America Aishwarya: అమెరికాలో షాపింగ్‌మాల్‌లో కాల్పులు.. తెలుగు అమ్మాయి అక్కడిక్కడే మృతి..
అమెరికాలో గన్ కల్చర్ కంట్రోల్ లేకుండా పెరిగిపోతోంది. దుండగుల గన్స్ నుంచి వస్తున్న బుల్లెట్స్ ఆమాయకులు ప్రాణాలు తీస్తున్నాయి. ఒక ఇన్సిడెంట్‌ను మర్చిపోకముందే మరో దుర్ఘటన జరుగుతూనే ఉంది.
నిన్న ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో జరిగిన ఎటాక్‌లో తెలుగు అమ్మాయి చనిపోయింది. రంగారెడ్డి జిల్లాకు చెదిన తాటికొండ ఐశ్వర్య.. దుండగుడి కాల్పుల్లో అక్కడికక్కడే చనిపోయింది. రంగారెడ్డి జిల్లా జడ్జి నర్సిరెడ్డి కూతురే ఈ ఐశ్వర్య. మూడేళ్ల క్రితం హైయర్ స్టడీస్ కోసం అమెరికాకు వెళ్లిన ఐశ్వర్య.. చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం చేస్తోంది. పర్ఫెక్ట్ జనరల్ కాంట్రాక్ట్స్ అనే కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పని చేస్తోంది. వీకెండ్ కావడంతో డలాస్‌కు 25 కిలో మీటర్స్ దూరంలో ఉన్న అలెన్ ప్రీమియం అనే సూపర్‌మార్కెట్‌కు వెళ్లింది. అక్కడికి కారులో వచ్చిన దుండగుడు ఒక్కసారి కస్టమర్లపై కాల్పులు జరపడం మొదలు పెట్టాడు. దీంతో వాళ్లంతా ప్రాణ భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.
కానీ ఆ వ్యక్తి మాత్రం కాల్పులు కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. దీంతో పరుగులు తీస్తున్న కొందరు వ్యక్తులకు బుల్లెట్స్ తగిలాయి. అందులో ఐశ్యర్య రెడ్డి కూడా ఉంది. కాల్పుల్లో అక్కడికక్కడే చనిపోయింది. ఐశర్య రెడ్డితో పాటు మరో 8 మంది కూడా ప్రాణాలో కోల్పోయారు. ఇందులో ఇద్దరూ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయారు. మరి కొందరికి తీవ్రంగా గాయాలయ్యాయి. దాడి జరిగిన విషయం తెలిసిన వెంటనే పోలీసులు అలెన్ ప్రీమియం షాపింగ్‌మాల్‌కు చేరుకున్నారు. కాల్పులు జరిపిన దుండగున్ని షూట్ చేసి చంపేశారు. నిందితుడు ఈ దాడి ఎందుకు చేశాడు అనే విషయంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన ఐశ్వర్య శవంగా ఇంటికి తిరిగి వస్తుండటంతో ఐశ్యర్వ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.