Budget 2024: హోమ్‌లోన్ తీసుకున్నారా.. బడ్జెట్‌లో మీకో గుడ్ న్యూస్..
హోమ్ లోన్‌పై అసలు, వడ్డీపై ఇస్తున్న పన్ను మినహాయింపు పెంచాలని రియల్ ఎస్టేట్ సంస్తలు ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో ఈ ప్రోత్సాహం ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
Budget 2024: రాబోయే ఫిబ్రవరి 1న కేంద్రం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. అసలే ఎన్నికల సమయం కావడంతో సామాన్యులకు ఊరట కలిగించే నిర్ణయాలు ఉంటాయని అంతా ఆశిస్తున్నారు. అందుకే ఈ బడ్జెట్ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, రాబోయేది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే. అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు మాత్రమే అమలయ్యే బడ్జెట్. దీంతో గతంలోలాగా బడ్జెట్‌లో కీలక నిర్ణయాలు ఉండకపోవచ్చు.
Mamata Banerjee: ఇండియా కూటమికి మమత షాక్.. లోక్‌సభ ఎన్నికల బరిలో ఒంటరిగానే పోటీ..?
కానీ, మధ్య తరగతిని ఆకట్టుకునేలా ఉపాధి కల్ప, అభివృద్దికి ఊతమిచ్చే చర్యలు ఉంటాయని భావిస్తున్నారు. ఎందుకంటే బడ్జెట్ ప్రభావం ఎన్నికలపై ఉంటుంది. బడ్జెట్‌లో ప్రజల్ని ఆకట్టుకునే నిర్ణయాలుంటే.. అధికార పార్టీకి మేలు జరుగుతుంది. దీని ప్రకారం.. వచ్చే బడ్జెట్‌లో హోమ్ లోన్ తీసుకునే సామాన్యులకు లబ్ధి కలిగే నిర్ణయాలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హోమ్ లోన్‌పై అసలు, వడ్డీపై ఇస్తున్న పన్ను మినహాయింపు పెంచాలని రియల్ ఎస్టేట్ సంస్తలు ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో ఈ ప్రోత్సాహం ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం హోమ్ లోన్స్‌పై చెల్లిస్తున్న అసలుపై రూ.1.50 లక్షల వరకు సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు ఉంది. వడ్డీపై సెక్షన్ 24 (బి) ప్రకారం.. రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది.
అయితే, వడ్డీపై పన్ను మినహాయింపు మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) ప్రభుత్వాన్ని కోరింది. ఈ నిర్ణయం వల్ల రియల్ ఎస్టేట్ రంగం, జీడీపీ, ఉద్యోగాల కల్పన, మౌలిక వసతుల వృద్దికి తోడ్పడుతుందని క్రెడాయ్ అంటోంది. ఈ ప్రతిపాదనలకు ఈసారి కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని విశ్లేషకుల అంచనా. ఇదే జరిగితే.. హోమ్ లోన్ తీసుకునేవారికి పన్ను మినహాయింపు ద్వారా భారీ ప్రయోజనం చేకూరినట్లే.