Wedding Season: పెళ్లి వేడుకల్లో సరికొత్త రికార్డు.. మూడు వారాల్లో 38 లక్షల పెళ్లిళ్లు.. ఖర్చు ఎన్ని లక్షల కోట్లంటే..

ఈ మూడు వారాల్లోనే దేశంలో దాదాపు 38 లక్షల వివాహాలు జరగవచ్చని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (కాయిట్‌) అంచనా. నవంబర్‌ 23, 24, 27, 28, 29 తేదీలతోపాటు, డిసెంబర్‌ 3, 4, 7, 8, 9, 15 తేదీల్లోనూ మంచి ముహూర్తాలున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 22, 2023 | 06:18 PMLast Updated on: Nov 22, 2023 | 6:18 PM

Upcoming Marriage Season Likely To Generate Rs 4 7 Lakh Cr Business

Wedding Season: పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే అంతటా ఒకటే సందడి. ప్రతి చోటా ఏదో ఒక పెళ్లి జరుగుతూనే ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రతి సీజన్‌లో లక్షల పెళ్లిళ్లు జరుగుతాయి. ఈ సీజన్‌లో కూడా భారీగానే పెళ్లిళ్లు జరగబోతున్నాయి. మూడు వారాల వ్యవధిలోనే దేశంలో 38 లక్షల పెళ్లిళ్లు జరుగుతున్నాయి. తాజా సీజన్ ఇప్పటికే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నెలలోనే లక్షలాది వివాహాలు జరిగాయి. ఇక ఈ నెల 23 నుంచి మరిన్ని మంచి ముహూర్తాలున్నాయి. డిసెంబర్‌ 15 వరకు ఈ పెళ్లిళ్ల సీజన్ కొనసాగనుంది.

REVANTH REDDY: రైతులను ఆదుకుంటామని చెప్పి కేసీఆర్ మాట తప్పాడు: రేవంత్ రెడ్డి

ఈ మూడు వారాల్లోనే దేశంలో దాదాపు 38 లక్షల వివాహాలు జరగవచ్చని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (కాయిట్‌) అంచనా. నవంబర్‌ 23, 24, 27, 28, 29 తేదీలతోపాటు, డిసెంబర్‌ 3, 4, 7, 8, 9, 15 తేదీల్లోనూ మంచి ముహూర్తాలున్నాయి. మన దేశంలో పెళ్లి అంటే అత్యంత ఖరీదైన వ్యవహారం. బంగారం, వెండి, నగలు, చీరలు, సామగ్రి, రవాణా, భోజన ఖర్చులు, వసతి, మండపాలు, ఫొటో షూట్లు, వీడియోలు, డీజేలు, బ్యాండ్ మేళం, మందు, బహుమతులు.. ఇలా బోలెడు ఖర్చు తప్పనిసరి. స్థాయినిబట్టి వధూవరుల కుటుంబాలు ఖర్చు పెడుతుంటాయి. అందులోనూ కొందరైతే ఖర్చుకు ఏమాత్రం వెనుకాడరు. ఈ లెక్కన ఈ మూడు వారాల్లో జరగబోయే వివాహాలక సంబంధించి రూ.4.74 లక్షల కోట్ల విలువైన వ్యాపారం జరగబోతోందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత సంవత్సరం కూడా ఇదే సీజన్‌లో 32 లక్షల పెళ్లిళ్లు జరిగాయి. అప్పట్లో రూ.3.75 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది.

ఇప్పుడు ఖర్చులు పెరిగిన దృష్ట్యా ఈ వ్యాపారం మరో లక్ష కోట్లు అదనంగా జరిగే అవకాశం ఉంది. అందులోనూ ఢిల్లీలోనే దాదాపు రూ.1.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని అంచనా. అయితే, అన్ని వివాహాలు ఒకే ఖర్చుతో జరగవు కదా. దీనిపై కూడా కాయిట్‌ ఒక అంచనా వేసింది. దీని ప్రకారం ఈ పెళ్లిళ్లలో దాదాపు రూ.3 లక్షల ఖర్చుతో దాదాపు 7 లక్షల వివాహాలు, రూ.6 లక్షల ఖర్చుతో 8 లక్షల పెళ్లిళ్లు, రూ.10 లక్షల వ్యయంతో 10 లక్షల వివాహాలు, రూ.15 లక్షల ఖర్చుతో 7 లక్షల పెళ్లిళ్లు, రూ.25 లక్షల వ్యయంతో 5 లక్షల వివాహాలు, రూ.50 లక్షలతో 50 వేల పెళ్లిళ్లు, రూ.కోటికి పైగా వ్యయంతో మరో 50 వేల వివాహాలు జరుగుతాయని అంచనా వేసింది.