TATA, JIO Fight : జియోకు టాటాల దెబ్బ…. ముకేశ్ కి గట్టి షాకిచ్చిన రతన్ టాటా

జనం అన్ లిమిటెడ్ కాల్స్ కి అలవాటు పడ్డారు... మొబైల్ డేటా లేకపోతే ఒక్క నిమిషం కూడా బతకలేరు... నేను ఎంత పెంచినా కిక్కురుమనకుండా రీఛార్జ్ చేయించుకుంటారు. నాకు తిరుగులేదని విర్రవీగుతున్నారు జియో అధినేత ముకేశ్ అంబానీ. దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా జియో రీఛార్జీల మోత గురించే చర్చ జరుగుతోంది. జియో రీఛార్జీలును భారీగా పెంచడం చూసి... ఎయిర్ టెల్, ఐడియా కూడా పెంచిపారేశాయి. హయ్యస్ట్ గా 25 శాతం దాకా మొబైల్ రీఛార్జీల రేట్లు పెరగడంతో కస్టమర్లు బెంబేలెత్తుతున్నారు. ఇదే టైమ్ లో అదును చూసి దెబ్బకొట్టింది టాటా. రతన్ టాటా తీసుకున్న నిర్ణయంతో జియోకి పెద్ద షాక్ తగలబోతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 17, 2024 | 02:36 PMLast Updated on: Jul 17, 2024 | 2:37 PM

Tata Jio Fight Supports To Bsnl

జనం అన్ లిమిటెడ్ కాల్స్ కి అలవాటు పడ్డారు… మొబైల్ డేటా లేకపోతే ఒక్క నిమిషం కూడా బతకలేరు… నేను ఎంత పెంచినా కిక్కురుమనకుండా రీఛార్జ్ చేయించుకుంటారు. నాకు తిరుగులేదని విర్రవీగుతున్నారు జియో అధినేత ముకేశ్ అంబానీ. దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా జియో రీఛార్జీల మోత గురించే చర్చ జరుగుతోంది. జియో రీఛార్జీలును భారీగా పెంచడం చూసి… ఎయిర్ టెల్, ఐడియా కూడా పెంచిపారేశాయి. హయ్యస్ట్ గా 25 శాతం దాకా మొబైల్ రీఛార్జీల రేట్లు పెరగడంతో కస్టమర్లు బెంబేలెత్తుతున్నారు. ఇదే టైమ్ లో అదును చూసి దెబ్బకొట్టింది టాటా. రతన్ టాటా తీసుకున్న నిర్ణయంతో జియోకి పెద్ద షాక్ తగలబోతోంది.
ఈ నెలల్లో కొత్తగా రీఛార్జీ చేసుకునేవారి మీద 25 శాతం భారం పెరిగిపోయింది. పైగా గతంలో కంఫర్ట్ గా ఉంది… మన రేంజ్ కి ఇది సరిపోతుంది అని మొబైల్ ప్లాన్ రీఛార్జీలు చేయించుకున్నవారు… కానీ ఈ నెల్లో కొత్త ప్లాన్స్ చూసి అదిరిపోతున్నారు. జియో అయితే కొన్ని ప్లాన్లు ఎత్తేసింది కూడా. ఏంట్రా ఇది…ఇంత దారుణామా అని ప్రతి ఒక్కరూ డిస్కస్ చేస్తున్నారు. పైగా అంబానీల ఇంట్లో 5 వేల కోట్ల రూపాయల ఖర్చుతో అంగరంగ వైభవంగా పెళ్ళి జరుగుతున్న టైమ్ లోనే జియో రీఛార్జీల మోత మోగించింది. దాంతో నీ కొడుకు పెళ్ళి కోసం… మమ్మల్ని బాదేస్తావా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. అందుకే చాలా మంది ప్రభుత్వ రంగ సంస్థ BSNL కు మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ పెట్టుకొని జంప్ అవుతున్నారు. గత వారం పది రోజులుగా BSNL కు షిప్ట్ అయ్యేవారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఇదే టైమ్ లో టాటా కంపెనీ BSNL తో భారీ డీల్ కుదుర్చుకోవడంతో కస్టమర్లు హ్యాపీగా ఫీలవుతున్నారు.
BSNL- TCS కంపెనీ మధ్య 15 వేల కోట్ల రూపాయల డీల్ కుదరడంపై వినియోగదారులు హ్యాపీగా ఉన్నారు. ఈ డీల్ ప్రకారం దేశంలో దాదాపు వెయ్యి ప్రాంతాల్లో 4G ఇంటర్నెట్ సేవలను అందుబాటులో తీసుకొస్తోంది టాటా కన్సల్టెన్సీ. అది అమల్లోకి వస్తే… పల్లెల్లోకి కూడా BSNL నుంచి 4G మొబైల్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇంటర్నెట్ స్పీడ్ అందుకుంటుంది. టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ దేశంలో 4 ప్రాంతాల్లో డేటా సెంటర్లను కూడా నిర్మిస్తోంది. అవి దేశంలో 4G సేవలను విస్తరించడానికి ఉపయోగపడతాయని అంటున్నారు. ప్రస్తుతం 5G నెట్ వర్క్ హవా నడుస్తున్నా… చాలామంది 4G నే వాడుతున్నారు. BSNL గానీ… 4G నెట్ వర్క్ లో గట్టి పోటీ ఇస్తే… ఇక ఆ ప్రభుత్వ రంగ సంస్థకు తిరుగుండదని అంటున్నారు. BSNL లో ప్లాన్స్ చాలా తక్కువ రేట్లతో జనానికి అందుబాటులో ఉన్నాయి. వచ్చే ఆగస్టు నెలలోగా దేశంలో 4G ని అందుబాటులోకి తెస్తామంటోంది BSNL. 4జీ వచ్చినా… మరీ జియో, ఎయిర్ టెల్ లాంటి బాదుడు ఉండదులే అనుకుంటున్నారు జనం. మొత్తానికి BSNL తో డీల్ ద్వారా ముకేశ్ అంబానీ జియో బాదుడు నుంచి టాటా అధినేత రతన్ టాటా జనానికి కాస్త రిలీఫ్ ఇవ్వబోతున్నారు.