AKHIL PAILWAN: బయటకొస్తున్న అఖిల్‌ పహిల్వాన్ బాగోతాలు.. ఫోన్ నిండా అవే..

అఖిల్‌కు సినీ ఇండస్ట్రీలో చాలా మందితో పరిచయాలున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈవెంట్ల పేరుతో సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరితో అఖిల్ పరిచయాలు చేసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో పోస్టు చేసినట్టు గుర్తించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 21, 2024 | 01:36 PMLast Updated on: Jan 21, 2024 | 1:36 PM

Akhil Pailwan Arrested By Hyderabad Police

AKHIL PAILWAN: హైదరాబాద్‌లో సంచలనంగా మారిన.. రాంనగర్ అఖిల్ పహిల్వాన్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయ్. ఈ కేసులో అఖిల్ పహిల్వాన్ మొబైల్ ఫోన్ కీలకంగా మారింది. ఫోన్‌లో సగానికి పైగా వెస్ట్ బెంగాల్ అమ్మాయిలు, వ్యభిచార నిర్వాహకుల ఫోన్ నెంబర్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. సినీ ఇండస్ట్రీకి చెందిన జూనియర్ ఆర్టిస్టులకు సంబంధించి.. ఫోన్ నెంబర్లు కూడా అఖిల్ ఫోన్‌లో ఉన్నట్టు పోలీసులు గుర్తించినట్టు సమాచారం.

AYODHYA RAM MANDIR: రాముడు ఎందుకు మహనీయుడు..? ఈ దేశానికి ఎందుకంత ప్రేమ..?

అఖిల్‌కు సినీ ఇండస్ట్రీలో చాలా మందితో పరిచయాలున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈవెంట్ల పేరుతో సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరితో అఖిల్ పరిచయాలు చేసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో పోస్టు చేసినట్టు గుర్తించారు. అతనికి పరిచయం ఉన్న సినీ, రాజకీయ ప్రముఖుల దగ్గరికి కూడా అమ్మాయిలను పంపించినట్టు తెలుస్తుండటంతో.. ఆ యాంగిల్‌లో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. రాంనగర్ అఖిల్‌కు సంబంధించిన పూర్తి కాల్ డేటాను పోలీసులు బయటికి తీస్తున్నారు. రోజుకు 20 నుంచి 30 ఫోన్ కాల్స్ నిర్వాహకులతో అఖిల్ మాట్లాడేవాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అఖిల్ అరెస్టుతో.. అతనితో సంబంధాలు ఉన్న సినీ ఆర్టిస్టుల్లో భయం మొదలైంది. తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయోనని వణికిపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఐతే ఇప్పటివరకు ఎంత మంది అమ్మాయిలను వ్యభిచారం పేరుతో.. హైదరాబాద్ తీసుకొచ్చాడనే అంశంపై పోలీసులు కూపీ లాగుతున్నారు. హైదరాబాద్‌లో భారీ కటౌట్స్‌తో.. అఖిల్ హంగామా చేస్తుండేవాడు.

సోషల్ మీడియాలోనూ ప్రచారం చేసుకుంటూ ఫేమస్ అయ్యే ప్రయత్నం చేశాడు. అబిడ్స్‌ ఫార్చ్యూన్ హోటల్‌పై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి.. అఖిల్ పహిల్వాన్ గలీజ్ దందాను బయటపెట్టారు. ఈ దాడిలో16 మంది అమ్మాయిలు, నలుగురు విటులు, ఇద్దరు ఆర్గనైజర్లు, లాడ్జి యజమానిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన యువతులను కోల్‌కతా, ముంబై నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు వివరించారు. ఫార్చ్యూన్ హోటల్‌లో మెుత్తం 25 గదులు ఉండగా.. 16 రూమ్‌లను వ్యభిచారం కోసం ఉపయోగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.