Utter Pradesh: అతీక్ అహ్మద్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం.. ఇండియాకు అల్‌ఖైదా వార్నింగ్..
మాఫియా టర్డ్న్ పొలిటీషియన్ అతీక్ అహ్మద్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ అల్‌ఖైదా ఇండియాకు వార్నింగ్ ఇచ్చింది. అల్‌ఖైదా మీడియా వింగ్ నుంచి 7 పేజీల లెటర్ రిలీజ్ చేసింది. వాళ్లు రాసిన లెటర్‌లో అతీక్ అమరవీరుడు అంటూ పొగిడారు. ముస్లిం కాబట్టే అతీక్‌ను చంపేశారంటూ.. అమాయక ముస్లింల అటెన్షను డైవర్ట్ చేసేందుకు ట్రై చేశారు.
అతీక్ చావుకు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. ఇండియాలో భారీ మొత్తంలో విధ్వంసం చేస్తామని హెచ్చరించారు. అల్‌ఖైదా నుంచి వచ్చిన ఈ వార్నింగ్ లెటర్ ఇప్పుడు సెన్సేషన్‌గా మారింది. ఈ లెటర్‌తో ఇండియన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ అలెర్ట్ అయ్యింది. సర్వేలెన్స్‌ను కట్టుదిట్టం చేసింది. అతీక్‌కు అల్‌ఖైదాతో సంబంధాలున్నాయని రీసెంట్‌గానే పోలీసులు చెప్పారు. కానీ కొందరు అతీక్ సపోర్టర్స్ మాత్రం దాన్ని తప్పు అన్నారు. అతీక్ హత్యను కవర్ చేసేందుకు ఇలాంటివి చెప్తున్నారంటూ వాదించారు.
కానీ ఇప్పుడు ఏకంగా అల్‌ఖైదానే లెటర్ రిలీజ్ చేయడంతో అందరికీ మ్యాటర్ క్లియర్‌గా అర్థమైంది. ఉమేష్ పాల్ మర్డమ్‌కు ప్రతీకారంగా అతీక్ గ్యాంగ్ మొత్తాన్ని లేపేసింది యోగీ సర్కార్. కానీ అతీక్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా ముగ్గురు వ్యక్తులు చేతిలో హతమయ్యాడు. చంపిన ముగ్గురు వ్యక్తులకు అతీక్‌తో ఎలాంటి శత్రుత్వం లేదు. జస్ట్ ఓ గ్యాంగ్‌స్టర్‌గా పేరు తెచ్చుకుని ఫేమస్ అయ్యేందుకు మాత్రమే అతీక్ చంపామని ఆ ముగ్గురు వ్యక్తులు పోలీసుల విచారణలో తెలిపారు. కానీ ఈ ఇష్యూని పట్టించుకోకుండా అల్‌ఖైదా మాత్రం ఇండియాను టార్గెట్ చేసింది. కానీ ఇప్పుడు పరిస్థితులు ఒకప్పటిలా లేవు.
ఇండియా నుంచి అల్‌ఖైదాను ఎవరైనా కాపాడాలే తప్ప అల్‌ఖైదాకు ఇండియా బయపడే పరిస్థితిలో లేదు. అల్‌ఖైదాకు ఫండింగ్ చేసే దేశాలే ఇప్పుడు అడుక్కుతింటున్నాయి. ఇలాంటి టైంలో అన్నీ మూసుకుని ఉండాలే తప్ప.. రివేంజ్ అంటూ డైలాగ్స్ కొట్టకూడదు. ముస్లిం కాబట్టే అతీక్ చంపేశారంటూ అల్‌ఖైదా చెప్పుతోంది. కానీ ఇండియాలో ఏం జరుగుతోందో ప్రపంచం మొత్తం గమనిస్తూనే ఉంది. అతీక్ ఎలాంటి పరిస్థితుల్లో చనిపోయాడో అంతా చూస్తూనే ఉన్నారు. తప్పు చేసిన వాడికి శిక్ష పడక తప్పదు. అతీక్ కుటుంబం దేశానికి సేవేమీ చేయలేదు. ఎంతో మంది ప్రాణాలు తీశారు. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. ఇలాంటి పాపాలు చేస్తే ఎవడైనా అలా చావాల్సిందే. అది గమనించకుండా ప్రతీకారం అంటూ మాట్లాడితే.. అతీక్‌కు పట్టిన గతే వాళ్లకు కూడా పడుతుంది.