Google Flights: విమాన ప్రయాణికుల కోసం గూగుల్ కొత్త ఫీచర్.. ఇకపై తక్కువ ధరకే టిక్కెట్లు..!
గూగుల్ తీసుకురానున్న ఫీచర్ ద్వారా ఈజీగా, చవకగా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ పేరు గూగుల్ ఫ్లైట్ ఇన్‌సైట్స్. దీని ద్వారా ప్రయాణికులు తాము కోరుకున్న గమ్యానికి, నిర్దిష్ట సమయంలో, ఏ తేదీలలో టిక్కెట్ ధరలు తక్కువగా ఉన్నాయో తెలియజేస్తుంది.
Google Flights: విమాన ప్రయాణాలు చేసే వారికి సెర్చింజన్ గూగుల్ శుభవార్త చెప్పింది. తక్కువ ధరలో విమాన టిక్కెట్లు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో, వాటిని ఎలా బుక్ చేసుకోవాలో తెలిపే కొత్త ఫీచర్ తీసుకువచ్చిన్నట్లు గూగుల్ ప్రకటించింది. ఈ విషయాన్ని గూగుల్ తమ అధికారిక బ్లాగ్ పోస్టులో తెలియజేసింది.
విమాన టిక్కెట్ ధరలు ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే. విమానయాన సంస్థను బట్టి, టిక్కెట్లు బుక్ చేసుకునే సమయాన్ని బట్టి, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను బట్టి టిక్కెట్లు రేట్లు మారుతుంటాయి. హాలిడే సీజన్, పండుగ సీజన్లలో రేట్లు మరింత పెరుగుతాయి. అయితే, టిక్కెట్ తక్కువ ధరకు ఎలా దొరుకుతుంది..? ఆఫర్లు ఏంటి..? వంటి వివరాలు కావాలంటే చాలా సెర్చే చేయాల్సి ఉంటుంది. గూగుల్ తీసుకురానున్న కొత్త ఫీచర్ ద్వారా ఈజీగా విమాన టిక్కెట్లను తక్కువ ధరకే బుక్ చేసుకోవచ్చు. గూగుల్ తీసుకురానున్న ఫీచర్ ద్వారా ఈజీగా, చవకగా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ పేరు గూగుల్ ఫ్లైట్ ఇన్‌సైట్స్. దీని ద్వారా ప్రయాణికులు తాము కోరుకున్న గమ్యానికి, నిర్దిష్ట సమయంలో, ఏ తేదీలలో టిక్కెట్ ధరలు తక్కువగా ఉన్నాయో తెలియజేస్తుంది. అలాగే బుక్ చేసుకునే సమయానికి ఉన్న ధరలు, ఆ తర్వాత పెరుగుతాయా..? తగ్గుతాయా..? ఏ సమయంలో బుక్ చేసుకుంటే మంచిది.. వంటి వివరాల్ని కూడా ఈ ఫీచర్ అందిస్తుంది.
అలాగే విమాన టిక్కెట్ ధరలు తగ్గితే వెంటనే అలర్ట్ చేస్తూ, నోటిఫికేషన్ పంపుతుంది. ఈ విషయంలో ఇప్పటికే గూగుల్.. పైలట్ ప్రాజెక్ట్ అమలు చేస్తోంది. అంటే విమానం బయలుదేరే ముందు టిక్కెట్ ధర తగ్గకుండా చూసుకుంటుంది. ఒక వేళధర తగ్గితే గూగుల్ పే ద్వారా తగ్గిన మొత్తాన్ని గూగుల్ తిరిగి చెల్లిస్తుంది. ప్రస్తుతం కొన్ని రూట్లలో మాత్రమే ఈ ఫీచర్ అమలు చేస్తోంది. విమాన ధరల్ని గూగుల్ నిత్యం ట్రాక్ చేసి ఈ వివరాల్ని అందిస్తుంది. దీనికోసం యూజర్లు తమ గూగుల్ అకౌంట్‌లో గూగుల్ ఫ్లైట్స్ ధరల ట్రాకింగ్ సిస్టమ్ ఆన్ చేసుకోవాలి. ముందుగానే యూజర్లు తాము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో గూగుల్‌కు తెలియజేస్తే చాలు.. ఆ రూట్లో ఎప్పుడు, ఏ సంస్థలో టిక్కెట్ ధరలు తక్కువగా ఉన్నాయో యూజర్లకు సమాచారం అందిస్తుంది. టూరిస్ట్ ప్లేసెస్‌కు సంబంధించిన సమాచారాన్ని కూడా గూగుల్ ఇన్‌సైట్ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు.