Gold Prices: బంగారం ధరలు ఢమాల్.. ఇదే మంచి సమయమా..? వేచి చూడాలా..?
వరుసగా రోజూ రూ.200 నుంచి రూ.300 వరకు ధరలు తగ్గుతూ వచ్చాయి. రానున్న రోజుల్లో ఇంకాస్త తగ్గే ఛాన్స్ ఉంది. గత సెప్టెంబర్ 26న పది గ్రాముల బంగారం ధర రూ.54,750గా ఉండగా, ఈ నెల 6న రూ.52,400గా ఉంది. గోల్డ్ కొనాలనుకునే వారికి ఇదే గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు.
Gold Prices: తెలుగు రాష్ట్రాలు సహా ఇండియాలో ఇటీవలి కాలంలో బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన పది రోజుల్లో బంగారం ధర రూ.3 వేల వరకు తగ్గింది. ఇంతకాలం పెరుగుతూ వచ్చిన ధరలు.. ఇప్పుడు తగ్గుతుండటం సామాన్యుడికి ఊరట కలిగించే విషయమే. వరుసగా రోజూ రూ.200 నుంచి రూ.300 వరకు ధరలు తగ్గుతూ వచ్చాయి. రానున్న రోజుల్లో ఇంకాస్త తగ్గే ఛాన్స్ ఉంది. గత సెప్టెంబర్ 26న పది గ్రాముల బంగారం ధర రూ.54,750గా ఉండగా, ఈ నెల 6న రూ.52,400గా ఉంది. గోల్డ్ కొనాలనుకునే వారికి ఇదే గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. పది రోజుల క్రితం కిలో వెండి ధర రూ.79 వేలు ఉండగా, శుక్రవారం నాటికి రూ.73,100కు పడిపోయింది. అంటే దాదాపు రూ.6 వేలు తగ్గింది.
అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు తగ్గించేందుకు ఫెడ్ నిర్ణయం తీసుకోవడంతోపాటు, డాలర్స్, బాండ్స్‌లో ఇన్వెస్టర్స్ పెట్టుబడులు పెట్టడం, చైనా ఆర్థిక వ్యవస్థ మందగించడం కూడా బంగారం ధరల తగ్గుదలకు కారణం. అమెరికాలో అధిక వడ్డీ రేట్లు మరికొంత కాలం కొనసాగుతాయనే అంచనాల మధ్య ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌తోపాటు, ఇండియాలోనూ బంగారం ధరలు తగ్గుతున్నాయి. కీలక వడ్డీ రేట్లు పెరుగుతాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు డాలర్ల వైపు మొగ్గు చూపుతుండటంతో.. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ రేటు పెరిగిపోతోంది.
దీని కారణంగా బంగారం ధరల్లో మారుతున్నాయి. చైనాలో రియల్ ఎస్టేట్ సంక్షోభంలో ఉంది. దీనివల్ల ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టబడి పెడితే.. బంగారం ధరలు మళ్లీ పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం బంగారం ధరలు మరింత దిగొచ్చే ఛాన్స్ ఉంది. తాజాగా నమోదైన బంగారం ధరలు ఏడు నెలల కనిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1820 డాలర్ల వద్ద, ఇక స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు 20.98 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు డాలర్‌తో రూపాయి మారక విలువ 83.25గా ఉంది.