Top story:గోల్డ్ ఎప్పుడూ గోల్డే…!
ఇండియన్స్ లైఫ్ స్టయిల్‌లో గోల్డ్ ఓ భాగం. ఆడవారికే కాదు మగవారి ఒంటిపై కూడా ఎంతో కొంత గోల్డ్ ఉండాల్సిందే. ఫారినర్స్‌కు వింతగా అనిపించొచ్చు కానీ మనవారికి మాత్రం అదో సెంటిమెంట్.

ఇండియన్స్ లైఫ్ స్టయిల్‌లో గోల్డ్ ఓ భాగం. ఆడవారికే కాదు మగవారి ఒంటిపై కూడా ఎంతో కొంత గోల్డ్ ఉండాల్సిందే. ఫారినర్స్‌కు వింతగా అనిపించొచ్చు కానీ మనవారికి మాత్రం అదో సెంటిమెంట్. కానీ నిజానికి అది సెంటిమెంట్ కంటే ఓ ఇన్వెస్ట్‌మెంట్. పండగకో పబ్బానికో ఎంతో కొంత గోల్డ్ కొనడం అనేది మనకు అలవాటు. మన పెద్దవాళ్లు మనకు తెలియకుండానే మనకు చేసిన మంచి పెట్టుబడి అలవాటు బంగారం. చాలామంది ఇదో పెట్టుబడి అంటే ఒప్పుకోరు. కానీ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా గోల్డ్ ది బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్. గోల్డ్ గ్రోత్ రేట్‌ను పరిశీలిస్తే ఈ విషయాన్ని ఒప్పుకోక తప్పదు.
మీలినియమ్ ఇయర్ 2000లో 10గ్రాముల బంగారం ధర ఎంతో తెలుసా…? 4వేల 4వందలు… ఇప్పుడు అర గ్రాము కూడా రాదనుకోండి. మరిప్పుడో 90కే దాటేసింది. 2000లో నాలుగున్నర వేల వరకు ఉన్న బంగారం ఆ తర్వాత ఐదేళ్లలో మరో మూడు వేలు పెరిగింది. 2008లో ప్రపంచమాంద్యంతో 13వేలకు చేరింది. ఆ తర్వాత దానికి తిరుగు లేకుండా పోయింది. రేటు పెరిగింది. అదే సమయంలో అమ్మకాలు పెరిగాయి. దీంతో బంగారాన్ని ఆపేవాడే లేకపోయాడు. 2018నాటికి 30వేలకు చేరింది, అంటే పదేళ్లలో డబుల్ అయ్యింది. 2020లో 50వేలను టచ్ చేసింది.
2021లో మాత్రం గోల్డ్‌కు రెసిస్టెన్స్ ఎదురు కావడంతో రెండు వేలు తగ్గి 48వేలకు పరిమితమైంది. ఆ తర్వాత జూలు విదిల్చింది. కసిగా పెరిగింది. 2022లో 55వేలు, 2023లో 63వేలు, 2024లో 78 వేలను టచ్ చేసింది. ఈ ఏడాది మాత్రం దానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. త్వరలో లక్షను టచ్ చేయాలని తహతహలాడుతోంది. అంతర్జాతీయంగా ఔన్స్ గోల్డ్ గత 20 ఏళ్లలో 631శాతం పెరిగింది. గత ఐదేళ్లలో అయితే దాదాపు 90శాతం పెరిగింది. ఏ సురక్షిత పెట్టుబడి సాధనం కూడా గోల్డ్ ఇచ్చినంత రాబడి ఇవ్వలేదనే చెప్పాలి. 2000 ఏడాదిలో 10 గ్రాముల బంగారం 4వేల 4వందలు…ఆ సమయంలో బంగారం కొనకుండా ఆ డబ్బును బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే ఎంత వస్తుందో తెలుసా…? అదిప్పటికి గరిష్ఠంగా 60 వేలు అవుతుంది. మరి బంగారం 90వేలు దాటింది. దీన్నిబట్టి ఏది బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షనో చూసుకోండి..
ఈ ఏడాదిలో ఇప్పటికే దాదాపు 16శాతం పెరిగింది గోల్డ్. ట్రంప్ గెలిచాక కాస్త కంట్రోల్లోకి వచ్చినట్లు కనిపించిన కనకం… ఆ తర్వా అమెరికన్ ప్రెసిడెంట్ యాక్షన్స్‌తో జూలు విదిల్చింది. టారిఫ్ వార్ వంటి అడ్డగోలు నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొంది. దీంతో భవిష్యత్ అంతా బంగారానిదే అనిపిస్తోంది. అయితే గత రెండ్రోజులుగా తీసుకుంటే బంగారం దాదాపు 3శాతం తగ్గింది. దీంతో చాలామంది గోల్డ్ రేట్ మరింత దిగివస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
గోల్డ్ ఇంకా తగ్గుతుందా..?మరింత పెరిగి లక్షను టచ్ అవుతుందా…?ఇప్పుడు పసిడి కొనడం సరైనదేనా…?అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర కాస్త తగ్గింది. ఈ వారం ఎంత పెరిగిందో రెండ్రోజుల్లో అంత తగ్గింది. ఔన్సు బంగారం ధర 3వేల 167 డాలర్లను టచ్ చేసి మళ్లీ 3వేల 40 డాలర్లకు చేరింది. మాంద్యం భయాలతో గోల్డ్ కాస్త వెనకడుగు వేసింది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు ఉంటే గోల్డ్ పెరుగుతుంది. కానీ మాంద్యం భయాలుంటే మాత్రం కాస్త తగ్గాల్సిందే. ట్రంప్ డెసిషన్స్‌తో ఈ ఏడాదే అమెరికాలో రెసిషన్ వస్తుందని అంతర్జాతీయ ప్రముఖ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఫెడ్ ఛైర్మన్ పావెల్ వంటి వారు కూడా ఈ స్థాయిలో ట్రంప్ టారిఫ్‌లు వేస్తారని ఏ మాత్రం ఊహించలేదు. దానికి కౌంటర్‌గా చైనా వంటి దేశాలు కౌంటర్ ఎటాక్‌కు దిగాయి. ఇవన్నీ మార్కెట్లను ముంచేసేవే…
అయితే గోల్డ్ మరింత పడిపోతుందా అంటే అవునని చెప్పలేని పరిస్థితులు. కాస్త తగ్గొచ్చేమో కానీ పూర్తిగా పడిపోవడం అనేది జరగదు. ఇంకా చెప్పాలంటే మన దగ్గర ఏ 70 వేల స్థాయికో వస్తుందని ఆశించడం అత్యాశే అవుతుంది. మార్కెట్ వొలటాలిటీలో చాలామందికి గోల్డ్ ఇప్పటికే సేఫ్ హెవెనే… ఎలా స్పందిస్తాయో తెలియని మార్కెట్లలో పెట్టుబడి పెట్టే కంటే బంగారంపై పెట్టడమే బెటరని భావిస్తున్నారు. పైగా ఈ ఏడాది అమెరికన్ ఫెడ్ రెండుసార్లు వడ్డీ రేట్లు తగ్గిస్తుందని లెక్కగడుతున్నారు. దాని ప్రకారం చూస్తే డిపాజిట్లు, బాండ్లు ఏ మాత్రం మంచి రాబడి ఇవ్వలేదు. దీంతో ఇన్వెస్టర్లు గోల్డ్ వైపు చూస్తారు. ఆ విధంగా చూసినా గోల్డ్‌కు మంచి రోజులే… అయితే ప్రస్తుతం కొన్ని రోజుల పాటు గోల్డ్ గేమ్ 90వేలకు అటూ ఇటూనే ఉంటుంది. అయితే ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ నుంచి కోలుకున్నా గోల్డ్ మళ్లీ పరుగులు తీసే అవకాశం ఉంది. ఈ ఏడాది ఇప్పటికే 15శాతం పెరిగిన బంగారం మరో 15శాతం పెరిగితే లక్ష మార్కును అందుకోవచ్చు. అందుకే నిపుణులు ఏ మాత్రం అవకాశం ఉన్నా గోల్డ్ కొనడానికి ఇదే సరైన సమయం అంటున్నారు. ఒకవేళ ఇంకా పడిపోతే ఇంకొంత కొని యావరేజ్ చేసుకోవచ్చు. కొన్ని రోజుల తర్వాత బంగారం పుంజుకుంటే మళ్లీ దాన్ని పట్టుకోవడం కష్టమే. కాబట్టి త్వరపడండి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని బంగారం షాపుల బాట పట్టండి మరి.