మైక్రోసాఫ్ట్ ఒక్క రోజు ప్రపంచం మొత్తానికి చుక్కలు చూయించింది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన పీసీలు, ల్యాప్ టాప్ ల్లో ఒక్కసారిగా బ్లూ స్క్రీన్ రావడంతో వరల్డ్ మొత్తమ్మీద అన్ని సేవలకు అంతరాయం కలిగింది. విమానం, బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్లు, మీడియా, హాస్పిటల్స్ ఇలా... ప్రతి రంగంపైనా ఈ ఎఫెక్ట్ పడింది. అమెరికా, ఆస్ట్రేలియా, భారత్ లాంటి దేశాల్లో పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిలిచిపోవడంతో తీవ్ర నష్టం జరిగింది. కోట్ల మంది జనం ఇబ్బందులు పడ్డారు. మైక్రోసాఫ్ట్ ఎర్రర్ చూసి ఎవరైనా హ్యాకర్లు వైరస్ ఎటాక్ చేశారా అని చాలా మంది భయపడ్డారు. అయితే సైబర్ సెక్యూరిటీ సంస్థ... క్రౌడ్ స్ట్రైక్ అందించిన అప్ డేట్ లో బగ్ ఉండటం వల్ల సిస్టమ్స్ ఆగిపోయినట్టు తేలింది. ఆ సమస్యను గుర్తించి సాల్వ్ చేయడంతో మళ్ళీ కంప్యూటర్లు వర్క్ చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా విండోస్ OS వాడే డెస్క్ టాప్ లు, ల్యాప్ టాప్ లు 73శాతం దాకా ఉండటం వల్ల ఈ సమస్య తీవ్రత బాగా కనిపించింది. ఏంటి క్రౌడ్ స్ట్రైక్... అసలు ఎందుకు వచ్చిందీ సమస్య అని చాలామందికి డౌట్. మైక్రో సాఫ్ట్ సహా చాలా పెద్ద పెద్ద సంస్థలు ... హ్యాకర్లు, సైబర్ దాడుల నుంచి రక్షించుకోడానికి క్రౌడ్ స్ట్రైక్ అనే క్లౌడ్ ఆధారిత సైబర్ సెక్యూరిటీ సంస్థ అభివృద్ధి చేసిన సాఫ్ట్ వేర్ ను వాడుతున్నాయి. ఆ సంస్థ రీసెంట్ గా ఇచ్చిన అప్ డేట్ లో ఓ బగ్ ఉండటంతో... విండోస్ వాడే కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఎర్రర్ వచ్చి... లూప్ లో రీస్టార్ట్ అవడం మొదలుపెట్టాయి. 2011లో అమెరికాలోని టెక్సాస్ లో క్రౌడ్ స్ట్రైక్ సంస్థ ప్రారంభమైంది. 2013 నుంచి యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ ను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. మైక్రో సాఫ్ట్ కూడా తన విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ లో క్రౌడ్ స్ట్రైక్ ను వాడుతోంది... ఇది మామలూ యాంటీ వైరస్ ల కన్నా... చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. కానీ ఓ చిన్న బగ్ సృష్టించిన సంక్షోభంతో జులై 19 ఇంటర్నెట్ ప్రపంచంలోనే అతి పెద్ద డిజాస్టర్ డేగా మిగిలింది.