Websites: ఇంటర్నెట్‌లో వెబ్‌సైట్ల వరద.. నిమిషానికి 175 కొత్త సైట్లు ప్రారంభం!

ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 175 కొత్త సైట్లు ప్రారంభమవుతున్నాయి. అంటే సగటున రోజుకు 2.52 లక్షల సైట్లు లాంఛ్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నమోవుతున్న వెబ్ ట్రాఫిక్‌లో 93 శాతం గూగుల్ నుంచే ఉంటోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 10, 2023 | 02:18 PMLast Updated on: Apr 10, 2023 | 2:18 PM

Flood Of Websites On The Internet 175 New Sites Are Launching Every Minute

Websites: నేటి తరం వాళ్లలో ఇంటర్నెట్ గురించి తెలియని వారుండరు. ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్‌తో అవసరం ఉంటుంది. అనేక అవసరాలకు వివిధ సైట్లపై ఆధారపడాల్సిందే. అయితే, ఇప్పుడు బోలెడన్ని సైట్లు పుట్టుకొస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 175 కొత్త సైట్లు ప్రారంభమవుతున్నాయి. అంటే సగటున రోజుకు 2.52 లక్షల సైట్లు లాంఛ్ అవుతున్నాయి. దీన్నిబట్టి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఎన్ని లక్షల సైట్లు పెరిగాయో అర్థం చేసుకోవచ్చు.
1991లో ఒక్క సైటుతో మొదలై
ఇంగ్లాండ్‌కు చెందిన నెట్ క్రాఫ్ అనే సంస్థ నివేదిక ప్రకారం.. 1991లో ఒక్క వెబ్‌సైట్‌తో ఇంటర్నెట్‌ ప్రారంభమైంది. ఇప్పుడేమో వీటి సంఖ్య అంచనాలకు మించి పెరిగింది. ప్రస్తుతం 1.13 బిలియన్ సైట్లు ఉన్నట్లు అంచనా. అంటే దాదాపు 113 కోట్ల సైట్లు ఉన్నాయి. అయితే, వీటిలో చాలా సైట్లు నిరుపయోగంగా ఉన్నాయి. 18 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయి. 20.29 కోట్ల సైట్లు మాత్రమే యాక్టివ్‌గా నడుస్తున్నాయి. పని చేయని సైట్లు వీటికంటే ఐదు రెట్లు ఎక్కువ ఉండటం విశేషం. ఒక్కో సైట్‌లో అనేక పేజీల సమాచారం అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం 50 బిలియన్ పేజీల సమాచారం అందుబాటులో ఉన్నట్లు అంచనా. ఒక సంస్థ నివేదిక ప్రకారం.. ఇండెక్ట్ వెబ్ సంస్థ ఏకంగా 4.98 బిలియన్ పేజీల సమాచారం కలిగి ఉంది.
షాపింగ్ సైట్లలో 200 కోట్ల మంది
ఇప్పుడు ఎక్కువ వ్యాపారం ఆన్‌లైన్ ద్వారానే నడుస్తోంది. అందువల్ల యూజర్లు కూడా ఈ కామర్స్ సైట్ల ద్వారానే షాపింగ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. దాదాపు 71 శాతం మంది తమ వ్యాపారాలను ఆన్‌లైన్ సైట్ల ద్వారా నడిపిస్తున్నారు. మొత్తం 28 శాతం వ్యాపారం ఆన్‌లైన్ సైట్ల ద్వారా జరుగుతోంది. చిన్న వ్యాపారులు కూడా తమ వ్యాపార అవకాశాలను పెంచుకునేందుకు సైట్లను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యప్తంగా 2 బిలియన్ల మందికిపైగా ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా జరుగుతున్న విక్రయాల మొత్తం విలువ దాదాపు 4.2 ట్రిలియన్ డాలర్లకుపైనే ఉంది.

Websites
ఇవీ వెబ్‌సైట్ల లెక్కలు
ప్రపంచవ్యాప్తంగా నమోవుతున్న వెబ్ ట్రాఫిక్‌లో 93 శాతం గూగుల్ నుంచే ఉంటోంది. ఒక్కొక్కరు గూగుల్‌లో సగటున 22 నిమిషాలపాటు, వెబ్ బ్రౌజింగ్ చేస్తుండగా, యూ ట్యూబ్‌లో 9 నిమిషాలపాటు బ్రౌజింగ్ చేస్తున్నారు. 63 మిలియన్ వెబ్‌సైట్లు కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఉపయోగిస్తున్నాయి. అత్యధికంగా ఇంగ్లీష్‌లో 52.3 శాతం వెబ్‌సైట్లు ఉన్నాయి. ఆ తర్వాత రష్యన్ భాషలో 7.5 శాతం, టర్కిష్ భాషలో 3.8 శాతం, స్పానిష్‌లో 3.8 శాతం, పర్షియన్ భాషలో 3.5 శాతం, ఫ్రెంచ్‌లో 2.6 శాతం, జర్మన్‌లో 2.1 శాతం, జపనీస్‌లో 1.9 శాతం సైట్లు ఉన్నాయి. రోజూ సగటున 3 బిలియన్లకంటే ఎక్కువగా గూగుల్ సెర్చ్‌లు నమోదవుతున్నాయి. ఒక రోజు 70 వేలకుపైగా సైట్లు హ్యాకవుతున్నాయి. రోజుకు సగటున 120 బిలియన్ ఈమెయిల్స్ పంపుతున్నారు. రోజూ 4 బిలియన్ జీబీల ఇంటర్నెట్ డాటా క్రియేట్ అవుతోంది. టాప్ వెబ్‌సైట్లలో ఎక్కువగా అంటే.. 76.17 శాతం మొబైల్‍లో బ్రౌజ్ చేసేందుకు వీలున్నవి. కానీ, 23.83 శాతం సైట్లు మాత్రం మొబైల్‌లో బ్రౌజ్ చేయడానికి వీలుండదు.