Cyber Crime: సెక్స్ కోసం వినియోగించే సోషల్ మీడియా యాప్.. దీని జోలికి అస్సలు వెళ్లద్దు
స్నాప్ చాట్ బహుశా ఈ యాప్ గురించి తెలియని వారు ఉండరేమో.. యువతకు దీనిగురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. అదిరిపోయే ఫీచర్స్ తో ఈ తరం యంగ్ జనరేషన్ కి ఎంతగానో ఆకర్షిస్తుంది.
స్నాప్ చాట్ అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన సోషల్ మీడియా యాప్ లలో ఒకటి. ఇందులో గేమ్స్, ఫోటో, వీడియోస్, స్నాప్‌మ్యాప్, ఎంటర్ టైన్ మెంట్, ఎడిటింగ్, వంటివి ఇలా చాలా రకరకాల ఫీచర్లు ఉంటాయి. వీటిలోనే ప్రస్తుతం యువత మునిగి తేలుతున్నారు. దీన్ని ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు యువత భవితను ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.
ఏమారితే సైబర్ ఉచ్చులో పడటం ఖాయం
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే యూత్ నే సైబర్ నేరగాళ్లు టార్గెట్ గా ఎంచుకుంటున్నారు. మన సామాజికమాధ్యమాల బలహీనతే ఆన్‌లైన్‌లో స్కామర్లకు బలంగా మారుతోంది. అంతేకాదు స్నాప్‌చాట్ ప్లాట్‌ఫామ్‌లో కేవలం మన స్నేహితులు మాత్రమే ఉంటారనుకుంటాము. అది ఏమాత్రం నిజం కాదు. మనకు తెలియని వ్యక్తులు సైతం మనతో మెసేజ్, వీడియో కాల్స్ చేయవచ్చు. తద్వారా మన వ్యక్తిగత సమాచారాన్ని లూటీ చేస్తారు. ఆదమరచి ఉన్నట్టు కాస్త అనుమానం వస్తే చాలు ఉచ్చులో చిక్కుకునేలా చేస్తారు. అకౌంట్ ను హ్యాకింగ్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ యాప్ ద్వారా ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి మన వ్యక్తిగత సమాచారంను తీసుకోని మోసాలకు పాల్పడే అవకాశం ఎక్కువగా ఉంది.
సెక్స్ కోసమే వినియోగిస్తున్నట్లు వెల్లడి
ఇంతవరకు ఆన్ లైన్ యాప్ ల్లో ఏ యాప్ కు లేని ఫీచర్ ను ఈ స్నాప్ చాట్ లో పొందుపరిచారు. అదే మెసేజ్ డిసప్పియర్ ఆప్షన్. ఈ ఆప్షన్ తో మనం ఎవరితోనైనా చాట్ చేసిన తర్వాత ఆ చాటింగ్ వివరాలు తిరిగి తిసుకురావడం అసంభవం. మీరు మీ పిల్లల ఫోన్‌ని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నప్పటికీ లేదా వారి యాక్టివిటీని ట్రాక్ చేయడానికి మీ పిల్లవాడు ఏమి పంపుతున్నాడో లేదా స్వీకరిస్తున్నాడో తెలుసుకోవడం అసాధ్యం. స్నాప్‌మ్యాప్ ద్వారా మనం ఎక్కడున్నది సైబర్ నేరగాళ్లు తెలుసుకొని బెదిరింపులకు పాల్పడి కిడ్నాప్ చేసే ఆస్కారం కూడా లేకపోలేదు. యువతలో చాలా మంది ఈ యాప్ ను సెక్స్ కోసం వినియోగిస్తున్నారు. దాదాపు 1.6 యూజర్స్ ఈ యాప్ ను సెక్స్ కోసం ఉపయోగిస్తున్నట్లు సీటెల్ పసిఫిక్ విశ్వవిద్యాలయం సర్వేలో వెల్లడైంది. 14.2 పర్సన్ సెక్స్ వెల్ కంటెంట్ ను సేవ్ చేసుకోవడానికి ఈ యాప్ వాడుతున్నారు.
దీని నుంచి మనల్ని మనంను రక్షించుకోవాలంటే..
ఎంత పరిచయం ఉన్న వారికైనా తన వ్యక్తిగత ఫొటోలు, శృంగారభరిత సందేశాలు పంపడం, మెసేజ్లు, వీడియో కాల్స్ చేసుకోవడం ఎప్పటికైనా ముప్పే. అపరిచితులతో వ్యక్తిగత వివరాలు అస్సలు షేర్ చేయొద్దు. పూర్తి పేరు, చిరునామా, ఫోన్ నంబర్, బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు. ఈ యాప్ ద్వారా మీకు స్నేహితుడు పరిచయం అయితే వారిని కలవాల్సి వస్తే రహస్య ప్రదేశంలో కాకుండా పబ్లిక్ ప్లేస్‌లో కలవండి. ఫలానా వ్యక్తిని కలుస్తున్నట్టు మీ దగ్గరి వారికి లేదా మీ కుటుంబ సభ్యులకు ముందస్తుగా సమాచారం ఇవ్వండి. వీలైతే మరోవ్యక్తిని మీకు తోడుగా తీసుకెళ్లడం చాలా మంచిది.
సోషల్ మీడియా వేదికలు సామాజ శ్రేయస్సుకే కాదు వినాశనాన్ని, ముప్పును కూడా తెచ్చిపెడతాయని తెలుస్తుంది. అందుకే ఏదైనా మితంగా ఉంటే బాగుంటుంది. అపరిమితం, అమితం అయితే మనకే లేనిపోని సమస్యలు తెచ్చిపెడుతుంది.
S.SURESH