Wipro: హైటెక్ మాయలో ఐటీ ఉద్యోగాలు.. లే ఆఫ్ లు మాత్రమే కాదు.. క్యాంపస్ హైరింగ్ లూ లేవు..

గత దశాబ్ధం నుంచి ఎవరు చూసినా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నామని ఏదో కంపెనీ పేరు చెప్పేవారు. మరికొందరైతే ఫలానా కంపెనీలో క్యాంపస్ ఇంటర్వూలో సెలెక్ట్ అయ్యామని ఆనంద పరవశంలో మునిగి తేలేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు వాటికి భిన్నంగా మారిపోయాయి. భారత ఐటి రంగానికి చెందిన కొన్ని దిగ్గజ సంస్థలు తమ క్యాంపస్ హైరింగ్ ను ఈ ఏడాది 40శాతం వరకూ తగ్గించామని పేర్కొన్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 25, 2023 | 02:38 PMLast Updated on: May 25, 2023 | 2:38 PM

No Hirings From Campus Interviews

ఏమైంది ఈ సాప్ట్ వేర్ రంగానికి.. ఒకవైపు లే ఆఫ్ లు, మరోవైపు క్యాంపస్ హైరింగ్ లో కోత. సాధారణంగా ఏదైనా ఉన్నత చదువులు చదవాలంటే ఏ యూనివర్సిటీలో చేర్చాలి అని ఆలోచిస్తారు. మరి కొందరైతే ఈ కాలేజీలో క్యాంపస్ ఇంటర్వూస్ ఉంటాయా అని ఎంక్వైరీ కూడా చేస్తారు. ఇదంతా పేరెంట్స్ గొడవ. ఇక పిల్లల విషయానికొస్తే ఎడ్యూకేషన్ ఎలా ఉంటుందో అని కొందరు.. ఎలాగోలో ఈ కోర్సు పూర్తి చేస్తే చాలు అనే టెన్షన్లో మరి కొందరు ఉంటారు. ఇలాంటి క్యాంపస్ సెలక్షన్లపై ఐటీ కంపెనీలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం కారణంగా ఎప్పుడు ఏ కంపెనీ కుప్పకూలుతుందో అన్న భయం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఇక పని చేసే ఉద్యోగుల్లో అయితే నిద్ర కూడా పట్టడం లేదు. తెల్లవారే సరికి ఎక్కడ లే ఆఫ్ మెయిల్ వస్తుందో అనే ఆందోళనలో గడిపేస్తున్నారు. ఇలా భయానికి.. ఆందోళనకి మధ్య జీవనం సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. అమెరికా వంటి దేశాల్లో బ్యాంకుల పతనం, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభాలు దీనికి ప్రత్యేక ఉదాహరణలుగా చెప్పాలి. పెట్టుబడులు లేక ఉన్న వాటికి సత్పలితాలు రాక ఐటీ రంగం కుదేలవుతోంది. ఇలాంటి తరుణంలో కొత్త ప్రాజెక్టులు రావడం లేదు. దీంతో ఉన్న వారినే విధుల నుంచి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పాడింది.

గ్లోబల్ ఇన్వెస్టర్లు కూడా విరివిగా పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా లేరు. గతంలో వచ్చిన నష్టాలను పూడ్చుకునే ప్రయత్నాల్లో భాగంగా ఉన్న స్టాఫ్ సంఖ్యను తగ్గించుకుంటున్నారు. అలాగే ఖర్చును తగ్గించుకునేందుకు పావులు కదుపుతున్నాయి. తక్కు వ వేతనాలకు పనిచేస్తామనే మంచి టాలెంట్, అగ్రెసివ్ ప్రోగ్రెస్ కలిగిన వారికి మాత్రమే పనిలో కొనసాగించుకుంటున్నారు. ఒకప్పుడు దిన దిన గండం నూరేళ్లు ఆయుష్శు అన్న నానుడి సరిగ్గా సూటవుతుంది.

Software Employees

తాజాగా టీమ్ లీజ్, విప్రో, టీసీఎస్ వంటి పలు ప్రదాన స్రవంతి కంపెనీలు క్యాపంస్ రిక్యూట్ మెంట్లను 2024లో తక్కువ గా నియమించుకునేలా ప్రణాళికలు సిద్దంచేసుకున్నాయి. 2022-23లో ఐటీ కంపెనీలు 2లక్షలా 50వేల మందికి పైగా ఉద్యోగులను నియమించుకున్నారు. ఆ సంఖ్య 2023-24 కు వచ్చేసరికి లక్షా 50వేల కంటే తక్కువగా పడిపోయింది. అంటే దాదాపు 50 శాతం ఉద్యోగ నియామకాల్లో కోతలు విధించాయి. ఇదే క్రమంలో ఈ ఏడాది విప్రో క్యాంపస్ హైరింగ్ కి పోవడంలేదని విప్రో హ్యూమన్ రిసోర్స్ చీఫ్ సౌరవ్ గోవిల్ పేర్కొన్నారు.

గతంతో పోలిస్తే విద్యార్థుల ప్రతిభలో, టాలెంట్లో చాలా భిన్నమైన మార్పులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఫ్రెషర్లకు ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ వారి పనితీరును దృష్టిలో ఉంచుకొని గతంలో ఇచ్చేవారి జీతాల్లో 50శాతం మాత్రమే ఇస్తున్నట్లు తెలిపింది. అంటే గతంలో ట్రైనింగ్ పీరియడ్లో పాతిక వేలు ఇచ్చే వారికి ఇప్పుడు రూ.15వేలు ఇచ్చి పనిచేయించుకుంటున్నారు. దీనిపై తీవ్రమైన విమర్శలు ఉద్యోగుల నుంచి వెలువడింది.

ఏది ఏమైనా సాప్ట్ వేర్ రంగుల ప్రపంచం.. వీకెండ్ హాలిడే.. ఐదంకెల జీతం..లక్షల్లో ప్యాకేజి.. ప్రాశ్చాత్య సంస్కృతి.. జాలీ లైఫ్.. పబ్బులు.. అంటూ ఎంజాయ్ లైఫ్ గడుపుతూ ఉంటారు. వీరి మాటలు విని త్వరలో తాము కూడా ఇలాంటి వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు అనుకొని మాయలో ఉన్న వారికి ఈ దెబ్బతో మబ్బు వదిలినట్లు అయ్యింది అని చెప్పాలి.

 

T.V.SRIKAR