6 దాటితే సె*క్స్ KPHBలో అడ్డగోలు దందా ఏరియా బ్రాండ్ మార్చేశారు
హైదరాబాదులో ఫ్యామిలీస్ ఉండే ఏరియా అంటే ఒకప్పుడు అందరికీ గుర్తొచ్చే పేరు కూకట్పల్లి. సిటీకి సెంటర్లో.. ఐటీ జీవితాలకు దగ్గర్లో..
హైదరాబాదులో ఫ్యామిలీస్ ఉండే ఏరియా అంటే ఒకప్పుడు అందరికీ గుర్తొచ్చే పేరు కూకట్పల్లి. సిటీకి సెంటర్లో.. ఐటీ జీవితాలకు దగ్గర్లో.. సాంప్రదాయం వాకిట్లో ఉన్నట్టుగా ఉండే ఏరియా కూకట్పల్లి. ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో సెటిల్ అయినా చాలామంది ఫ్యామిలీస్ కూకట్పల్లిలోనే ఉంటాయి. ఒకప్పుడు అంత ట్రెడిషనల్ గా ఉన్న కూకట్పల్లి బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. కూకట్పల్లి అంటేనే వ్యభిచారానికి అడ్డా అనే పేరు వచ్చేసింది. చీకటైతే చాలు KPHB మెట్రో దగ్గర నిలబడే సెక్స్ వర్కర్ల కారణంగా మొత్తం కూకట్పల్లి ఏరియాకు చెడ్డ పేరు వస్తోంది. KPHB మెట్రో దగ్గర జరిగే ఈ దందా గురించి ఎవరికీ తెలియదా అంటే.. అందరికీ తెలుసు.
ఇక్కడ ఏం జరుగుతుందో పోలీసులకు కూడా తెలుసు కానీ ఎవరు ఈ వ్యవహారాన్ని పట్టించుకోవడం లేదు. పరిస్థితి చేయి దాటుతోంది అనుకున్నప్పుడు చిన్నచిన్నగా వార్నింగ్ ఇచ్చి వదిలిపెడుతున్నారే తప్ప పూర్తి స్థాయిలో ఇక్కడ పరిస్థితిని మార్చేందుకు ఎవరు ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఒకప్పుడు ఫ్యామిలీ ఏరియాగా ఉన్న కూకట్పల్లి ఇప్పుడు చిన్నపాటి రెడ్ లైట్ ఏరియాగా మారిపోయింది. గంటకు ఇంత.. రాత్రికి ఇంత అంటూ అక్కడ జరిగే దందా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఫేమస్. హైదరాబాద్ అభివృద్ధితోపాటు కూకట్పల్లి అభివృద్ధి కూడా శరవేగంగా జరుగుతుంది. ఇటు ఆహ్లాదకర వాతావరణంలో అటు ఐటి ఇండస్ట్రీలకు అత్యంత చేరువగా ఉండే ఏరియా కూకట్పల్లి. అందుకే ఐటి ఉద్యోగాలు చేసే చాలామంది కూకట్పల్లిలో ఇల్లు తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. చాలా మంది ఇప్పటికే కూకట్పల్లిలో ఇళ్లు కొనుక్కొని స్థిరపడ్డారు కూడా.
కానీ రాత్రి అయిందంటే అక్కడ జరుగుతున్న ఈ గలీజ్ దందాతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇక రాత్రి సమయాల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికుల కష్టాలైతే వర్ణనాతీతం. రాత్రి పది దాటిన తర్వాత కేపీహెచ్బీ మెట్రో దగ్గర అమ్మాయి కనిపిస్తే చాలు.. ఆమె కచ్చితంగా సెక్స్ వర్కర్ అని అంతా అనుకునే పరిస్థితి అక్కడ ఉంది. దీనివల్ల ఉద్యోగులు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి దంతాలు ఇక్కడ జరుగుతున్నాయని అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు అందినా.. పూర్తిస్థాయిలో గట్టి చర్యలు మాత్రం కనిపించడం లేదు. అప్పుడప్పుడు వచ్చి వాళ్ళని బెదిరించడం.. రెండు మూడు రోజులు అంతా సైలెంట్ గా ఉండి మళ్లీ దండా మొదలు పెట్టడం. చాలా రోజులుగా ఇదే పద్ధతి కంటిన్యూ అవుతుంది. ఇప్పటికైనా అధికారులు వీళ్ళ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ జరుగుతున్న ఈ దందా వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.