Digital India: డిజిటల్ పేమెంట్స్‌లో ఇండియానే బాస్! మోదీ వల్ల కాదు..! రీజన్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఇండియా తలరాత మారబోతోంది..! మార్చబోతుంది దేశ ప్రధానో.. అధికార పార్టీనో కాదు..! మార్చేలా దారులు వేసింది ఓ ఐడియా..అది కూడా ఓ బడా పారిశ్రామికవెత్త తీసుకొచ్చిన విప్లవం!డిజిటల్ చెల్లింపుల్లో భారత్ అగ్రస్థానంలో నిలవడానికి కారణం అతనే!
ఒకప్పటిలా లేదు ఇండియా..! దేశం మారుతోంది. ప్రజల ఆలోచనా తీరు కూడా మారుతోంది. జేబులో చిల్లిగవ్వ లేకపోయినా చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు కోట్ల విలువ చేసే స్థలాల నుంచి రూపాయి ఖరీదు చేసే అగ్గిపెట్టె వరకు ప్రతీవస్తువు కొనుగోలు చేసే పరిస్థితులు వచ్చేశాయి. డిజిటల్ ట్రాన్స్‌క్షన్స్ రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్ మైగవ్‌ఇండియా విడుదల చేసిన డేటా చూస్తే ఈ విషయం క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. గతేడాది భారత్‌లో 8 కోట్ల 95 లక్షల డిజిటల్ లావాదేవీలు నమోదైనట్టు డేటా చెబుతోంది. ఇది వరల్డ్ వైడ్‌గా రియల్‌టైం పేమెంట్స్‌లో మన దేశం వాటా 46 శాతానికి పెరిగినట్టు లెక్క! ఇదే టాప్.. ఈ విషయంలో మనమే బాస్!
డిజిటల్ ట్రాన్స్‌క్షన్ష్ పెరగడం వల్ల ఏంటి లాభమని అనుకుంటున్నారా..? డిజిటలైజేషన్ పారదర్శకతను పెంచుతుంది. దీని వల్ల బ్లాక్ మనీ ట్రాన్స్‌క్షన్స్ తగ్గే అవకాశాలుంటాయి.. అప్పుడు ఇండియా ఆర్థికంగా బలపడుతుంది. అటు దేశంలో డిజిటల్ చెల్లింపుల విషయంలో ప్రతి రోజు ఒక రికార్డును బ్రేక్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. ప్రతి చిన్న షాపు వద్ద డిజిటల్ చెల్లింపు విధానం ఉపయోగిస్తున్నారు. దీంతో యూపీఐ చెల్లింపులకు ఎక్కువగా ప్రజలు అలవాటుపడ్డారు. ఇది ఆర్థికంగా రీ సైకిల్ కావడానికి కారణమవుతుంది. 2026-27 నాటికి రోజుకు వంద కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతయాని ఇటివలే పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక చెప్పింది.
కారణం ఎవరు..?
దేశంలో ఎలాంటి మంచి జరుగుతున్నా.. జరిగినా.. జరగబోయే ఛాన్స్ ఉన్నా.. దానికి క్రెడిట్లు తీసుకునేందుకు చాలా మంది ఎగబడతుంటారు. ఈ లిస్ట్‌లో ఫస్ట్ ఎవరుంటారో అందరికి తెలిసిన విషయమే.. అటు ప్రతిదానికి ఐడియా ఇచ్చింది నేనేనని చెప్పుకునే 40ఏళ్ల ఇండస్ట్రి నేతలు ఎలాగో ఉన్నారు.. కానీ అసలు కారణం మాత్రం తెలిస్తే షాక్ అవుతారు. దేశంలో డిజిటల్ ట్రాన్స్‌క్షన్స్ పెరగడానికి కారణం జియో తీసుకొచ్చిన విప్లవం.. అది ఎలా అంటారా.. ? ఫ్లాష్‌బ్యాక్‌కి వెళ్లండి.. జియో రాకకు ముందు ఉన్న నెట్ ఛార్జ్‌లపై ఓ లుక్కేయండి.. నెల మొత్తానికి 1జీబీ డేటా ప్రొవైడ్ చేస్తూ 253రూపాయలు వసూలు చేసేవాళ్లు. ఇప్పుడు అంతకంటే తక్కువ ఛార్జ్‌కి రోజుకి 1.5జీబీ చొప్పున ఫ్రీ టాక్‌టైమ్‌తో వసూలు చేస్తున్నారు.. ఎంత తేడా..? ఇప్పుడు ఫ్రీ టాక్‌టైమ్ కూడా ఉంది.
జియోనే ఈ విప్లవానికి నాంది పలికింది. ఇవే అసలు ధరలంటూ ముఖేశ్ అంబానీ జియోని తీసుకొచ్చారు. దెబ్బకి మిగిలిన నెట్‌వర్క్ ప్రొవైడర్లు భూమిపైకి దిగొచ్చారు. దీంతో దేశంలో నెట్ వాడే వారి సంఖ్య అనుహ్యంగా పెరిగింది. డేటా ధరలు అందుబాటులో ఉండడంతో దేశం మొత్తం అండ్రాయిడ్ల బాట పట్టింది. మధ్యలో వచ్చిన కరోనా ఈ వాడకాన్ని మరింత పెంచింది. అటు వ్యాపారస్తులు కూడా కొనుగోలుదారుడికి ఇబ్బంది లేకుండా డిజిటల్ ట్రాన్స్‌క్షన్స్‌కి దారులు తెరిచారు. దీంతో డిజిటల్ లావాదేవిలు జరిగాయి. ఒకవేళ జియో రాకపోయి ఉంటే 1జీబీ డేటా నెల మొత్తానికి ఏ మూలకు వస్తుంది..? అసలు అంత పెట్టి ప్రజలు రిఛార్జ్‌లు చేసుకునేవాళ్లే కాదు.. ఇక నెట్ వినియోగమే లేకపోతే డిజిటల్ ట్రాన్స్‌క్షన్స్ ఎలా చేస్తారు.. సో అర్థమైంది కదా.. డిజిటల్ ట్రాన్స్‌క్షన్స్ పెరగడానికి కారణమేంటో..కారణం ఎవరో..!