Guntur: వీళ్లు మామూలోళ్ళు కాదు.. రూ.20 ఆశ చూపించి 10 లక్షలు కొట్టేశారు..
డబ్బు, నగలతో ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పెద్దలూ చెప్తూనే ఉంటారు. అవకాశం కోసం ఎదురు చూసే దొంగలు మన మధ్యే నార్మల్‌గా తిరుగుతూ ఉంటారు.
చాన్స్ దొరికిందంటే చాలు ఉన్నకాడికి ఊడ్చేసి వెళ్లిపోతారు. గుంటూరులో ఇలాంటిదే ఓ ఘటన జరిగింది. బ్యాంక్ నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకుని వస్తున్న ఓ వ్యక్తి నుంచి 20 రూపాయలు ఆశ చూపించి 10 లక్షల దోచేశారు నిందితులు. గుంటూరుకు చెందిన హరిబాబు అనే వ్యక్తి తన యజమాని బ్యాంక్ ఎకౌంట్ నుంచి 10 లక్షలు విత్ డ్రా చేశాడు. ఆ డబ్బు మొత్తం బ్యాగ్‌లో పెట్టుకుని యజమాని దగ్గరకు బయల్దేరాడు. హరిబాబును ముందు నుంచే గమనిస్తున్న దొంగలు బ్యాంక్ బైటే కాపు కాచారు. హరిబాబు బ్యాగ్ బైక్ మీద పెట్టి బండి స్టార్ట్ చేస్తున్న టైంలో ఓ వ్యక్తి వచ్చి 20 రూపాయల నోటు కింద పడేసి మీ నోటు పడిపోయిందంటూ హరిబాబును నమ్మించాడు.
ఆ నోటు తీసుకునేందుకు హరిబాబు దిగిన వెంటనే మరో బైక్ మీద ఇద్దరు దొంగలు డబ్బు బ్యాగ్ తీసుకుని క్షణాల్లో పారిపోయారు. గ్యాంగ్ మొత్తం ప్లాన్ ప్రకారం తనను మోసం చేశారని తెలుసుకున్న హరిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు గాలింపు ప్రారంభించారు. పక్కా ప్లాన్ ప్రకారమే హరిబాబును దొంగలు ట్రాప్ చేసినట్టు గుర్తించారు. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బుతో ప్రయాణాలు చేయకపోవడమే ఒకింత మంచింది. ఒకవేళ చేయాల్సి వ0చ్చినా ప్రతీక్షణం అటెన్షన్‌గా ఉండాలే తప్ప పక్కవాళ్ల మాటలు నమ్మి మోసపోకూడదు.