బంగారం రేటు పెరగడానికి కారణాలు ఇవే
బంగారం ధర సరికొత్త రికార్డు వైపు అడుగులు వేస్తోంది. జనవరి 22 బుధవారం నాటికి బంగారం ధరలు భారీ స్థాయిలో ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 82 వేల 180 రూపాయలు ఉంది.
బంగారం ధర సరికొత్త రికార్డు వైపు అడుగులు వేస్తోంది. జనవరి 22 బుధవారం నాటికి బంగారం ధరలు భారీ స్థాయిలో ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 82 వేల 180 రూపాయలు ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 75 వేల 100 గా ఉంది. ఇక వెండి ఒక కిలో ధర 93 వేల 822గా ఉంది. బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు వాటి పరిణామాలు అని చెప్తున్నారు నిపుణులు. తాజాగా అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టారు. అయినప్పటికీ కూడా బంగారం ధర ఏమాత్రం తగ్గడం లేదు. నిజానికి డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వస్తే బంగారం ధర తగ్గుతుందని అంతా భావించారు.
బంగారం ధర మాత్రం భారీగా పెరుగుతోంది. చాలా వరకూ పాలసీలు మార్చడమే బంగారం ధరల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. ఇక బంగారం ధరలు భారీగా పెరగడానికి ప్రధానంగా స్టాక్ మార్కెట్ పరిస్థితులు ఒక కారణంగా చెప్పవచ్చు. స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు పెట్టుబడిని పెట్టేందుకు వెనకడుగు వేస్తున్నారు. దీంతో తమ పెట్టుబడులను బంగారం వైపు తరలించడంతో భారీగా ధరలు పెరగడం ప్రారంభించాయి. పసిడి ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అటు ఆభరణాలు కొనుగోలు చేసేవారు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే పసిడి ధర మరోసారి ఆల్ టైం రికార్డ్ వైపుగా వెళ్తోంది. గతంలో బంగారం ధర 84 వేల రూపాయల వద్ద ఆల్ టైం రికార్డును సాధించింది. ప్రస్తుతం ఆ రికార్డును దాటేసింది. పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే బంగారం ధర త్వరలోనే 90 వేల రూపాయల నుంచి ఒక లక్ష రూపాయలు మధ్యలోకి చేరే అవకాశం ఉంది.
బంగారం ధర భారీగా పెరగడానికి మరో ప్రధాన కారణం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు విపరీతంగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఇది కూడా బంగారం ధర పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ప్రధానంగా చైనా వంటి దేశాలు బంగారాన్ని విపరీతంగా కొనుగోలు చేస్తుంటాయి ఈ కారణంగా బంగారానికి ఉన్న పళంగా డిమాండ్ పెరుగుతుంది. అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ కూడా బంగారం ధరలు పెరగడానికి ఉన్న మరో కారణంగా చెప్తున్నారు నిపుణులు. ఇక ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఉన్న యుద్ధ పరిస్థితులు, ఆర్థిక సంక్షోభ పరిస్థితులు కూడా బంగారం ధరలు పెరగడానికి మరో ప్రధాన కారణంగా తెలుస్తోంది. బంగారాన్ని మంచి పెట్టుబడి సాధనంగా వాడుకునే మధ్య తరగతి కుటుంబాలు ఈ రేట్లు చూసి బెంబేలెత్తిపోతున్నారు. మార్కెట్‌లో ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఇలా కంటిన్యూ అవుతుందో నిపుణులు కూడా అంచనా వేయలేకపోతున్నారు.