Samantha Business: సమంత.. ది బిజినెస్ ఉమెన్..!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత వ్యాపారవేత్తగా మరో అడుగు ముందుకు వేసారు. సూపర్‌ఫుడ్ బ్రాండ్‌లో పెట్టుబడులు పెట్టారు. సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా ఎదిగిన సామ్.. మరి సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమెన్‌గా మారతారా...? ఇంతకీ సమంత ఎందులో పెట్టుబడులు పెట్టారో తెలుసా...?
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను నేటి హీరోయిన్లు నిజం చేస్తున్నారు. ఫామ్‌లో ఉన్నప్పుడే వచ్చిన వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ఫీల్డ్‌లోంచి వెళ్లిపోయినా తమ ఇన్‌కంకు ఎలాంటి డోకా లేకుండా చూసుకుంటున్నారు. తాజాగా సమంత (Samantha) మరో సంస్థలో పెట్టుబడులు పెట్టారు.
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత వ్యాపారవేత్తగా మరో అడుగు ముందుకు వేసారు. సూపర్‌ఫుడ్ బ్రాండ్‌లో పెట్టుబడులు పెట్టారు. సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా ఎదిగిన సామ్.. మరి సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమెన్‌గా మారతారా…? ఇంతకీ సమంత ఎందులో పెట్టుబడులు పెట్టారో తెలుసా…?
పోషకాహార ఉత్పత్తులను అందిస్తున్న అంకుర సంస్థ నరిష్ యులో (Nourish You) సమంత పెట్టుబడులు పెట్టారు. ఇది ఇండియాలోనే మొదటి సూపర్‌ఫుడ్ బ్రాండ్ (Super Food Brand). సీడ్ ఫండింగ్‌లో భాగంగా ఆ సంస్థ సుమారు రూ.16.5కోట్లు సమీకరించింది. అందులో సమంత భాగస్వామ్యం ఉన్నట్లు నరిష్ యు ప్రకటించింది. అయితే ఆమె ఎంత మొత్తం పెట్టుబడి పెట్టారన్నది మాత్రం ప్రకటించలేదు. జనవరిలోనే ఈ పెట్టుబడి పెట్టినా లేటెస్ట్‌గా వివరాలు బయటపెట్టారు. పాతకాలపు ఆహార పద్ధతులను మళ్లీ ప్రజలకు పరిచయం చేయడం, పోషకాహార ఉత్పత్తులను అభివృద్ధి చేస్తుందీ సంస్థ. ఇప్పటికే ఇందులో స్టాక్‌బ్రోకింగ్ సంస్థ జిరోదా (zeroda) సహవ్యవస్థాపకుడు నికిల్ కామత్ (nikhil kamat), కిమ్స్ హాస్పిటల్ సీఈఓ అభినయ్ బొల్లినేని (Abhinay Bollineni), ట్రయంప్ గ్రూప్‌కు చెందిన జనార్ధనరావు (Janardhan Rao)లు పెట్టుబడులు పెట్టారు. క్వినోవా, చియా వంటి సూపర్‌ఫుడ్స్‌ను ఇండియాకు తీసుకొచ్చిన నరిష్ యు తనను ఇంప్రెస్ చేసిందని సమంత పేర్కొన్నారు. దేశీయంగా వాటిని ఉత్పత్తి చేయడం, తృణధాన్యాల వంటి సూపర్‌ఫుడ్స్‌ను ప్రమోట్ చేయడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. మొక్కల ఆధారిత మిల్లెట్ మిల్క్‌ను సమంత విడుదల చేశారు.
సమంత ఇప్పటికే ఈ-కామర్స్ కంపెనీ సాకి(Saaki)ని ప్రారంభించారు. హైదరాబాద్ కేంద్రంగా నడిచే ఓ స్కూల్‌లోనూ ఆమె పెట్టుబడులు పెట్టారు. ఆర్గానిక్ కూరగాయలు పండించే ఓ టెర్రస్ గార్డెన్ కంపెనీలోనూ సమంత ఇన్వెస్ట్ చేసినట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే అందులో సమంత పెట్టుబడి నష్టపోయినట్లు తెలుస్తోంది. అయితే మిగిలినవి బాగానే నడుస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఈ సూపర్ ఫుడ్స్‌లో సమంత పెట్టుబడులు పెట్టారు.
ఇటీవలి కాలంలో చాలామంది హీరోయిన్లు రకరకాల వ్యాపారాల్లో ప్రవేశించారు. రకుల్ ప్రీత్‌సింగ్ జిమ్స్ స్టార్ట్ చేసింది. ఇక కాజల్, తమన్నాలు జ్యుయలరీ వ్యాపారంలోకి దిగారు. అయితే వాటిని త్వరగానే మూసేశారు. అయితే సమంత మాత్రం అలా కాదు. తన పెట్టుబడులు సురక్షితంగా ఉండేలా జాగ్రత్త పడుతుందని టాలీవుడ్‌లోని ఆమె మిత్రులు చెబుతున్నారు. ఎంతైనా కామర్స్ స్టూడెంట్ కదా…
సమంత మూవీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి 12ఏళ్లయ్యింది. సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. సినిమాలతో పాటు ఎన్నో బ్రాండ్లకు ప్రమోషన్ చేసింది. నాగచైతన్యతో వివాహం, ఆ తర్వాత విడాకులు చకచకా జరిగిపోయాయి. ఆ బాధ నుంచి బయటపడకముందే మయోసైటిస్ బారిన పడింది. దాన్నుంచి ఇప్పుడిప్పుడే పూర్తిగా కోలుకుంటోంది. మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన సామ్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన పాన్ ఇండియా మూవీ శాకుంతలం విడుదలకు సిద్ధంగా ఉంది.