Liquor Prices: తెలంగాణలో మద్యం ధరలు తగ్గింపు.. ఎప్పటి నుంచి అమల్లోకొస్తాయంటే..?
రాష్ట్రంలో మద్యం ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. తగ్గిన కొత్త ధరలను వెంటనే అమలులోకి తెస్తూ జీవో పాస్ చేసింది. బీర్లు మినహా అన్ని రకాల బ్రాండ్‌లపై ధరలు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటి వరకూ లిక్కర్‌పై ప్రభుత్వం విధిస్తున్న ట్యాక్స్‌ను తగ్గించడంతో మద్యం ధరలు తగ్గాయి.
Liquor Prices: ఏ రేట్లు తగ్గినా.. తగ్గకపోయినా మందు రేట్లు తగ్గాయంటే మాత్రం పండుగ చేసుకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఆ బ్యాచ్ ఏదో మాకంటే ఎక్కువగా మీకే తెలుసు. అలాంటి బ్యాచ్‌కు ఫుల్‌బాటిల్ లాంటి న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో మద్యం ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. తగ్గిన కొత్త ధరలను వెంటనే అమలులోకి తెస్తూ జీవో పాస్ చేసింది. బీర్లు మినహా అన్ని రకాల బ్రాండ్‌లపై ధరలు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటి వరకూ లిక్కర్‌పై ప్రభుత్వం విధిస్తున్న ట్యాక్స్‌ను తగ్గించడంతో మద్యం ధరలు తగ్గాయి.
క్వార్టర్ బాటిల్‌పై రూ.10, హాఫ్ బాటిల్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.40 తగ్గిస్తూ కొత్త రేట్లను ఫిక్స్ చేసింది. ఇప్పటి నుంచి కొత్తగా వచ్చే బాటిళ్లపై ఈ రేట్లు రానున్నాయి. కరోనా సమయంలో తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలను పెంచింది. ఏ ప్రభుత్వానికైనా ఎక్కువ మొత్తంలో రెవెన్యూ వచ్చేది ఎక్సైజ్ శాఖ నుంచే. కరోనా సమయంలో ఆర్థిక పరిస్థితులు దిగజారడంతో రెవెన్యూను పెంచుకునే ప్రయత్నం చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో మద్యంపై ఎక్స్‌ట్రా ట్యాక్స్‌ను విధించాలని నిర్ణయం తీసుకుంది. 20 శాతం ట్యాక్స్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆటోమేటిక్‌గా మద్యం ధరలు పెరిగాయి. కానీ ప్రభుత్వం ఊహించని విధంగా విక్రయాలు తగ్గాయి. దీనికి కారణం ధరలు పెరగడం కాదు. తక్కువ ధరల్లో నకిలీ బ్రాండ్‌లు రావడం.
బ్రాండ్ ఏదైనా కిక్కొస్తే చాలు అనుకునే బ్యాచ్ మొత్తం నకిలీ బ్రాండ్లు కొనడం మొదలు పెట్టారు. దీంతో అసలు బ్రాండ్‌ల అమ్మకాలు తగ్గిపోయాయి. ఎక్సైజ్ శాఖకు తీవ్ర నష్టాలు వచ్చాయి. ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు పన్నులు తగ్గించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. ఒరిజినల్ బ్రాండ్‌ల మీద ధరలు తగ్గిస్తే ఆటోమేటిక్‌గా నకిలీ బ్రాండ్‌ల అమ్మకాలు తగ్గిపోతాయని భావిస్తోంది. అందులో భాగంగానే ట్యాక్స్ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కారణం ఏదైనా మందు ధరలు తగ్గినందుకు మాత్రం లిక్కర్ లవర్స్ ఖుషీ అవుతున్నారు.