Anchor Shivani Sen: చిన్న వయసులోనే ఫేమస్ యాంకర్ కన్నుమూత.. కారణం ఏంటంటే..

ప్రముఖ యాంకర్, లైవ్ హోస్ట్ శివాని సేన్ కన్నుమూశారు. శివానీ కొద్దిరోజులుగా ఎపిలెప్టిక్ అనే బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. సడెన్‌గా అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లో మృతి చెందారు. దేశంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు శివాని సేన్ లైవ్ హోస్ట్‌గా, యాంకర్‌గా వ్యవహరించి విజయవంతం చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 11, 2023 | 10:58 AMLast Updated on: Jul 11, 2023 | 10:58 AM

Anchor Shivani Sen Dar Passes Away In Hyderabad Due To Epileptic Attack

Anchor Shivani Sen: చావు ఎప్పుడు, ఎలా వస్తుందో అస్సలు ఊహించలేం. కొన్నేళ్లలో పలువురు నటీనటులు ఇలానే గుండెపోటు, అనారోగ్య సమస్యలతో చనిపోయారు. ఇప్పుడు ఓ ప్రముఖ యాంకర్ కూడా అలానే మరణించారు. ప్రముఖ యాంకర్, లైవ్ హోస్ట్ శివాని సేన్ కన్నుమూశారు. శివానీ కొద్దిరోజులుగా ఎపిలెప్టిక్ అనే బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. సడెన్‌గా అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లో మృతి చెందారు.

దేశంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు శివాని సేన్ లైవ్ హోస్ట్‌గా, యాంకర్‌గా వ్యవహరించి విజయవంతం చేశారు. యాంకర్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఆమె 2005లో తన కెరీర్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి కార్పొరేట్ ఈవెంట్‌లు, కాన్ఫరెన్స్‌లు, మీడియా లాంచ్‌లు, వివాహాలు, వార్షిక ఈవెంట్‌లను నిర్వహిస్తూ వచ్చారు. దేశంలోనే ఫేమస్ యాంకర్‌గా శివానీ పేరు తెచ్చుకున్నారు. రీసెంట్‌గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలకు కూడా శివానీ హోస్ట్‌గా వ్యవహరించారు. వేడుకను చాలా హుందాగా, ఉత్సాహభరితంగా కొనసాగించి విజయవంతం చేశారు. అప్పట్లో వేదికపై చిరునవ్వుతో కనిపించి ఆకట్టుకున్నారు. అలాంటి శివాని అకస్మాత్తుగా చనిపోవడం అందరినీ బాధిస్తోంది.

శివాని మృతిపై బాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు, పలు సంస్థలు విచారం వ్యక్తం చేశాయి. సోషల్ మీడియా వేదికగా ఆమె మృతికి నివాళి అర్పిస్తున్నారు. ఆదివారం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న శివానీ సేన్.. ఓ వీడియోని రీట్వీట్ చేసింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే అంటే సోమవారం.. ఈమెకు ఎపిలెప్టిక్ అటాక్ అనే బ్రెయిన్ సంబంధిత సమస్య వచ్చింది. దీంతో ప్రాణాలు విడిచింది. శివానికి పెళ్లి అయి, ఓ బాబు కూడా ఉన్నాడు. ఇక శివానీ సేన్ 2019లో మిసెస్ సౌత్ ఇండియా టైటిల్‌ను కూడా గెలుచుకుంది.