Service Charge: రెస్టారెంట్లో సర్వీస్ ఛార్జ్ చెల్లించనవసరం లేదు.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు..
ప్రస్తుత సమాజంలో వీకెండ్ వచ్చిందంటే చాలు రెక్కలు కట్టుకు వాలిపోతారు కొందరు. ఎక్కడికో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. యువతకు ఈ పాటికే అర్థం అయివుంటుంది. ఇక ఐదంకెల సంపాదన చేసే సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ అయితే ఈ పాటికే రెస్టారెంట్లలో, పబ్బుల్లో, బార్లలో వాలిపోయి ఉంటారనుకోండి. ఇక్కడ వీరిని తప్పుపట్టలేం అది వారి బ్రైన్ రిలీఫ్ యాక్టివిటీ. ఇలాంటి వారికోసమే గతంలో ఉన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి తెలియజేసింది. అదేంటంటే రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జ్ కట్టనవసరం లేదట. ఈ విషయం తెలియకుండా ఇప్పటికే చాలా మంది ఇన్నేళ్ళుగా వందలకు వందలు చెల్లించేసి ఉంటారు. అసలు ఈ నోటిఫికేషన్ ను తిరిగి ఎందుకు తీసుకొచ్చింది. ఎందుకు గుర్తు చేసిందో ఇప్పుడు తెలుకోండి.

Not To Pay Service Charge At Restuarents
ఒక వారం క్రిందట నోయిడాలోని ప్రముఖ ప్రసిద్ది చెందిన స్ప్రెక్ట్రమ్ మాల్ లో జరిగిన ఘటనే దీనికి కారణం. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా రద్దీగా ఉండే ఈ హోటల్ ల్లోకి వచ్చారు ఒకరు. తమకు కావల్సినవి అన్నీ తెప్పించుకున్నారు. అన్నింటినీ రుచి చూసి బిల్ కట్టేందుకు సిద్దమయ్యారు. ఆ బిల్ లో సర్వీస్ ఛార్జ్ వందల్లో విధించారు రెస్టారెంట్ వాళ్ళు. దీనికి సదరు వినియోగదారుడు చెల్లించేందుకు సుముఖత చూపలేదు. దీంతో గొడవ ప్రారంభమైంది. రెస్టారెంట్ లోని సర్వీస్ బాయ్ కస్టమర్ పై దురుసుగా ప్రవర్తిస్తూ అసభ్యకరంగా మాట్లాడాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఇంతకు సర్వీస్ చార్జ్ చెల్లించాలా.. వద్దా.. అనే డైలమాలో పడ్డారు. సాధారణంగా హోటల్స్, బార్స్, పబ్స్ లో వెళితే జీఎస్టీ, ఎస్జీఎస్టీ, ఉంటాయి. అవి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన విలాసం కోరుకునే వారికి విధించే సుంకాలు. ఇది ఎవరైనా కట్టాల్సిందే. ఇది కాకుండా బిల్ పై సర్వీస్ చార్జ్ చెల్లించడం అనేది కొత్తగా తెరమీదకు వచ్చిన అంశం. ఇలాంటి ఘటనలు ఉత్తర్ ప్రదేశ్ లో కూడా చాలానే జరిగాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని కేంద్రప్రభుత్వం సరికొత్తగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్లో ఏముంది అని చాలా మంది ఆసక్తి ఉంటుంది. వినియోగదారీ వ్యవహారాల ఫోరం కి సంబంధించిన శాఖ జారీ చేసిన రూల్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్ను మినహా మరేవీ చెల్లించనవసరం లేదు అని తెలిపింది. ఇక ఈ సర్వీస్ ఛార్జ్ విషయానికొస్తే.. ఇది పూర్తిగా వినియోగదారుని స్వతంత్రం, స్వేచ్ఛ అని తెలిపింది. అంటే తనకు రెస్టారెంట్, బార్, పబ్ సర్వీస్ నచ్చి ఇష్టపూర్వకంగా ఇస్తే తీసుకోవాలి. అతను ఇవ్వకుండా ఉంటే అతనిని బలవంతం పెట్టడం, వాదించడం, తిట్టడం, కొట్టడం లాంటివి చేయకూడాదు అని పేర్కొంది. కస్టమర్ సంతృప్తి చెంది చెల్లిస్తే తీసుకోవాలి లేకుంటే వదిలేయాలి బలవంతం, భయపెట్టడం చేయకూడదు అని వివరించింది. అంటే కేంద్రం తెలిపిన ప్రకారం సర్వీస్ ఛార్జ్ అనేది తప్పని సరి కాదు అని అర్థం చేసుకోవాలి.
T.V.SRIKAR