Automatic robot fuel system : ఆటోమేటిక్ రోబో ఫ్యూయల్ సిస్టమ్..
భవిష్యత్తులో పెట్రోల్ బంకు లోకి వెళితే.. మీ బండిలో పెట్రోల్ నింపినందుకు అక్కడ ఎవ్వరూ కనిపించకపోవచ్చు ఎందుకంటే ఇక ముందు పెట్రోల్ బంకుల్లో ఆటో ఫ్యూయెల్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

If you go to a petrol station in the future you may not see anyone there for filling your car with petrol because there is a possibility that auto fuel system will be available in petrol stations in the future
ఇప్పుడు మనం ఉన్నది టెక్నాలజీ కాలంలో ఏది చేయాలన్నా అది టెక్నాలజీ సాయం లేకుండా అడుగు ముందుకు కూడా వేయాలంటే అనే మాటలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్న కాలంలో సాంకేతికత గతంలో కంటే వేగంగా అభివృద్ధి చెందుతుంది. చెందుతుంది కూడా.. నేడు మన దగ్గర వేగవంతమైన ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్‌లు, AI అసిస్టెంట్లు , సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అందుబాటులో ఉన్నాయి. మరి కొన్ని రోజుల్లో అవి కూడా రోడ్లపైకి రానున్నాయి. ఇప్పుడు అతే మార్గంలో మరో టెక్నాలాజీ వచ్చింది. అదే రోబోటిక్ ఫ్యూయల్ గ్యాస్ స్టేషన్. ప్రస్తుత సమజ్యంకు రేపటి భవిష్యత్ కస్టమర్‌కు ఉన్నత స్థాయి సౌకర్యాన్ని అందిస్తాయి.
ఇంధన స్టేషన్లను ఆటోమేట్ చేయగలమా..?
భవిష్యత్తులో పెట్రోల్ బంకు లోకి వెళితే.. మీ బండిలో పెట్రోల్ నింపినందుకు అక్కడ ఎవ్వరూ కనిపించకపోవచ్చు ఎందుకంటే ఇక ముందు పెట్రోల్ బంకుల్లో ఆటో ఫ్యూయెల్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ వ్యవస్థ ఎలా పని చేస్తుంది..?
సెన్సార్లు.. కెమెరాలే.. ఈ ఘట్టంలో కీలకం
కారును పెట్రోల్ బంకులోకి తీసుకెళ్లడమే ఆలస్య.. మీ కారులో ఏ ఇంధనం నింపాలి ఆటో ఫ్యూయల్ వ్యవస్థ గుర్తిస్తుంది. సంకేతాల ఆధారంగా ఒక రోబోటిక్ ట్యాంక్ మూత తీసి ఇంధనం నింపుతుంది. ఈ పనంతా మనుషుల ప్రమేయం లేకుండానే ఆటోమేటిగ్గా జరిగిపోతుంది. రోబోటిక్ కి అమర్చి ఉన్న సెన్సార్లు, కెమెరాలు ఈ పనంతా సులువుగా పూర్తయేందుకు సహాయపడతాయి. ముందుగా కారు రిజిస్ట్రేషన్ నంబరును గుర్తించి ప్రత్యేక స్కానర్లు ఈ నెంబర్ ను స్కన్ చేస్తాయి. ఇది ఏ రకమైన ఫ్యూయల్ వెహికల్స్ అనే విషయాన్ని గుర్తిస్తుంది. అనంతరం రోబో కెమెరా సరిగ్గా ఏ ప్రదేశంలో కారు నిలపాల్లో సూచిస్తుంది. రోబోటిక్ ఫ్యూయల్ ట్యాంక్ డోర్ ని గుర్తిస్తుంది. ఆ తర్వాత అందులో ఏ ఇంధనం నింపాలో నిర్థాంచుకుంటుంది. ఆ తర్వాత రోబో ట్యాంక్ మూతను తీసి ఇంధనం నింపుతుంది. ఈ ప్రక్రియలో పేమెంట్ ఆప్షన్ కు సైతం ముందుగానే ఎంచుకోవచ్చు అయితే వినియోగదారులు ముందుగా ఆటో ఫ్యూయల్ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. పక్కనే ఉన్నటు వంటి స్క్రిన్ లో ఫ్యూయల్ ధరలు ప్రదర్శిస్తాయి. ముందుగానే బుక్ చేసుకోవడానికి స్మార్ట్ కియోస్క్‌లను, యాప్ ను సూచిస్తాయి.
యాప్ ద్వారా ఫ్యూయల్ లోడ్ ..
ఇంధనాన్ని నింపే చర్య కూడా ‘స్మార్ట్’గా మారుతోంది. మీరు కేవలం ఒక యాప్‌ని అందుబాటులో ఉంచనున్నారు. దీని ద్వారా మీరు ఫ్యూయల్ స్టేషన్ లో స్లాట్‌లను ముందేగానే బుక్ చేసుకోవచ్చు, దీని ద్వారా మనం సమయాన్ని ఆదా అవుతుంది. సమీపంలోని స్టేషన్‌ల కోసం వేచి ఉండే సమయాన్ని ఆ యాప్ ద్వార వీక్షించవచ్చు. ఏ సమయంలో ఏ ప్రాతంలో ఎక్కడ ఫూయల్ స్టేషన్ ఉందో అక్కడే సమయానుకూలత బట్టి వెళ్లి ఫూయల్ నింపుకోవచ్చు. ప్రీ-బుకింగ్ ప్రత్యేక టెర్మినల్స్, మీ సేవను అనుకూలీకరించడానికి ముందుగా సేవ్ చేసిన డేటా వంటి ప్రయోజనాలను అందించవచ్చు.
ఫ్యూయల్ యాప్ ఎలా వాడాలి..?
యాప్ మీ క్రెడిట్ కార్డ్‌లలో లింక్ చేసుకోవాలి. అనంతరం మీ పేరుతో, మీ నంబర్ తో లాగీన్ అవ్వలి. యాడ్-ఆన్ సేవలను బుక్ చేసుకోవడానికి ఆఫర్‌లను చూసేందుకు మిమ్మల్ని యాప్ లోకి అనుమతిస్తుంది.
- మీరు ఏంత ఫ్యూయల్ లోడ్ చేసుకున్నారో చూపిస్తుంది.
- మీరు లోడ్ చేసుకున్న ఫ్యూయల్ నాణ్యతను చూపిస్తుంది.
- ఎంత మొత్తంలో వినియోగిస్తారు ముందుగానే చూపిస్తుంది.
- మీరు ఎంత ఫ్యూయల్ ని లోడ్ చేసుకున్నారో.. దాని ధరను కూడా చూపిస్తుంది.
- మీరు ఫ్యూయల్ ద్వారా మీరు ఉన్నటువంటి రాష్ట్రానికి అలాగే దేశానికి ఎంత పన్ను కట్టుతున్నారో చూపిస్తుంది.
- మీరు రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా మీరు ఎక్కడ ఫ్యూయల్ లోడ్ చేస్తున్నారో కూడా చూపిస్తుంది.
ఆటోమేటిక్ ఫ్యూయల్ సిస్టమ్ వల్ల లాభాలు..
ప్రపంచవ్యాప్తంగా ఈ సిస్టమ్ అందుబాటులోకి వస్తే .. చాలా లాభాలు ఉన్నాయని చెప్పవచ్చు..
ఈ సిస్టమ్ వినియోగం లోకి రావడం ద్వారా.. చాలా వరకు భద్రతా చర్యలను అందుబాటులో ఉంటాయి. ఇందులో పెట్రోల్ గానీ.. డీజిల్ గానీ దొంగతనం చేయలేదు.. అంతేకాకుండా పెట్రోల్ కారులో నింపుకున్న తర్వాత కొందరు డబ్బులు ఇవ్వకుండా పారిపోతారు.. ఈ సిస్టమ్ ద్వారా అలా జరిగే అవకాశం ఉండదు. ముఖ్యంగా ఇందులో ఏలాంటి కల్తీ ఉండదు. పెట్రోల్ బంక్ లో ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగవు.. ఫ్యూయల్ అవసరం ఉన్నవారికి బంక్ దగ్గర ఎలాంటి ప్రమాదం ఉండదు అందుచేత ప్రయాణికులకు రక్షణ ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా ఫ్యూయల్ నింపడంలో ఎలాంటి సమయం వృధా కాదు. టైం టు టైం పని చేసుకుంటూ పోతుంది ఈ ఫ్యూయల్ రోబో
ప్రస్తుతం ఏ దేశంలో వాడుకలో ఉంది..?
ప్రస్తుతం ఫిన్లాండ్లోని నెస్టే ఫ్యూయల్ స్టేషన్ లో రోబో రీ ఫ్యూయల్ సిస్టమ్ అందుబాటులో ఉంది. డెన్మార్క్ కు చెందిన స్టార్టప్ కంపెనీ ఈ ఫ్యూయల్ స్టేషన్ ను పైలట్ సైటిక్ ఎంపిక చేసుకుంది. డెన్మార్క్ కు చెందిన ఆటో ఫ్యూయల్ అనే స్టార్టప్ కంపెనీ ఒక రోబోటిక్ ఆర్మ్ ను అభివృద్ధి చేసింది.
వినియోగదారులకు కంఫర్ట్ తో పాటు సేఫ్టీ అందించడమే ప్రధాన ఉద్దేశం ఈ ఆటో ఫ్యూయల్ సంస్థ సీఈఓ జోనాస్ అంటున్నారు. భవిష్యత్తులో 2030 వరకు ఆటో ఫ్యూయల్ సిస్టమ్ అన్ని దేశాల్లోనూ కనిపిస్తుందని అంటున్నారు ఆటో రంగ నిపుణులు. అంటే మనుషులు వినియోగం తగ్గి వారి స్థానంలో బదులుగా రోబోలు కనిపిస్తున్న మాట.
S.SURESH