రాకెట్ స్పీడ్‌లో బంగారం.. ఆశలు వదులుకోవాల్సిందేనా..
బంగారం అంటే ఆర్నమెంట్ మాత్రమే కాదు.. సెంటిమెంట్ కూడా ! కలలు, కష్టాలతో పాటు.. భవిష్యత్ భరోసా బంగారం చుట్టూ అల్లుకొని ఉంటుంది మనదేశంలో ! ఓ ప్రత్యేకమైన రోజు కచ్చితంగా బంగారం కొనుగోలు చేసుకోవాలనే ట్రెడిషన్ ఉందంటే..

బంగారం అంటే ఆర్నమెంట్ మాత్రమే కాదు.. సెంటిమెంట్ కూడా ! కలలు, కష్టాలతో పాటు.. భవిష్యత్ భరోసా బంగారం చుట్టూ అల్లుకొని ఉంటుంది మనదేశంలో ! ఓ ప్రత్యేకమైన రోజు కచ్చితంగా బంగారం కొనుగోలు చేసుకోవాలనే ట్రెడిషన్ ఉందంటే.. మన సంప్రదాయంలో బంగారానికి ఇచ్చే ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా.. అభరణాలు ధరిస్తారు. లక్షల్లో విలువ చేసే కమ్మలు, నెక్లెస్‌లు, బ్యాంగిల్స్‌లాంటివి కొనుగోలు చేస్తుంటారు. గోల్డ్ రేట్లు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా అంటూ వాళ్లంతా ఎదురుచూస్తుంటారు. పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టగానే.. బంగారం షాపుల్లో వాలిపోతారు. ఐతే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. పెరగడం తప్ప.. తగ్గడమే తెలియదు అన్నట్లుగా పసిడి పరుగులు పెడుతోంది.
గోల్డ్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుండడంతో.. వాల్డ్‌వైడ్‌గా గోల్డెన్ డేస్ నడుస్తున్నాయ్. తొలిసారిగా ఔన్స్.. అంటే 31.1 గ్రాముల బంగారం ధర 3వేల డాలర్లు దాటింది. 2వేల 5వందల డాలర్ల నుంచి 3వేల డాలర్లకు చేరుకోవడానికి 7 నెలలు మాత్రమే పట్టింది. అదే గతంలో ఔన్స్ బంగారం ధర 500 డాలర్లు పెరగడానికి యావరేజీగా 4 ఏళ్లు పట్టింది. ఇది చాలు.. పసిడి ధరలు ఏ రేంజ్‌లో పరుగులు పెడుతున్నాయని చెప్పడానికి. ఇప్పుడు కూడా రేట్లు తగ్గేదే లే అంటున్నాయ్. ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. నెక్ట్స్ రికార్డు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. 2025లోనే ఔన్స్ ధర 4వేల డాలర్లను తాకే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయ్. ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 91వేలు దాటింది. ఔన్స్ గోల్డ్ పెరిగితే.. లక్ష కావడానికి పెద్ద సమయం పట్టకపోవచ్చు. 2024లో 40 కంటే ఎక్కువసార్లు బంగారం సరికొత్త ఆల్ టైమ్ గరిష్టాలను నమోదు చేసింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు… మరో 16 కొత్త గరిష్టాలను చేరుకుంది. అంతర్జాతీయంగా 2005 డిసెంబర్‌లో పసిడి ఔన్స్ ధర తొలిసారిగా 500డాలర్ల మార్కును తాకింది. అది 2008 మార్చిలో వెయ్యి డాలర్లకు చేరుకుంది. అంటే 5వందల డాలర్లు పెరగడానికి మూడేళ్లు పట్టిందన్నమాట. ఇక 2011 ఏప్రిల్‌లో 15వందలు, 2020 ఆగస్టులో 2వేల డాలర్లు.. 2024 ఆగస్టులో 2వేల 5వందల డాలర్ల మార్క్ తాకింది. ఇక మన దగ్గర.. 2012లో మొదటిసారి 30వేలు దాటి తులం బంగారం.. ఆ తర్వాత ఐదేళ్లు కంట్రోల్‌లో ఉంది. 2015లో 26వేల దగ్గర ఆగిపోయింది. ఐతే 2018 నుంచి గోల్డ్ దూకుడుకు బ్రేక్ లేకుండా పోయింది. కరోనా సమయంలో అయితే.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
2022లో మొదటిసారి 50వేల మార్క్ దాటిన గోల్డ్.. 2023లో 60వేల మార్క్.. 2024లో 70వేల మార్క్ టచ్ చేసింది. ఇప్పుడు 90వేలు దాటింది. ఈ ఏడాది చివరికి లక్ష రూపాయల మార్క్ దాటడం పెద్ద మ్యాటరేం కాదు. ఒకటి మాత్రం క్లియర్.. కరోనా సమయంలో బంగారం కొంటే.. ఇప్పుడు తులం బంగారం మీద 40వేలకు పైగా లాభం వచ్చేది. గతానికి వెళ్లి ఆలోచిస్తే.. గుండె చెరువు అవడం తప్ప మరేం ఉండదు. ఒకప్పుడు అలంకరణలు, సామాజిక అవసరాలకు మాత్రమే బంగారం ఉండాలని అనుకునేవారు. ఐతే ఇప్పుడు ప్రతీ ఒక్కరి ఆలోచన మారిపోతోంది. బంగారాన్ని ఇన్వెస్ట్‌మెంట్‌గా చూస్తున్నారు. గోల్డ్‌పై పెట్టుబడులు రోజురోజుకీ పెరుగుతున్నాయ్. దీంతో ధరలు ఆకాశానికి చేరిపోతున్నాయ్. ఇకపై కూడా అలానే ఉండబోతోంది. బంగారం ధరల తగ్గుదల పెద్దగా ఉండే చాన్స్ లేదు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా.. బంగారం, బంగారమే అని తేలిపోయింది. బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. భౌగోళిక రాజకీయ, భౌగోళిక ఆర్థిక అనిశ్చితి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తక్కువ వడ్డీ రేట్లు, బలహీనమైన యూఎస్ డాలర్.. ఇవన్నీ గోల్డ్ ధరలను ప్రభావితం చేస్తున్నాయ్. దీంతో ధరలు అందనంత ఎత్తుకు చేరుకుంటున్నాయ్. అధిక పసిడి ధరలు ఆభరణాల డిమాండ్ తగ్గించే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. 2024లో పుత్తడి ధర 27 శాతం ఎగిసినా డిమాండ్ తగ్గలేదు. భారత్‌లో 808.8 టన్నుల పసిడి కొనుగోళ్లు జరిగాయ్.