Paytm: పేటీఎంకు RBI బిగ్ షాక్.. షేర్ హోల్డర్స్ ఆందోళన…!
ప్రముఖ ఫిన్ టెక్ కంపెనీ పేటీఎం (Paytm) కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి 29 తరువాత ఏ కస్టమర్, ప్రీపెయిడ్ ఇన్ స్ట్రుమెంట్, వ్యాలెట్, ఫాస్టాగ్స్ లో డిపాజిట్లు, టాప్ – అప్ లు చేపట్టరాదని ఆదేశించింది.
ప్రముఖ ఫిన్ టెక్ కంపెనీ పేటీఎం (Paytm) కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి 29 తరువాత ఏ కస్టమర్, ప్రీపెయిడ్ ఇన్ స్ట్రుమెంట్, వ్యాలెట్, ఫాస్టాగ్స్ లో డిపాజిట్లు, టాప్ – అప్ లు చేపట్టరాదని ఆదేశించింది. RBI నిర్ణయంతో… ఫిన్ టెక్ కంపెనీల్లో మేజర్ గా ఉన్న పేటీఎం కష్టాల్లోకి కూరుకుపోనుంది. దేశంలోని పోటీదారులను తట్టుకుని నిలబడేందుకు నానా తంటాలు పడుతున్న టైమ్ లో RBI తీసుకున్న నిర్ణయం Paytmకు ఇబ్బందిగా మారింది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆంక్షలు విధించింది. ఫిబ్రవరి 29 తర్వాత కొత్త డిపాజిట్లు తీసుకోవడంతో సహా ఎలాంటి క్రెడిట్ లావాదేవీలు నిర్వహించరాదని పరిమితులు పెట్టింది. కొత్త కస్టమర్లను ఆన్‌బోర్డింగ్ చేయకుండా ఇప్పటికే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ని RBI నిషేధించింది. సమగ్ర సిస్టమ్ ఆడిట్ నివేదికతో పాటు బయటి ఆడిటర్స్ రిపోర్ట్ లోనూ PayTM బ్యాంకు నిబంధనలు పాటించడం లేదని తేలినట్టు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. మెటీరియల్ సూపర్‌వైజరీపైనా ఆందోళన వ్యక్తం చేసింది. One97 కమ్యూనికేషన్స్, పేటీఎం నోడల్ ఖాతాలను తొందరగా ముగించాలని కోరింది. మిగతా లావాదేవీలను మార్చి 15లోగా సెటిల్ చేయాలని పేటీఎంను ఆర్బీఐ ఆదేశించింది.
ఫిబ్రవరి 29, 2024 తర్వాత కస్టమర్స్ ఖాతాలు, ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్‌లు, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, NCMC కార్డ్‌లు మొదలైన వాటిలోకి డిపాజిట్లు, క్యాష్‌బ్యాక్‌లు లేదా క్రెడిట్ రీఫండ్‌లు అనుమతించరాదని RBI ఆదేశించింది. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్, ప్రీపెయిడ్ వ్యాలెట్స్ లో డిపాజిట్ గా ఉన్న క్యాష్ ను ఎలాంటి పరిమితి లేకుండా కస్టమర్స్ విత్ డ్రా చేసుకోవచ్చు. లేదా ఏవైనా అవసరాలకు వాడుకోవచ్చని RBI తెలిపింది. ఇంట్రెస్ట్, క్యాష్ బ్యాక్, రిఫండ్స్ కు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు దక్కింది. RBI ఆదేశాల ప్రకారం PayTM కొత్త కస్టమర్లను చేర్చుకోడానికి అవకాశం లేదు. 2022 మార్చిలో కూడా పేమెంట్స్ బ్యాంక్ పై RBI కఠిన చర్యలు తీసుకుంది. బ్యాంక్ లో నిబంధనలు ఉల్లంఘించనట్టు గుర్తించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు RBI తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ నిర్ణయంతో PayTM షేర్ హోల్డర్స్ లో ఆందోళన వ్యక్తమవుతోంది. షేర్లు భారీగా పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.