Constable Murder: విశాఖ కానిస్టేబుల్ కేసులో కొత్త ట్విస్ట్.. మధ్యలో ఆ మహిళ ఎవరు ?
భర్తకు ఫుల్‌గా మద్యం తాగించి.. మద్యం మత్తులో ఉన్నప్పుడు ప్రియుడితో కలిసి దిండుతో నొక్కి భర్తను చంపేసింది శివాని. ఆ తర్వాత గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. పోస్టుమార్టంలో అసలు విషయాలు బయటకు రావడంతో అరెస్ట్ అయింది.

( ) ప్రియుడితో కలిసి కానిస్టేబుల్ రమేష్‌ను భార్య హత్య చేసిన ఘటన.. క్రైమ్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఈ కేసులో కొత్త ట్విస్ట్ కనిపించింది. మరో కొత్త వ్యక్తి పేరు వెలుగులోకి వచ్చింది. ఆమె ఎవరో కాదు శివాని పెద్దమ్మ కూతురు పైడమ్మ. పోలీసుల విచారణలో వెలుగులోకి సరికొత్త విషయాలు బయటకు వచ్చాయ్. రామారావుతో కలవడానికి పైడమ్మే కారణమని శివాని పోలీసులకు తెలిపింది. ఫోన్ కాల్ డేటా పరిశీలించారు. వందల సార్లు కాల్స్ మాట్లాడినట్టు గుర్తించారు పోలీసులు. రామారావు, పైడమ్మతో కలిసి.. ఎప్పుడూ ముగ్గురం కలిసే బయటకు వెళ్లే వాళ్లమని శివాని చెప్పింది. దీంతో పైడమ్మను ఏ4గా చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయ్.
ఐతే పైడమ్మ వాదన మాత్రం మరోలా ఉంది. శివాని, రామారావుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అంటోంది. కావాలనే తనను ఇరికిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. రామారావు ఒక ఫ్రెండ్ మాత్రమే అని చెప్పి.. శివాని తనకు పరిచయం చేసిందని అంటోంది. ఇక అటు ఈ ముగ్గురు.. కాన్ఫరెన్స్ కాల్స్‌లో మాట్లాడినట్లు నిర్ధారణకు వచ్చారు పోలీసులు. దీంతో పైడమ్మను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పైడమ్మ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏ 1 శివానితో పాటు.. ఏ2 ప్రియుడు రామారావు, A3 నీలాతో పాటు.. ఇప్పుడు పైడమ్మ కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. శనివారం వారిని రిమాండ్‌కు తరలించే చాన్స్ ఉంది. భర్తకు ఫుల్‌గా మద్యం తాగించి.. మద్యం మత్తులో ఉన్నప్పుడు ప్రియుడితో కలిసి దిండుతో నొక్కి భర్తను చంపేసింది శివాని. ఆ తర్వాత గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. పోస్టుమార్టంలో అసలు విషయాలు బయటకు రావడంతో అరెస్ట్ అయింది. ఐతే ఈ కేసులో ఇంకెన్ని మలుపులు ఉంటాయో అనే ఆసక్తి కనిపిస్తోంది.