Wealthiest Cities: ధనవంతుల నగరం ఏంటో తెలుసా? అత్యధిక మంది కుబేరులు ఉన్న నగరాలు ఇవే!
ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూరప్, మిడిల్ ఈస్ట్, నార్త్ అమెరికా, సీఐఎస్ సహా మొత్తం 97 నగరాల నుంచి వివరాలు సేకరించింది. ఆయా నగరాల్లో ఎంత మంది మిలియనీర్లు ఉన్నారో లెక్కించింది. దీనిపై నివేదికను విడుదల చేసింది. తాజాగా విడుదలైన నివేదిక ప్రకారం.. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అత్యధిక మంది ధనవంతులు ఉన్నారు.
Wealthiest Cities: ప్రతి ఏడాది ధనవంతులకు సంబంధించిన జాబితా విడుదలవుతుంది. వారిలో ఎవరు, ఏ స్థానంలో ఉన్నారు అనే ఆలోచిస్తాం కానీ. వాళ్లంతా ఎక్కడ ఉంటారు అని ఆలోచించం. తాజాగా అలాంటి కుబేరులు ఎక్కువగా ఉండే నగరాలకు సంబంధించిన జాబితా విడుదలైంది. హెన్లీ అండ్ పార్ట్‌నర్ అనే సంస్థ మోస్ట్ మిలియనీర్ ఇన్ 2023 పేరుతో ఒక జాబితా విడుదల చేసింది.
ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది మిలియనీర్లు ఉన్నారు.. ఎక్కడెక్కడ ఉన్నారు అనే విషయాలపై నివేదిక సమర్పిస్తుంది. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూరప్, మిడిల్ ఈస్ట్, నార్త్ అమెరికా, సీఐఎస్ సహా మొత్తం 97 నగరాల నుంచి వివరాలు సేకరించింది. ఆయా నగరాల్లో ఎంత మంది మిలియనీర్లు ఉన్నారో లెక్కించింది. దీనిపై నివేదికను విడుదల చేసింది. తాజాగా విడుదలైన నివేదిక ప్రకారం.. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అత్యధిక మంది ధనవంతులు ఉన్నారు. దీంతో గతంలోలాగా ఈసారి కూడా అత్యధిక మంది కుబేరులు ఉన్న నగరంగా న్యూయార్క్ టాప్ పొజిషన్‌లో నిలిచింది. న్యూయార్క్‌లో 3,40,000 మంది మిలియనీర్స్ ఉన్నారు. కుబేరుల విషయంలో ఆ తర్వాతి స్థానంలో నిలిచింది జపాన్ రాజధాని టోక్యో. ఇక్కడ 2,90,300 మంది మిలియనీర్లు ఉన్నారు.
ఈ నగరాలతోపాటు ది బే ఏరియా, లాస్ ఏంజిల్స్, చికాగో వంటి నగరాల్లో మిలియనీర్లు ఉన్నారు. అమెరికాలోని ఎక్కువ నగరాల్లో అత్యధిక కుబేరులు ఉన్నారు. చైనాకు చెందిన బీజింగ్, షాంఘై నగరాలు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఇక 2,58,000 మందితో లండన్ నగరం ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 2,40,100 మంది మిలియనీర్లతో సింగపూర్ ఐదో స్థానంలో నిలిచింది. ఒకప్పుడు లండన్ నగరంలోనే అత్యధిక మంది కుబేరులు ఉండేవాళ్లు. 2000 నాటి జాబితాలో అత్యధిక మంది సంపన్నులతో లండన్ నెంబర్ వన్ స్థానంలో ఉండేది. రెండు దశాబ్దాల్లో ఈ పరిస్థితి మారిపోయింది. న్యూయార్క్ నగరంలో ప్రస్తుతం 3,40,000 మంది మిలియనీర్లు, 724 మంది సెంటీ మిలియనీర్లు, 58 మంది బిలియనీర్లు ఉన్నారు.
ఈ జాబితాలో ఇండియాలోని ముంబై 21వ స్థానంలో నిలిచింది. బ్లూక్లిన్, బ్రాంక్స్, మన్ హట్టన్, క్వీన్స్, స్టాటెన్ ఐలాండ్, మన్ హటన్ 5వ అవెన్యూ వంటివి ప్రపంచంలోని ప్రత్యేక నివాసాలున్న కాలనీలుగా గుర్తింపు దక్కించుకున్నాయి. ఇలాంటి చోట్ల ప్రధాన అపార్ట్‌మెంట్ల ధరలు చదరపు మీటర్‌కు 27 వేల డాలర్లకంటే ఎక్కువగానే ఉంటాయని ఈ నివేదిక తేల్చింది.