Paytm app: ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం యాప్ పని చేయదా..? కంపెనీ ఏం చెప్పింది..?
ఫిబ్రవరి 29 వరకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలకు ఆర్బీఐ అనుమతించింది. ఆ తర్వాత నుంచి కొత్త కస్టమర్లను చేర్చుకోవడం చేయొద్దని, నగదు లావాదేవీలు, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ చేయకూడదని ఆర్బీఐ ఆదేశించింది
Paytm app: ప్రస్తుతం పేటీఎం యాప్ విషయంలో వినియోగదారుల్లో గందరగోళం నెలకొంది. ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటీఎం పని చేయదేమోనని సందేహాలు కలుగుతున్నాయి. అయితే, వీటికి చెక్ పెడుతూ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ వర్మ స్పందించారు. ఫిబ్రవరి 29 తర్వాత కూడా పేటీఎం ఎప్పట్లాగే పని చేస్తుందన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
KTR: బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయంపై సీఎం ఎందుకు స్పందించరు: కేటీఆర్
“పేటీఎంకు సపోర్టు చేస్తున్న ప్రతి వినియోగదారుడికి సెల్యూట్ చేస్తున్నా. ప్రతి సవాల్‌కు ఒక పరిష్కారం ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగా దేశ సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నాం. పేమెంట్స్ విషయంలో భారత్ తీసుకొస్తున్న ఆవిష్కరణలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తూనే ఉంటాయి” అని విజయ్.. తన ఎక్స్ అకౌంట్లో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందన్న కారణంతో.. పేటీఎం పేమెంట్ బ్యాంక్‌పై ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఆర్బీఐ నిర్ణయంతో పేటీఎం షేర్లు భారీగా పతనయమ్యాయి. రెండు రోజుల్లోనే దాదాపు 40 శాతం షేర్లు తగ్గాయి. ఫిబ్రవరి 29 వరకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలకు ఆర్బీఐ అనుమతించింది. ఆ తర్వాత నుంచి కొత్త కస్టమర్లను చేర్చుకోవడం చేయొద్దని, నగదు లావాదేవీలు, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ చేయకూడదని ఆర్బీఐ ఆదేశించింది. పేటీఎం వ్యాలెట్లు, అకౌంట్లలో డబ్బు జమ చేసేందుకు, తీసేందుకు, ఇతర లావాదేవీలకు అనుమతి ఉండదని పేర్కొంది. అయితే, కస్టమర్ల డబ్బు తమ వద్ద భద్రంగా ఉందని, ఏ సహాయం కావాలన్నా తాము 24 గంటలు అందుబాటులో ఉంటామని పేర్కొంది.
పేటీఎం ఫాస్టాగ్ వాడుకోవచ్చా?
పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఫాస్టాగ్ విషయంలో కూడా సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. పేటీఎం ఫాస్టాగ్ బ్యాలెన్స్ అయిపోయేంత వరకు కస్టమర్లు దాన్ని ఉపయోగించవచ్చు. అలాగే ఫిబ్రవరి 29 వరకు దీన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు. అంటే.. ఈ రీచార్జ్ పూర్తయ్యే వరకు పేటీఎం ఫాస్టాగ్ వాడుకోవచ్చు. ఆ తర్వాత దాని స్థానంలో వేరే బ్యాంక్ నుంచి కొత్త ఫాస్టాగ్ పొందాలి. ఫాస్టాగ్‌కు మద్దతిచ్చే బ్యాంకుల్లో దేనినుంచైనా ఎంచుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా టోల్స్ చెల్లించవచ్చు. పేటీఎం ఫాస్టాగ్‌లో ఉన్న బ్యాలెన్స్‌ను పూర్తిగా వాడుకునేందుకు అవకాశం ఉంది. కానీ, ఈ బ్యాలెన్స్‌ను ఇతర బ్యాంకులకు బదిలీ చేయడం కుదరదు.