Electric Car: రూ.10 లక్షలలోపు ఎలక్ట్రిక్ కారు.. మే నుంచి బుకింగ్స్ ప్రారంభం

మనం బయట ట్రాఫిక్ సిగ్నల్లో నిలబడిన సమయంలో గానీ లేదా ఏదైనా పనిమీద తిరుగుతున్నప్పుడు మన ముందు చాలా వరకు ఎలక్ట్రిక్ వాహనాలు దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు మార్కెట్లో టాటా నెక్సాన్ రెండు రకాల వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కోవలోకి తాజాగా ఎంజీ కంపెనీ వారు సరికొత్త కారును మార్కెట్లోకి తీసుకురానున్నారు. దీనిపేరు ఎంజీ కమెట్. ఈవాహన ప్రత్యేకతలు గురించి తెలుసుకుందాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 26, 2023 | 07:00 PMLast Updated on: Apr 27, 2023 | 2:25 PM

Mg Company New Ev Car Comet

నేటితరానికి తగ్గట్టుగా రుచికరమైన వంటకాలు, వినియోగ వస్తువులు, అలంకరణ సామాగ్రి ఏవిధంగా మార్కెట్లోకి వచ్చేశాయో అదే క్రమంలో సరికొత్త వాహనాలను కూడా తయారు చేస్తున్నాయి దిగ్గజ కంపెనీలు. ఇప్పుడు ఎటు చూసినా ఈవీలే దర్శనమిస్తున్నాయి. దీనికి గల ప్రదాన కారణం పెట్రోలు ధరలు ఆకాశాన్నంటి సామాన్యుడిని జేబులు ఆవిరి చేస్తున్నాయి. అందుకే ఎలక్ట్రిక్ వాహనాలపై ఏకొంచం అవగాహన ఉన్నా.. వెంటనే కరెంట్ ద్వారా నడిచే వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. వీరికి తగ్గట్టుగా కంపెనీలు కూడా మంచి ఫీచర్లతో కార్లను తయారు చేస్తున్నాయి. అలా తయారు చేసిన సరికొత్త ఎలక్ట్రిక్ వాహనం పేరు కమెట్ ఈవీ. దీనిని ఎంజీ కంపెనీ తయారుచేసింది. గతంలో ఈ కంపెనీ ZS EVని అనే పేరుతో వినియోగదారులకు దగ్గరైంది. ఇప్పుడు ఎంజీ కమెట్ టు మార్కెట్లోకి తీసుకురానుంది.

కమెట్ ప్రత్యేకతలు..

ఇందులో రెండు వేరియంట్లు మనకు అందుబాటులోకి రానున్నాయి. అలాగే 17.3 kWh బ్యాటరీ సామర్థ్యంతో దీనిని తయారు చేశారు. ఒకసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే దాదాపు 230 కిలోమీటర్ల వరకూ ప్రయాణం చేయవచ్చు అని చెబుతున్నారు కంపెనీ ప్రతినిధులు. టాప్ స్పీడ్ లో వెళితే 200 కిలో మీటర్ల మైలేజి రావచ్చు. బ్యాటరీ ఛార్జ్ చేసేందుకు 3.3 kW ఛార్జర్ ను అందిస్తున్నారు. ఇది ఫాస్ట్ ఛార్జర్ అయితేకాదు. 0 నుంచి 100 శాతం బ్యాటరీ ఫుల్ అయ్యేందుకు కనీసం 7 గంటల సమయం పడుతుంది. అదే 10 నుంచి 80 శాతం ఛార్జ్ అయ్యేందుకు సుమారు 5 గంటలు పడుతుందని ఈ సంస్థ తెలిపింది. ఇందులో ఆటో ట్రన్స్ మిషన్ ను ఏర్పాటు చేశారు. అందుకుగానూ కారు ముందు భాగంలో భద్రత దృష్ట్యా రెండు ఎయిర్ బ్యాగ్ లను అమర్చారు. కారులో నలుగురు విశాలంగా కూర్చొని ప్రయాణించవచ్చు. వెనుక భాగంలో కూర్చునే వారికి ప్రత్యేకంగా వెనుక తలుపులు ఇవ్వలేదు. ముందు వైపు ఉన్న సీట్లను జరిపి లోనికి వెళ్లాల్సి ఉంటుంది. రివర్స్ మోడ్ ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్ కెమెరా ఆన్ అవుతుంది. సీట్ బెల్ట్ రిమైండర్, రియర్ పార్కింగ్ సెన్సార్ తోపాటూ ఎల్ ఈ డీ రియర్ ఫాగ్ ల్యాంప్ కూడా ఇచ్చారు. కారులో కూర్చున్నప్పుడు టైరును మానిటర్ చేసేందుకు టైర్ ప్రెజర్ మానిటరింగ్ ను ఏర్పాటు చేశారు.

MG Comet EV Car in Market

MG Comet EV Car in Market

ఎవరికోసం..

ఈ కారును కేవలం పెద్దపెద్ద మెట్రోపాలిటన్ నగరాలు, చిన్న చిన్న పట్టణాల్లో నివసించే వారికి అనువుగా ఉండేలా తయారుచేశారు. నిత్యం ఆఫీసు పనిమీద, బయట షాపింగ్ కు, చిన్న చిన్న క్యాంపులు వెళ్లే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే తక్కువ ధరలో కారు కొనాలి అనుకునే వారికి ఇది మంచి అవకాశం. కేవలం 10 లక్షలలోపే దీని ధర ఉంటుంది. ఇప్పుడు కేవలం ఒక్క హైదరాబాద్ నగరంలోనే దాదాపు 60వేలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు ప్రతి రోజూ రోడ్లపై తిరుగుతున్నాయి. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ ఈవీలవైపుకే మొగ్గుచూపుతున్నారు. అలాగే ప్రస్తుతం మార్కెట్లో ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్న టాటా కంపెనీ టియాగో ఈవీ, సిట్రోయెన్ EC3 మోడల్ కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. తాజాగా వీరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఈవీలో మూడురోజుల పాటూ ప్రయాణం చేశారు. వీరికి ధీటుగా మార్కెట్లో కమెట్ గట్టి పోటీ ఇస్తుందంటున్నారు.

ధర ఎంత..

ఎంజీ అనేది బ్రిటన్ కు చెందిన సుప్రసిద్ద కార్లు తయారు చేసే సంస్థ. మోరిస్ గ్యారెజెస్ కు అనుబంధంగా ఇండియాలో ఎంజీ పేరుతో తమ కార్లను వినియోగదారులకు అందిస్తుంది. తాజాగా టెస్ట్ అండ్ ప్రీవ్యూ వివరాలను విడుదల చేసింది. ఈ సందర్భంగా కమెట్ ధరను వాటి బుకింగ్ వివరాలను వెల్లడించింది. కమెట్ బేస్ వేరియంట్ ధర రూ. 7.98 లక్షలుగా పేర్కొంది. హైమోడల్ ధర రూ. 10 లక్షల లోపే ఉండవచ్చునని తెలిపింది. ఈ వాహనం కొనుగోలు చేయాలనుకునే వారు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చాని తెలిపింది. మే 15 నుంచి బుకింగ్స్ ప్రారంభించనున్నట్లు ఈ వాహన తయారీ ప్రతినిధులు చెప్పారు.

పర్యావరణానిక హానికలుగకుండా మన జేబులకు పెట్రో చిల్లు పడకుండా సాఫీగా ప్రయాణం చేయాలంటే ఇలాంటి ఈవీల వైపుకు మన దృష్టి మళ్లించక తప్పదు.

 

T.V.SRIKAR