జననాంగాలపై 14 గాయాలు.. తెల్లని ద్రవ పదార్థం..

కోల్‌కతా డాక్టర్‌ కేసు దేశాన్ని అట్టుడికిస్తోంది. ఆ దుర్గార్మున్ని నడిరోడ్డుపై ఉరి తీయాలనే డిమాండ్ ప్రతీ చోటా వినిపిస్తోంది. కోల్‌కతాలోని RG కర్ హాస్పిటల్‌ సెమినార్‌ హాల్‌లో జరిగిన హత్యాచార ఘటన.. ప్రతీ ఒక్కరి మనసును మెలేస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 19, 2024 | 09:09 PMLast Updated on: Aug 19, 2024 | 9:09 PM

14 Wounds On The Genitals White Liquid Substance

కోల్‌కతా డాక్టర్‌ కేసు దేశాన్ని అట్టుడికిస్తోంది. ఆ దుర్గార్మున్ని నడిరోడ్డుపై ఉరి తీయాలనే డిమాండ్ ప్రతీ చోటా వినిపిస్తోంది. కోల్‌కతాలోని RG కర్ హాస్పిటల్‌ సెమినార్‌ హాల్‌లో జరిగిన హత్యాచార ఘటన.. ప్రతీ ఒక్కరి మనసును మెలేస్తోంది. ట్రైనీ డాక్టర్ పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఒరిజినల్‌ పోస్టుమార్టం రిపోర్టు బయటకు వచ్చింది. గొంతు నొక్కడం వల్లే చనిపోయిందని డాక్టర్లు కన్ఫార్మ్‌ చచేశారు. బాధితురాలి శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని రిపోర్టు తప్పుపట్టింది. ఆమె శరీరంలో తెల్లటి జిగటలా ఉన్న ద్రవం ఉన్నట్లు రిపోర్టులో తెలిపారు డాక్టర్లు.

అయితే ఆ ద్రవం ఏంటనే విషయాన్ని స్పష్టం చేయలేదు. ఎముకలు విరిగాయన్న ప్రచారాన్ని అటాప్సీ రిపోర్టును కొట్టిపారేసింది. ఎముకలు విరిగిన ఆనవాళ్లు లేవని స్పష్టం చేసింది. బాధితురాలి శరీర భాగాల్లో గాయాలను ధృవీకరించారు వైద్యులు. తల, బుగ్గలు, ముక్కు, కుడి దవడ, గడ్డం, మెడ, ఎడమ చేయి, ఎడమ భుజం, ఎడమ మోకాలు, చీలమండ, జననేంద్రియాలతో పాటు వివిధ శరీరభాగాలపై గాయాలున్నట్లు రిపోర్టులో తెలిపారు. మొత్తం 14 గాయాలైనట్లు తేల్చారు. ఊపిరితిత్తుల్లో రక్తస్రావం, శరీరంలోని ఇతర భాగాల్లో రక్తం గడ్డ కట్టినట్లు గుర్తించారు. ఆగస్టు 9న కోల్‌కతా ఆర్జీకర్ హాస్పిటల్‌లో 31ఏళ్ల ట్రైనీ డాక్టర్‌ అత్యాచారం, హత్యకు గురైంది. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. డాక్టర్లు సమ్మెకు దిగారు. ఈ కేసులో ఘటన జరిగిన తర్వాతి రోజు సంజయ్‌ రాయ్ అనే వ్యక్తిని కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే కేసు విచారణను కోల్‌కతా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. సుప్రీంకోర్టు కూడా ఈ కేసును సుమోటోగా తీసుకుంది.