రన్నింగ్‌ ట్రైన్‌లో యువతిపై రే*ప్‌, హైదరాబాద్‌లో దారుణం…!

హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. రన్నింగ్‌ ట్రైన్‌లో ఓ యువతిపై ఓ వ్యక్తి అత్యాచారంయత్నం చేశాడు. MMTS ట్రైన్‌లో అమ్మాయి ఒక్కతే ఉండటాన్ని గమనించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 24, 2025 | 01:16 PMLast Updated on: Mar 24, 2025 | 1:16 PM

A Young Woman Was Raped On A Running Train Atrocity In Hyderabad

హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. రన్నింగ్‌ ట్రైన్‌లో ఓ యువతిపై ఓ వ్యక్తి అత్యాచారంయత్నం చేశాడు. MMTS ట్రైన్‌లో అమ్మాయి ఒక్కతే ఉండటాన్ని గమనించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో ఆ కిరాతకుడి నుంచి తప్పించుకునేందుకు అమ్మాయి రన్నింగ్‌ ట్రైన్‌ నుంచి దూకేసింది. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు ఆమెను గాంధీ హాస్పిటల్‌కు తరలించారు.

ఓ ప్రైవేట్‌ కంపెనీలో యువతి ఉద్యోగం చేస్తున్నట్టు చెప్తున్నారు పోలీసులు. ఆఫీస్‌ పూర్తైన తరువాత సికింద్రాబాద్‌ నుంచి మేడ్చల్‌కు MMTS ట్రైన్‌లో బయల్దేరింది ఆ యువతి. లేడీస్‌ కోచ్‌లో అమ్మాయి ఒక్కతే ఉండగాన్ని గమనించిన దుండగుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో అమ్మాయి ట్రైన్‌ నుంచి దూకేసింది. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.