RBI New Guidelines: బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అలాంటి ఖాతాలపై పెనాల్టీ బంద్..!
వాడకుండా ఉన్న ఖాతాలపై పెనాల్టీ వేయకూడదు. వినియోగదారులకు ఎస్సెమ్మెస్, ఈమెయిల్స్ వంటివి పంపించి, వారికి ఈ విషయం తెలియజేయాలి. ఒకవేళ ఖాతాదారుల నుంచి స్పందన లేకపోతే.. అకౌంట్‌లోని నామినీలకు సమాచారం అందించాలి.
RBI New Guidelines: బ్యాంకు వినియోగదారులకు ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఇన్‌ఆపరేటివ్ సేవింగ్స్ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ లేకపోతే జరిమానా విధించకూడదని ఆర్బీఐ.. బ్యాంకుల్ని ఆదేశించింది. చాలా మంది.. స్కాలర్‌షిప్‌లు, ప్రభుత్వ పథకాల కోసం బ్యాంక్ ఖాతాలు తీస్తుంటారు. ఆ డబ్బులు వచ్చినప్పుడు మాత్రమే ఈ అకౌంట్లను వాడుతుంటారు. మిగతా సమయాల్లో పెద్దగా వినియోగించారు. ఇలా రెండేళ్లపాటు అకౌంట్లను వాడకపోతే వాటిని ఇన్ ఆపరేటివ్ అకౌంట్లుగా పరిగణిస్తారు.
country petrol prices : పెట్రోల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ..
ఆ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు పెనాల్టీ విధిస్తాయి. అకౌంట్లలోని డబ్బును తీసుకుంటాయి. కొన్నిసార్లు అకౌంట్ బ్యాలెన్స్ మైనస్‌కు చేరుకుంటుంది. అయితే, ఇలాంటి ఖాతాలపై ఇకపై ఎలాంటి జరిమానాలు విధించవద్దని, వాటిని ఇన్ ఆపరేటివ్ అకౌంట్లుగా పరిగణించకూడదని ఆర్బీఐ ఆదేశించింది. ఇలాంటి ఖాతాలు భారీ స్థాయిలో ఉన్నాయి. చాలా కాలంగా వాడకుండా ఉన్న ఇలాంటి ఖాతాల సంఖ్యను తగ్గించేందుకు ఆర్బీఐ తాజాగా ఈ నిబంధన తీసుకొచ్చింది. ఈ రూల్ వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమలుకానుంది. వాడకుండా ఉన్న ఖాతాలపై పెనాల్టీ వేయకూడదు. వినియోగదారులకు ఎస్సెమ్మెస్, ఈమెయిల్స్ వంటివి పంపించి, వారికి ఈ విషయం తెలియజేయాలి. ఒకవేళ ఖాతాదారుల నుంచి స్పందన లేకపోతే.. అకౌంట్‌లోని నామినీలకు సమాచారం అందించాలి. అంతేకాదు.. చాలా కాలంగా వాడకుండా ఉన్న అకౌంట్లను రీ యాక్టివేట్ చేయడానికి కూడా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదు.
అలాగే ఆ ఖాతాల్లోని బ్యాలెన్స్ మైనస్‌కు చేరకూడదు. అయితే, పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలపాటు వినియోగించని బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును ఆర్బీఐ.. డిపాజిటర్ అండ్ ఎడ్యుకేషన్ అవేర్‌నెస్ ఫండ్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఆర్బీఐ నిర్ణయం వల్ల కోట్లాదిమంది ఖాతాదారులకు మేలు జరగనుంది. ఇటీవలి నివేదిక ప్రకారం.. బ్యాంకుల వద్ద ఎవరూ క్లెయిమ్ చేయని డిపాజిట్ల సొమ్ము రూ.32,934 కోట్లు ఉంది.