Indian Whisky: చీర్స్.. ప్రపంచంలో బెస్ట్ విస్కీ మనదే..
ప్రతీ సంవత్సరం అంతర్జాతీయంగా విస్కీస్ ఆఫ్ ది వరల్డ్ పేరుతో పోటీలు జరుగుతాయి. ఈ పోటీల్లో భాగంగా విస్కీలో వాడిన పదార్థాలు, దాని రుచి ఆధారంగా మొత్తం 100 పాయింట్లకు రేటింగ్ ఇచ్చి అందులో బెస్ట్ విస్కీని ఎంపిక చేస్తారు.
Indian Whisky: భారతీయ మందుబాబులు కాలర్ ఎగరేసే న్యూస్ ఇది. అందరికీ ఏమోగానీ వాళ్లకు మాత్రం ఇది చాలా స్పెషల్. ప్రతీ సంవత్సరం అంతర్జాతీయంగా విస్కీస్ ఆఫ్ ది వరల్డ్ పేరుతో పోటీలు జరుగుతాయి. ఈ పోటీల్లో భాగంగా విస్కీలో వాడిన పదార్థాలు, దాని రుచి ఆధారంగా మొత్తం 100 పాయింట్లకు రేటింగ్ ఇచ్చి అందులో బెస్ట్ విస్కీని ఎంపిక చేస్తారు. చాలా దేశాలు వాళ్ల దగ్గర తయారయ్యే బెస్ట్ బ్రాండ్స్‌ను ఈ పోటీలో ఉంచుతాయి. ఈ ఇయర్ జరిగిన మద్యం పోటీల్లో భారత విస్కీ ఇంద్రి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది.
అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా సహా పలు దేశాలకు చెందిన వంద బ్రాండ్లను వెనక్కి నెట్టి.. భారత్‌లో తయారైన విస్కీ ఎంపికైంది. విస్కీస్ ఆఫ్ ది వరల్డ్ అవార్డ్స్‌లో ఇంద్రి దీపావళి కలెక్టర్స్ ఎడిషన్ 2023 వరల్డ్ బెస్ట్ విస్కీ అవార్డును సాధించింది. ఈ అవార్డుతో భారత విస్కీలకు ప్రపంచంలోనే అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచ దేశాల్లో ఉన్న టాప్ కంపెనీలు, అగ్ర దేశాల్లోని వందలాది బ్రాండ్ల విస్కీలను తలదన్ని మొదటి స్థానాన్ని దక్కించుకుంది. అయితే ఈ ఇంద్రీ విస్కీకి ఇలాంటి ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు గతంలోనూ చాలా వచ్చినట్లు ఆ కంపెనీ వెల్లడించింది. ఈ ఇంద్రి విస్కీని పికాడిల్లీ డిస్టిలరీస్ అనే సంస్థ తయారు చేస్తుంది. రాజస్థాన్‌లో ఎంపిక చేసిన బార్లీ గింజలను తీసుకుని.. హిమాలయాల్లో పుట్టిన యమునా నదిలోని తాజా నీటిని ఉపయోగించి హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఈ ఇంద్రి విస్కీని తయారు చేస్తారు.
ఈ విస్కీలో ముదురు తీపి, ఎండు ద్రాక్షలను ఉపయోగిస్తారు. ఈ విస్కీస్ ఆఫ్ ది వరల్డ్ ఇచ్చే అవార్డ్స్ లిక్కర్ ఇండస్ట్రీలో ఇచ్చే అత్యంత ముఖ్యమైన అవార్డ్ కావడంతో.. దీనిపై ఇంద్రి మేనేజ్‌మెంట్ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. కేవలం ఈ అవార్డ్ మాత్రమే కాదు. ఫిఫ్టీ బెస్ట్ వరల్డ్ విస్కీస్ ఆఫ్ 2022, ది ఇంటర్నేషనల్ విస్కీ కాంపిటీషన్ ఇన్ లాస్ వేగాస్, టాప్ 20 విస్కీస్ ఆఫ్ ది వరల్డ్‌లో కూడా ఇంద్రి స్థానం సంపాదించుకుంది.