Windows 10: విండోస్ 10 ఓఎస్ వాడుతున్నారా.. షాకింగ్ విషయం చెప్పిన మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ నిర్ణయం ప్రకారం.. 2025 అక్టోబర్ నుంచి విండోస్ 10పై ఎలాంటి సెక్యూరిటీ అప్‌డేట్స్ రావు. ఆ కంప్యూటర్లు వాడితే భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయి. ఈజీగా హ్యాకర్ల చేతికి చిక్కుతాయి.
Windows 10: విండోస్ 10 ఓఎస్‌పై పని చేసే కంప్యూటర్లు వాడుతున్న వారికి షాకింగ్ న్యూస్ చెప్పింది మైక్రోసాఫ్ట్. మరో రెండేళ్లలో విండోస్ 10 ఓఎస్‌కు సర్వీస్ సపోర్టు నిలిపివేయనున్నట్లు తెలిపింది. 2025 అక్టోబర్ 14 నుంచి విండోస్ 10పై పని చేసే కంప్యూటర్ల, ల్యాప్‌టాప్‌లకు సర్వీస్ సపోర్టు ఉపసంహరిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సుమారు 24 కోట్ల కంప్యూటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని కెనాలసిస్ రీసెర్చ్ అనే సంస్థ తెలిపింది.
PALLAVI PRASHANTH: అందుకే అరెస్ట్ ! చేసిందంతా పల్లవి ప్రశాంతే !
మైక్రోసాఫ్ట్ నిర్ణయం ప్రకారం.. 2025 అక్టోబర్ నుంచి విండోస్ 10పై ఎలాంటి సెక్యూరిటీ అప్‌డేట్స్ రావు. ఆ కంప్యూటర్లు వాడితే భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయి. ఈజీగా హ్యాకర్ల చేతికి చిక్కుతాయి. కంప్యూటర్‌లోని డేటాను ఈజీగా దొంగిలించే అవకాశం ఉంటుంది. దీంతో యూజర్లు తప్పనిసరిగా కొత్త కంప్యూటర్లు కొనుగోలు చేయాల్సి వస్తుంది. పాత వాటిని పక్కనపెట్టేసి, కొత్తవి కొనుగోలు చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు 480 మిలియన్ కిలోల ఈ-వ్యర్థాలు పోగవుతాయి. ఇది 3.2 లక్షల కార్ల వ్యర్థాలతో సమానం. అయితే, పాత కంప్యూటర్ల నుంచి ఉత్పత్తి అయ్యే ఈ-వేస్ట్ నుంచి హార్డ్ డిస్క్‌లను స్టోరేజ్ డివైజ్‌లుగా మార్చుకునే వీలుంది. కానీ, ప్రధాన విడిభాగాలైన ర్యామ్, మదర్ బోర్డ్ వంటి విడి భాగాలను సరైన పద్ధతిలో రీసైక్లింగ్ చేయాలని, లేకుంటే అవి పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తాయని కెనాలసిస్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. అయితే, మైక్రోసాఫ్ట్ నిర్ణయం వల్ల తలెత్తే ఈ-వేస్ట్‌పై ఆ సంస్థ స్పందించాల్సి ఉంది.
అయితే, విండోస్ 10 నుంచి విండోస్ 11కు అప్‌గ్రేడ్ కాకుండా ఉంటే.. వినియోగదారులు ఎక్స్‌టెండెడ్ సెక్యూరిటీ అప్‌డేట్స్ ప్రోగ్రామ్ కింద సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ తీసుకుంటే.. కంప్యూటర్లను ప్రతి నెలా సెక్యూరిటీ అప్‌డేట్స్ వస్తాయి. ఈ సపోర్ట్ కూడా మూడేళ్లపాటు.. అంటే 2028 అక్టోబర్ వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాతైన యూజర్లు పాత కంప్యూటర్లు మార్చాల్సిందే. పాత కంప్యూటర్ల నుంచి వెలువడే ఈ-వ్యర్థాలను ఇతర ఉత్పత్తుల తయారీలో వాడటం వల్ల కొంత ఉపయోగం ఉంటుంది.