JIO Book: అతి తక్కువ ధరకే లాప్ టాప్.. డిజిటల్ రంగంలో జియో సునామీ
రిలయన్స్ అనగానే నిత్యవసరాల మొదలు ఎలక్ట్రానిక్ వస్తువుల వరకూ.. పెట్రోల్ మొదలు ఐస్ క్రీం వరకూ.. టెలికాం మొదలు తాజాగా మ్యూచువల్ ఫండ్స్ వరకూ అన్నింటా తానై తిష్టవేసుకొని కూర్చున్నారు. తాజాగా లాప్ టాప్ ను అతి తక్కు వ ధరకే అందిస్తూ రికార్డ్ సృష్టించారు.
గతంలో జియో కీపాడ్ మొబైల్, స్మార్ట్ ఫోన్ పేరుతో వినియోగదారులను ఆకర్షించారు జియో అధినేత ముకేశ్ అంబానీ. ఇప్పుడు రూ. 16,499 కే జియో లాప్ టాప్ ను దేశీయ మార్కెట్లో అందుబాటులోకి తెచ్చారు. దీనిని జియో బుక్ గా నామకరణం చేశారు. ఇంత తక్కువ ధరలో లాప్ టాప్ అంటే దీని ఫీచర్లు ఎలా ఉన్నాయో అన్న సందేహం అందరిలో కలుగుతుంది. అందుకే దీనిపై ఒక లుక్ వేద్దాం.
జియో బుక్ ఫీచర్స్
- 11.6 అంగుళాల యాంటీ గ్లేర్ హెచ్ డీ డిస్ ప్లే
- 990 గ్రాములు బరువు
- నెట్వర్క్ – 4 జీ
- జియో ఆపరేటింగ్ సిస్టం
- డ్యూయల్ బ్యాండ్ వైఫై కనెక్టివిటీ
- 2 గిగా హెట్జ్ ఆక్టాకోర్ చిప్ సెట్
- 4 జీబీ ఎల్పీడీడీఆర్ ర్యామ్
- 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్.. 256 జీబీ ఎక్స్ పాండబుల్ మెమరీ
- ఇన్ఫినిటీ కీబోర్డ్.. లార్జ్ మల్టీ గ్రెస్చర్ ట్రాక్ ప్యాడ్
- హెచ్ డీ వెబ్ క్యామ్.. స్టీరియో స్పీకర్స్
- వైర్ లెస్ ప్రింటింగ్
- ఇంటిగ్రేటెడ్ చాట్ బాట్
- స్క్రీన్ ఎక్స్ టెన్షన్
- ఇన్ బిల్ట్ యూఎస్బీ పోర్ట్.. హెచ్ డీ ఎం ఐ పోర్ట్
ఇన్ని ప్రత్యేకమైన ఫీచర్లు కలిగిన లాప్ టాప్ ఇంత తక్కువ ధరలో రావడం ఇదే తొలిసారిగా చెప్పాలి. ఇప్పుడున్న ఆన్ లైన్ యుగంలో పిల్లలకు క్లాసులు వినడానికి, హోం వర్క్ చేసుకోవడానికి, ఆఫీస్ వర్క్, ఆన్ లైన్ కాలింగ్ వంటి వాటికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఉంది. ఈ లాప్ టాప్ కొనుగోలు చేయాలంటే అమెజాన్, జియో స్టోర్స్, ఫ్లిప్ కార్ట్ తో పాటూ ఆప్ లైన్ మార్కెట్లోనూ ఆగస్ట్ 5 నుంచి అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.
T.V.SRIKAR