Internet Less Live: ఇంటర్నెట్ లేకుండానే మొబైల్‌లో లైవ్ టీవీ ఛాన్సల్.. కేంద్రం సరికొత్త ప్రయోగం
మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్‌లో యూట్యూబ్ వీడియో చూడాలంటే ఇంటర్నెట్ ఉండాలి.. ఏదైనా యాప్ ఓపెన్ చేసి ట్రాన్సాక్షన్ చేయాలంటే ఇంటర్నెట్ ఉండాలి. మీ దగ్గర ఎంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ ఉన్నా అందులో ఎన్ని యాప్స్ ఉన్నా.. వాటిని వాడాలంటే మాత్రం కచ్చితంగా డేటా కనెక్షన్ లేదా వైఫై ఉండాల్సిందే.

The central government is ready to bring direct to mobile services on the lines of direct to home
అయితే ఇవేమీ లేకుండానే మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు.. అందులో టీవీ ప్రసారాలు వస్తాయ్.. ఇంటర్నెట్ లేకుండా మొబైల్‌లో టీవీ ప్రసారాలు ఎలా వస్తాయని ఆశ్చర్యపోతున్నారా.. సాధ్యమే అంటోంది కేంద్ర ప్రభుత్వం. డైరెక్ట్ టు హోమ్ ( DTH)తరహాలో డైరెక్ట్ టు మొబైల్ ( DTM) సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర టెలీ కమ్యూనికేషన్ శాఖ కసరత్తు చేస్తోంది.
డైరెక్ట్ టు మొబైల్ ( DTM) ఎలా పనిచేస్తుంది ?
బ్రాడ్‌బ్యాండ్, బ్రాడ్‌కాస్ట్ ఈ రెండు టెక్నాలజీలను అనుసంధానం చేయడం ద్వారా డైరెక్టు టు మొబైల్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. మొబైల్ ఫోన్లలో ఎఫ్ఐం ప్రసారాలు ఎలా జరుగుతాయో.. అదే తరహాలో.. terrestrial digital TV సిగ్నల్స్‌ను కూడా ఇంటర్నెట్ సాయం లేకుండానే మొబైల్స్ అందుకుంటాయి.. ఆడియో , వీడియోలతో పాటు మల్టీ మీడియా కంటెంట్‌ను కూడా ఈ టెక్నాలజీ ద్వారా ఫోన్లు రిసీర్ చేసుకోగలుగుతాయి. ఇంటర్నెట్ లేకపోయినా.. పనిచేయడమే ఈ వ్యవస్థ గొప్పతనం. స్మార్ట్ ఫోన్లు అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరి జీవితాలు స్మార్ట్‌ఫోన్లలోనే గడిచిపోతున్నాయి. టెక్నాలజీ ఆ స్థాయిలో ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తోంది. ఇలాంటి సమయంలో ఇంటర్నెట్‌తో సంబంధం లేకుండా మొబైల్‌లోనే లైవ్ టీవీ ప్రసారాలను అందించాలనుకుంటోంది కేంద్రం. కేవలం విద్య, వినోదం మాత్రమే కాకుండా.. ప్రభుత్వ ద్వారా ప్రజలకు చేరవలసిన వివిధ సమాచారం కోసం కూడా DTM ఉపయోగపడబోతోంది. దేశం మొత్తాన్ని 5జీ నెట్‌వర్క్‌తో కనెక్ట్ చేయడం ద్వారా డైరెక్ట్ టు మొబైల్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నెక్స్ట్ జెన్ బ్రాడ్‌కాస్ట్‌గా దీనిని చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కంటెంట్ డెలివరీ నెట్‌వర్క్‌కు అనుబంధంగా దీనిని రూపొందిస్తున్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్ సహకారంతో కేంద్ర టెలీ కమ్యూనికేషన్ల శాఖ, ఇన్ఫర్మే,షన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ శాఖ సంయుక్తంగా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నాయి. ఐఐటీ ఖరగ్‌పూర్ ఇప్పటికే దీనికి సంబంధించి బెంగళూరు వేదికగా లైవ్ టెస్టులు నిర్వహిస్తోంది. వచ్చే వారం జరిగే సమావేశంలో దీని విధివిధానాలపై చర్చించనున్నారు.
డైరెక్ట్ టు మొబైల్ ( DTM)వల్ల ఏం జరుగుతుంది ?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 22 కోట్ల టీవీ కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి. కానీ స్మార్ట్ ఫోన్లు మాత్రం 80 కోట్లకు పైనే ఉన్నాయి. 2026 నాటికి దేశవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్లు వాడే వారి సంఖ్య 100 కోట్లకు చేరుతుందని అంచనా. ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో 80 శాతం వాటా వీడియో వినియోగానిదే. టీవీలతో పాటు ఇతర కమ్యూనికేషన్ డివైజ్‌లతో పోల్చితే అన్ని రకాల కమ్యూనికేషన్లకు, ఎంటర్‌టైన్‌మెంట్‌కు అనువైనది మొబలై ఫోన్ మాత్రమే. అందుకే బ్రాడ్‌కాస్ట్, బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను మిళితం చేసి డైరెక్ట్ టు మొబైల్ ( DTM) సేవలు అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. టీవీలు చూసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోవడంతో స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరగడంతో
టెలికామ్ ఆపరేటర్ల నుంచి వ్యతిరేకత
డైరెక్టర్ టు మొబైల్ టెక్నాలజీ ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నా.. దీన్ని ప్రముఖ టెలికామ్ ఆపరేటర్లు వ్యతిరేకించే అవకాశాలున్నాయి. DTM సర్వీసులు అందుబాటులోకి వస్తే డేటా రెవెన్యూ దారుణంగా పడిపోతుంది. 5జీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన వీడియో వినియోగం ద్వారా రిలయన్స్, ఎయిర్ టెల్, ఐడియా వంటి సంస్థల ఖజానా నిండుతోంది. ప్రభుత్వం DTM సేవలను అమలు చేస్తే డేటా కనెక్షన్ లేకుండానే టీవీ ప్రసారాలు కూడా ప్రజలకు అందుతాయి. దీనివల్ల టెలికామ్ సంస్థలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. అందుకే వచ్చే వారం జరిగే సమావేశంలో తమ అభ్యంతరాలను వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రైవేటు టెలికాం సంస్థల నుంచి ఎలాంటి వ్యతిరేకత ఉన్నా..DTH సేవలు టీవీ ప్రసారాల్లో ఎలాంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాయో.. అదే తరహాలో DTM సేవలు కూడా రివల్యూషనరీగా మారే సూచనలు ఉన్నాయి.