బంగారం 56వేలకు పడిపోతుందా.. గోల్డ్ కొనకండి.. వెయిట్ చేయండి…!

కొద్దిరోజులుగా ఆకాశానికి చేరుతున్న బంగారం ధరలు.. జనాలకు చుక్కలు చూపిస్తున్నాయ్. తగ్గేదే లే అనే రేంజ్‌లో.. రయ్‌న దూసుకుపోతున్నాయ్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 7, 2025 | 07:00 PMLast Updated on: Apr 07, 2025 | 7:00 PM

Will Gold Fall To 56 Thousand Dont Buy Gold Wait

కొద్దిరోజులుగా ఆకాశానికి చేరుతున్న బంగారం ధరలు.. జనాలకు చుక్కలు చూపిస్తున్నాయ్. తగ్గేదే లే అనే రేంజ్‌లో.. రయ్‌న దూసుకుపోతున్నాయ్. దీంతో బంగారం కొనడం కాదు కదా.. గోల్డ్ గురించి ఆలోచించడం కూడా ఇబ్బందే అన్నట్లుగా జనం ఫిక్స్ అయ్యారు. వన్ గ్రామ్ గోల్డ్‌తో శుభాకార్యాలు నెట్టుకొస్తున్న పరిస్థితి. కట్ చేస్తే.. ఐతే గత వారం రోజులుగా ఈ ట్రెండ్‌లో కాస్త మార్పు కనిపిస్తోంది. ప్రతీరోజు గోల్డ్ రేట్లు తగ్గుతున్నాయ్. వరుసగా మూడు రోజుల్లో మూడు వేలకు పైగా పసిడి ధరలు తగ్గాయ్‌. ఈ తగ్గుదల ఇలానే కంటిన్యూ కాబోతుందా.. మళ్లీ పాత రోజులు వస్తాయా.. బంగారం 50వేలకు పడిపోతుందా అంటే.. ఏమో గుర్రం ఎగరావచ్చు.. బంగారం తగ్గా వచ్చు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

రేట్లు పెరిగినప్పటి నుంచి ఎలా అయితే బంగారానికి దూరంగా ఉన్నారో.. అదే దూరాన్ని ఇంకొద్దిరోజులు కంటిన్యూ చేస్తే.. బంగారం దిగి రావాల్సిందే అన్నట్లుగా మార్కెట్ పరిస్థితులు కనిపిస్తున్నాయ్. దీనికితోడు.. ట్రంప్ తాత ఎఫెక్ట్ కూడా గోల్డ్‌ మీద భారీగానే పడుతోంది. దీంతో రాబోయే రోజుల్లో బంగారం రేట్లు భారీగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయ్. దీంతో ఇప్పటికిప్పుడు తొందరపడి కొనాల్సిన అవసరం లేదని.. కొద్దిరోజులు వెయిట్ చేస్తే బెటర్ అనే సూచనలు వినిపిస్తున్నాయ్. ట్రంప్ తెరతీసి వాణిజ్య యుద్ధం.. ప్రకంపనలు యావత్ ప్రపంచంలోని స్టాక్ మార్కెట్లను వణికిస్తున్నాయ్. ఇప్పటికే అమెరికాలోని స్టాక్ మార్కెట్లలో దాదాపు 6 ట్రిలియన్ డాలర్ల సంపద ఆవిరయిపోయింది. భారత మార్కెట్‌ల కూడా భారీగా నష్టపోతున్నాయ్.

స్టాక్‌మార్కెట్‌లో సోమవారం బ్లడ్‌బాత్ కనిపించింది. భారీ నష్టాలు చవచూసింది. జపనీస్ స్టాక్ మార్కెట్ అత్యధికంగా కూడా 8శాతం నష్టపోయింది. మార్కెట్‌లో నష్టాలు కనిపిస్తున్న వేళ.. బంగారం ధరలు కూడా పతనం అవుతున్నాయ్. నిజానికి బంగారం ధర స్టాక్ మార్కెట్లో పతనం అయినప్పుడల్లా పెరుగుతుంది. ఐతే ఈ గ్లోబల్ సెల్లాఫ్ బారిన బంగారం కూడా.. అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నట్లు కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు బంగారం కూడా అమ్మేసి.. తమ లాభాలను బుక్ చేసుకుంటున్నారు. స్టాక్ మార్కెట్లో ఉన్న నష్టాలను పూడ్చుకునేందుకు.. బంగారంలో పెట్టిన పెట్టుబడులను ప్రాఫిట్ బుకింగ్ రూపంలో విక్రయిస్తున్నారు. దీంతో బంగారం ధరలు కూడా గడచిన మూడున్నర వారాల కన్నా కనిష్ట స్థాయికి చేరుకుంటున్నాయ్. స్టాక్ మార్కెట్‌లో వచ్చిన నష్టాలను కవర్ చేసుకునేందుకు బంగారంలోని పెట్టుబడులను విక్రయించడం ద్వారా ఇన్వెస్టర్లు కవర్ చేస్తున్నారు.

ట్రంప్ ప్రకటించిన టారిఫ్ యుద్ధంతో.. మార్కెట్లలో తీవ్ర ఒత్తిడి కనిపిస్తోంది. దీంతో బంగారాన్ని విక్రయిస్తున్నారు. దీనికితోడు ఇంటర్నేషనల్ మార్కెట్‌లోని COMEX గోల్డ్ ఫ్యూచర్స్‌లో.. బంగారం ధర దాదాపు మూడు శాతం తగ్గిపోయింది. దీనికి తోడు MCX గోల్డ్ ఫ్యూచర్స్.. జూన్ డెలివరీ కి సంబంధించిన స్టాక్ మార్కెట్ బంగారం విలువ 88వేల రూపాయలకు పతనమైంది. ట్రంప్ మొదలుపెట్టిన టారిఫ్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. దీంతో స్టాక్‌ మార్కెట్‌లో నష్టాలు కంటిన్యూ కావడం ఖాయం. వారిని భర్తీ చేసుకునేందుకు బంగారం అమ్మడం కూడా ఖాయం. దీంతో బంగారం ధరలు భారీగా పడిపోవడం కూడా ఖాయం. ఇప్పుడు చేయాల్సింది ఒక్కటే.. వెయిట్ చేయడం అంతే. వెయిట్‌ చేస్తే పోయేదేముంది.. దరిద్రం, బంగారం రేటు తప్ప ! ఈ మాటే ఇప్పుడు ప్రతీ ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.