LAY OFFS: గూగుల్ మీట్‌లోనే ఊడిన ఉద్యోగాలు.. 2 నిమిషాల్లోనే మొత్తం మందిని తొలగించిన కంపెనీ
తాజాగా ఒక కంపెనీ.. తమ ఉద్యోగుల్ని తొలగించిన తీరే షాక్‌కు గురి చేస్తోంది. గూగుల్ మీట్‌లో, రెండు నిమిషాల్లోనే ఏకంగా 200 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. వీడియో కాల్ మాట్లాడుతుండగానే లేఆఫ్‌లు ప్రకటించింది. కేవలం 2 నిముషాల్లోనే అంతా జరిగిపోయింది.
LAY OFFS: ఐటీ సహా, ఇతర అనుబంధ సంస్థల్లో ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ దాదాపు ఏడాదిన్నరగా కొనసాగుతోంది. ఇప్పటికే లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇదంతా ఇప్పుడు సాధారణమే అయినా.. తాజాగా ఒక కంపెనీ.. తమ ఉద్యోగుల్ని తొలగించిన తీరే షాక్‌కు గురి చేస్తోంది. గూగుల్ మీట్‌లో, రెండు నిమిషాల్లోనే ఏకంగా 200 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. వీడియో కాల్ మాట్లాడుతుండగానే లేఆఫ్‌లు ప్రకటించింది. కేవలం 2 నిముషాల్లోనే అంతా జరిగిపోయింది.
YS JAGAN: కేసీఆర్‌తో జగన్ రహస్య చర్చలు.. ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారు..?
దీంతో వీడియో కాల్‌లోనే ఉద్యోగాలు పోవడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఒక మీడియా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫ‌్రంట్ డెస్క్ అనే ఐటీ కంపెనీ సీఈవో లైల్ వీడియో కాల్‌లో ఇలా ఉద్యోగుల్ని తొలగించాడు. 200 మంది ఉద్యోగుల్ని మాత్రమే తొలగించారు అనుకుంటారేమో.. అక్కడి ఉంది మరో ట్విస్టు. ఆ ఉన్నదే మొత్తం 200 మంది ఉద్యోగులు. అంటే సంస్థలోని ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్ వర్కర్స్‌తో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులనూ ఒకేసారి తొలగించింది. కానీ, ఉద్యోగులకు మరో రెండు వారాల సమయం ఇచ్చారు. ఆలోగా కొత్త ఉద్యోగాలు వెతుక్కోవాలని సూచించారు. దీనికి గల కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. 2017లో మొదలైన ఈ కంపెనీ మొదట్లో చాలా వేగంగా పుంజుకుంది. దాదాపు 26 మిలియన్ డాలర్ల పెట్టుబడులు రాబట్టుకోగలిగింది. ఆ తర్వాత నిధులు రాబట్టుకోలేక విఫలమైనట్లు తెలుస్తోంది.
ఇతర సవాళ్లు కూడా ఎదురుకావడంతో కంపెనీ నష్టాల్లో మునిగిందని, దీంతో ఉద్యోగుల్ని తొలగించిందని సమాచారం. ప్రస్తుతం అనేక టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని వరుసగా తొలగిస్తున్నాయి. ఎక్స్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి ప్రముఖ సంస్థలు కూడా వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించాయి.