Moon Land: చంద్రుడిపై ఎకరం భూమి ధర ఎంత.. ఎలా కొనాలి..?
చంద్రయాన్ 3 సక్సెస్‌తో ఇప్పుడు ప్రపంచం అంతా భారత్ గురించే మాట్లాడుకుంటోంది.

If you want to buy land on the lunar mandal, you have to go to the online site called Lunar Registry and make payments in the form of dollars
చంద్రయాన్ 3 సక్సెస్‌తో ఇప్పుడు ప్రపంచం అంతా భారత్ గురించే మాట్లాడుకుంటోంది. దక్షిణ ధృవంపై కాలుమోపిన తొలి దేశంగా నిలిచి ఇండయా రికార్డ్ క్రియేట్ చేసింది. మొత్తంగా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ జరిపిన నాలుగో దేశంగా అవతరించింది. దీంతో యావత్ ప్రపంచం చూపు చందమామపై పడింది. చంద్రయాన్ సక్సెస్‌తో చంద్రుడికి సంబంధించిన విషయాలపై ఇప్పుడు ఆరా తీయడం మొదలు పెట్టారు. చందమామపై భూమి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. చంద్రుడిపై భూమిని ఎలా కొనుగోలు చేయాలి.. ఎకరం భూమి విలువ ఎంత ఉంటుందని తెగ వెతికేస్తున్నారు. సాధారణంగా చంద్రుడిపై భూమి సమతలంగా ఉండదు. బిలాలు, రాళ్లతో ఉంటుంది. భూమిపై మాదిరిగానే చంద్రుడిపై కూడా కొన్ని ఏరియాలు ఉంటాయ్. వాటికి కూడా కొన్ని పేర్లను కేటాయించారు.
ఇప్పటికే చాలామంది చంద్రుడిపై భూమిని కొనుగోలు చేశారు. చంద్రుడిపై నివాస యోగ్య పరిస్థితులు నెలకొల్పితే అక్కడ సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. చంద్రుడిపై భూమిని కొనుగోలు చేసేందుకు ఓ పద్ధతి ఉంటుంది. లూనా సొసైటీ ఇంటర్‌నేషనల్, ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్స్ రిజిస్ట్రీ కంపెనీలు చంద్రుడిపై భూమిని అమ్ముతున్నాయ్. ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్స్ రిజిస్ట్రీ నుంచి.. చనిపోయిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కొనుగోలు చేశాడు. చంద్రుడిపై సీ ఆఫ్ ముస్కోవీ ప్రాంతంలో సుశాంత్ మూన్ ల్యాండ్ కొన్నాడు. షారూక్ ఖాన్‌కి కూడా కొందరు అభిమానులు చంద్రుడిపై భూమిని గిఫ్ట్‌గా ఇచ్చారు. హైదరాబాద్‌కి చెందిన రాజీవ్ బగ్డీ, బెంగళూరుకు చెందిన లలిత్ ఇదే విధంగా భూమిని కొనుగోలు చేశారు.
కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకుని పేమెంట్ చేయాల్సి ఉంటుంది. లూనార్ రిజిస్ట్రీ తెలిపిన వివరాల ప్రకారం చంద్రుడిపై ఎకరం భూమి విలువ 37.50 డాలర్లు. అంటే సుమారు 3వేల వంద రూపాయలు అన్నమాట. ఇంత తక్కువ ధర ఉండటంతో చంద్రుడిపై భూమిని కొనుగోలు చేయడానికి జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. లూనార్ రిజిస్ట్రీ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత సంబంధిత ధ్రువపత్రాలు పొందవచ్చు. ఐతే కేవలం డాలర్ల రూపంలోనే ట్రాన్సాక్షన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. కొనుగోలు చేయాలని భావించే వారు కరెన్సీని మార్చుకోవాలి. క్రెడిట్, డెబిట్ కార్డులతో ట్రాన్సాక్షన్ పూర్తి చేయొచ్చు. అయితే, చంద్రుడిపై భూమి కొన్న వారికి కొన్ని షరతులు వర్తిస్తాయి.1967లో చేసుకున్న ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం.. భూమిపై బయట ఉన్న ఏ ప్రాంతం పైనైనా ఒక వ్యక్తికి గాని, ఒక దేశానికి గాని యాజమాన్య హక్కులు ఉండబోవు. ఈ ఒప్పందంపై భారత్‌తో పాటు 110 ఇతర దేశాలు సంతకం చేశాయ్. ఐతే చంద్రుడిపై పూర్తిగా నివాస యోగ్య పరిస్థితులు నెలకొనడానికి ఇంకా చాలా ఏళ్లు పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.