Threads: ట్విట్టర్‌కు పోటీగా థ్రెడ్స్.. మెటా నుంచి సరికొత్త యాప్.. ట్విట్టర్‌కు చిక్కులు తప్పవా..?

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యేవారిని నేరుగా ఇక్కడా ఫాలో కావొచ్చు. కొత్తగా అకౌంట్ నేమ్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే.. ఇన్‌స్టా పేరుతోనే థ్రెడ్స్ యాప్ వాడుకోవచ్చు. అటు ఇన్‌స్టాగ్రామ్‌.. ఇటు ట్విట్టర్.. రెండింటి కలయికగా ఈ యాప్ ఉండొచ్చని అంచనా.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 4, 2023 | 04:34 PMLast Updated on: Jul 04, 2023 | 4:34 PM

Instagrams Twitter Competitor Threads Launches July 6th

Threads: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌కు పోటీగా ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా నుంచి థ్రెడ్స్ పేరుతో కొత్త యాప్ రానుంది. ఈ నెల 6, గురువారమే ఈ యాప్ లాంఛ్ కాబోతుంది. దీనిలో అచ్చం ట్విట్టర్ తరహా ఫీచర్లే ఉండబోతున్నాయి. టెక్స్ట్ రూపంలో కంటెంట్, ఒపీనియన్స్‌తోపాటు ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేయొచ్చు. లైక్, కామెంట్, షేర్ చేసే అవకాశం కూడా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యేవారిని నేరుగా ఇక్కడా ఫాలో కావొచ్చు. కొత్తగా అకౌంట్ నేమ్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే.. ఇన్‌స్టా పేరుతోనే థ్రెడ్స్ యాప్ వాడుకోవచ్చు. అటు ఇన్‌స్టాగ్రామ్‌.. ఇటు ట్విట్టర్.. రెండింటి కలయికగా ఈ యాప్ ఉండొచ్చని అంచనా. ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లు త్వరగానే ఈ యాప్ వాడుతారని మెటా భావిస్తోంది. యాప్​ స్టోర్​లో ప్రస్తుతం థ్రెడ్స్ అందుబాటులో ఉంది. యూరప్‌లో ప్లే స్టోర్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. గురువారం అన్ని చోట్లా ఈ యాప్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
ట్విట్టర్‌కు పోటీ ఇస్తుందా..?
ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను చేజిక్కించుకున్నప్పటి నుంచి కొత్త పాలసీలు తీసుకొస్తూ, వినియోగదారుల్ని గందరగోళానికి గురి చేస్తున్నాడు. దీంతో వినియోగదారుల్లో అసహనం పెరిగిపోతోంది. అసలు ఎప్పుడు, ఏ ఫీచర్ ఉంటుందో ఎలాన్ మస్క్ కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు. పూటకో ప్రకటన చేస్తూ యూజర్లను కన్‌ఫ్యూజ్ చేస్తున్నాడు. ట్విట్టర్ ఇప్పుడు వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌కు థ్రెడ్స్ గట్టి పోటీ ఇస్తుందేమో అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు మస్క్ చర్యలతో ఇప్పటికే చాలా మంది అడ్వర్‌టైజర్లు ఆ ప్లాట్‌‌ఫామ్ నుంచి వైదొలిగారు. అలాంటివారికి ఇప్పుడు థ్రెడ్స్ మంచి ఆప్షన్‌గా మారే అవకాశం ఉంది. ట్విట్టర్‌పై వ్యతిరేకత రోజురోజుకూ పెరిగిపోతున్న ఈ సమయంలోనే థ్రెడ్స్ తీసుకురావడం సరైన ఆలోచన అని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఆలోచిస్తున్నాడు. అయితే, థ్రెడ్స్ వినియోగదారులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చూడాలి. థ్రెడ్స్ విజయవంతమైతే ట్విట్టర్‌కు మరిన్ని కష‌్టాలు తప్పవు.