Phone Pay: ట్రాన్సాక్షన్ టెన్షన్ ఎందుకు దండగా.. యూపీఐ లైట్ ఫీచర్ ఉండగా..

నేటి సమాజంలో ఎటు చూసినా క్యూఆర్ కోడ్ ద్వారా యూపీఐ లావాదేవీలు జరుపుతూ ఉంటారు. ఇలాంటి వారికోసం ప్రత్యేక ఫీచర్ ను ఫోన్ పే అందుబాటులోకి తీసుకురానుంది. దీనిపేరే యూపీఐ లైట్ ఫీచర్. దీనిని ఉపయోగించి వేగవంతంగా, ఖచ్చితత్వంతో కూడిన మనీ ట్రాన్స్ఫర్స్ చేయవచ్చు. వీటిని ఎలా వాడాలి, దీని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 4, 2023 | 02:45 PMLast Updated on: May 04, 2023 | 3:02 PM

Phone Pay New Feature

ప్రస్తుతకాలంలో జేబులో డబ్బులు ఎవరూ పెట్టుకోవడం లేదు. పాల ప్యాకేట్ కొనుగోలు నుంచి కూరగాయల వరకూ అన్ని చిల్లర లావాదేవీలు యూపీఐ ద్వారా ఫోన్ పే, గూగుల్ పే ఉపయోగించి చేస్తున్నారు. అలాంటి వారికోసం పేటీఎం ఈ సంవత్సరం ఫిబ్రవరి మాసాంతంలో యూపీఐ లైట్ అనే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా నగదు బదిలీలు జరపాలంటే ముందుగా యూపీఐ లైట్ వ్యాలెట్ లో కనిష్టంగా 100 నుంచి గరిష్టంగా 2వేల రూపాయల వరకూ జమ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తరువాత క్యూఆర్ కోడ్ ను ఉపయోగించి జరిపే ఏ చిన్న ట్రాన్సాక్షన్ అయినా చిటికలో అయిపోయేందుకు వీలుగా ఉండేలా తయారు చేశారు.

పిన్ లేకుండా నగదు బదిలీ

సాధారణంగా ఇలా ఆన్ లైన్ పేమెంట్ చేసే విషయంలో కొన్ని సార్లు నెట్వర్క్ సమస్య ద్వారా నగదు వ్యాపారస్తునికి జమ అవ్వక, మన ‎ఖాతాలో చెల్లింపు జరిగి చూపింస్తుంది. అంటే దీని అర్థం హోల్డ్ లో ఉన్నట్లు గుర్తించి కస్టమర్ కేర్ కి కాల్ చేసి లావాదేవీకి సంబంధిత వివరాలను చెప్పాలి. అప్పుడు వారు స్పందించి మన నగదును 48 గంటల లోపూ మన వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లో జమ అయ్యేలా చేస్తారు. ఇలాంటి రిస్కులను జయించేందుకు ఇది దోహదపడుతుంది. మన మొబైల్ నెట్వర్క్ ఇష్యూ తలెత్తినా, బ్యాంక్ సర్వర్ డౌన్ అయినా దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. వేగంగా సురక్షితంగా డబ్బులు బదిలీ అవుతాయి. అంతేకాకుండా మరో అద్భుతమైన ఫీచర్ ను కూడా తీసుకువచ్చారు. ఈ లైట్ పేమెంట్ ఫీచర్ ద్వారా రూ. 200 వందల లోపూ ట్రాన్సాక్షన్స్ ను ఎలాంటి పిన్ ఎంటర్ చేయకుండానే పంపించవచ్చు.

వేగం – సురక్షితం

ఈ సరికొత్త ఫీచర్ ను భారతదేశంలోని అన్ని బ్యాంకులు స్వాగతించాయి. ఈ విషయాన్ని స్వయంగా ఈ సంస్థ సీఈవో సమీర్ నిఘమ్ తెలిపారు. యూపీఐ మర్చంట్స్ తోపాటూ క్యూఆర్ కోడ్ చెల్లింపులు వేగవంతంగా జరిగేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ ఫీచర్ ను వినియోగించే వారికి తమ వ్యాలెట్ లో ఎంత డబ్బులు ఎవరెవరికి ఎంతెంత పంపించామనే పూర్తి స్థాయి స్టేట్మెంట్ రికార్డ్ వివరాలను చూసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. దీనికోసం ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఇందులో నుంచి జరిగే ప్రతి నగదు బదిలీ గురించి పూర్తి వివరాలతో మెసేజ్ అలర్ట్స్ కూడా పొందవచ్చు.

నెట్వర్క్ లేకున్నా సక్సస్ ఫుల్ పేమెంట్స్ 

ఈ ఫీచర్ ను తీసుకువచ్చేందుకు ప్రదాన కారణం నెట్ వర్క సమస్యను అధిగమించడం. టెన్షన్ ఫ్రీ లావాదేవీలను వినియోగదారునికి అందించడం. మనం గత కొంత కాలంగా గమనించినట్లయితే ఫోన్ పే, గూగుల్ పే ద్వారా జరిపే నగదు బదిలీలు అప్పుడప్పుడూ సకాలంలో జరగక తీవ్ర ఇబ్బందికి గురిచేస్తూ ఉంటాయి. దీనిని అధిగమించేందుకు గత ఏడాది చివరిమాసంలో నేషనల్ పేమెంట్ కార్పోరేషన్ ఆదేశాలు జారీచేసింది. దీని ద్వారా రూ. 200 లోపూ చిన్న చిన్న పేమెంట్స్ ను నెట్వర్క్ లేకున్నా విజయవంతంగా జరిగేలా సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.

 

T.V.SRIKAR