Mira Rajput : అంబానీ కూతురితో మీరా రాజ్‌పుత్
ఇషా అంబానీ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు... అపర కుబేరుడు ముఖేశ్‌అంబానీ ముద్దుల కూతురుగా ఆ పేరు ఎంతో ఫేమస్.. రిలయన్స్ రిటైల్ వ్యాపార బాధ్యతలు ఇషా అంబానీ చేతికి వచ్చిన తర్వాత కంపెనీ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.
ఇషా అంబానీ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు… అపర కుబేరుడు ముఖేశ్‌అంబానీ ముద్దుల కూతురుగా ఆ పేరు ఎంతో ఫేమస్.. రిలయన్స్ రిటైల్ వ్యాపార బాధ్యతలు ఇషా అంబానీ చేతికి వచ్చిన తర్వాత కంపెనీ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అంబానీ కుమార్తె అనేక విదేశాలకు చెందిన ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్లను దేశంలోని వినియోగదారులకు పరిచయం చేస్తూ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటున్నారు.. ఇక.. మీరా రాజ్‌పుత్.. ఈ పేరు కూడా ఎంతో ఫేమస్.. ప్రముఖ స్టార్ హీరో షాషిద్ భార్య గానే కాదు.. తనదైన అందంతో ఫ్యాషన్ సెన్స్ తో ఈ భామ నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లో నిలిచే ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇలా.. యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న ఈ ముద్దుగుమ్మలిద్దరి మధ్యా మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది.. అది కాస్తా ఇప్పుడు బిజినెస్‌లో భాగస్వామ్యానికి దారి తీసింది.
ఇంతకు ముందు ఆలియా భట్ తో కలిసి ప్రఖ్యాత దుస్తుల బ్రాండ్ కంపెనీ నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకున్న ఇషా.. ఇప్పుడు తన బిజినెస్ పార్ట్‌నర్ షిప్ ఛాన్స్‌ను మీరా రాజ్‌పుత్‌కు ఇచ్చింది.. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. మీరా రాజ్‌పుత్ ఇప్పుడు ఏకంగా ఇషా అంబానీతో కలిసి దాదాపు 8.40 కోట్ల కంపెనీలో భాగస్వామి కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.. దీనికి సంబంధించి డీల్ పై ఒప్పందం కుదిరింది.. రిలయన్స్ రిటైల్ బ్యూటీ రిటైల్ ప్లాట్‌ఫాం ‘తీరా’ నుంచి స్కిన్‌కేర్ బ్రాండ్ ‘అకిండ్’ను విడుదల చేస్తున్నట్లు ఇషా- మీరా అధికారికంగా ప్రకటించారు.
వేల కోట్ల పెట్టుబడులతో మొదలవుతున్న ఈ కంపెనీకి ‘మీరా కపూర్ కో పార్ట్‌నర్‌గా ఉండనుంది.. అకింద్ బ్రాండ్ ను ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లోని తీరా ఫ్లాగ్‌షిప్ స్టోర్‌లో ఆవిష్కరించారు.. ఈ బ్రాండ్ భారతదేశపు ప్రీమియం బ్యూటీ డెస్టినేషన్ అయిన తీరాలో ఆన్‌లైన్ , ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.. స్కిన్‌కేర్ బ్రాండ్ చర్మ సంరక్షణకు సంబంధించిన ప్రొడక్ట్స్‌ను అందించనుంది.. అకిండ్ మూడు విభిన్న మోడల్స్ లో లభిస్తుంది. బిల్డ్ రేంజ్, ది బ్యాలెన్స్ రేంజ్, ది డిఫెన్స్ రేంజ్ అనే మూడు రకాల ఉత్పత్తులను మార్కెట్లో దించుతుందని తెలుస్తోంది.. అకిండ్ ప్రొడక్ట్‌ని పరిచయం చేయడం సంతోషంగా ఇషా అంబానీ ఇషా అంబానీ అన్నారు.. ఈ ప్రయోగం ఒక ముఖ్యమైన మైలురాయిని అందుకుంటుందని ఇషా ఆశాభావం వ్యక్తం చేశారు..