలాగే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా ఓ అలవాటు చేసుకున్నాడట. తనకు స్ట్రెస్ అనిపించిన ప్రతీసారి ఆ పని చేస్తడట. అదేదో పెద్ద టాస్క్ కాదు. ఇంట్లో కూర్చుని వీడియో గేమ్స్ ఆడటం. అవును.. ఎవరికీ తెలియని విషయం ఏంటి అంటే ఎలాన్ మస్క్‌కు వీడియో గేమ్స్ అంటే చాలా ఇష్టమట. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రివీల్ చేశాడు మస్క్.
బిజినెస్ పరంగా నిత్యం తన మెదడులో తుఫాను నడుస్తుంటుందట. కొత్త ఆలోచనలు ఇన్వెన్షన్స్ గురించి బుర్ర బద్దలు కొట్టుకుంటాడట. ఇలా తనకు బాగా స్ట్రెస్ అనిపించినప్పుడు సింపుల్‌గా ఇంటికి వెళ్లి వీడియో గేమ్స్ ఆడుతూ కూర్చుంటాడట. వీడియో గేమ్‌తో ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వకపోయినా.. తనకున్న స్ట్రెస్ మాత్రం పోతుంది అంటున్నాడు మస్క్. తన జీవితపు అలవాట్లు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయని.. వాటి గురించి తెలిస్తే ఎవరూ తనలా బతకాలనుకోరు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు మస్క్. మస్క్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. మస్క్ ఇంత సింపుల్‌గా ఉంటాడా అని షాకవుతున్నారు ఆయనను అభిమానించేవాళ్లు. ప్రంపంచాన్ని చుట్టేసే అవకాశమున్నా.. అందరిలా, సింపుల్‌గా గేమ్స్ ఆడుతూ కూర్చుంటున్నారు అంటే.. మస్క్ డౌన్ టూ ఎర్త్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.