Apple iPhones: యాపిల్ యూజర్లూ జాగ్రత్త.. ఐఫోన్లలో సెక్యూరిటీ లోపాలు..

తాజాగా ఐఫోన్లపై నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం.. ఐఫోన్ సహా యాపిల్ ప్రొడక్ట్స్‌లోనూ సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయని తెలిపింది. ఈ లోపాల సహాయంతో హ్యాకర్లు ఫోన్లలోని సెన్సిటివ్ సమాచారాన్ని దొంగలించే అవకాశం ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 16, 2023 | 03:37 PMLast Updated on: Dec 16, 2023 | 3:37 PM

Apple Users Warned Government Issues High Risk Alerts In Ios

Apple iPhones: యాపిల్ ఫోన్ యూజర్లకు హెచ్చరిక. ఐఫోన్లలో సెక్యూరిటీ లోపాలున్నాయని, వెంటనే ఫోన్లను అప్‌‌డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సైబర్ సెక్యూరిటీ సంస్థ సెర్ట్ సూచించింది. సెర్ట్.. సైబర్ సెక్యూరిటీ, పరిశోధనా సంస్థ. దేశంలోని సైబర్ వ్యవస్థపై అధ్యయనం చేస్తుంది.

REVANTH Vs HARISH: పోతిరెడ్డిపాడుపై అసెంబ్లీలో రచ్చ.. హరీష్ వర్సెస్ రేవంత్.. మాటల యుద్ధం

శాంసంగ్ ఫోన్లలో లోపాలున్నాయని ఇటీవలే వెల్లడించింది సెర్ట్. తాజాగా ఐఫోన్లపై నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం.. ఐఫోన్ సహా యాపిల్ ప్రొడక్ట్స్‌లోనూ సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయని తెలిపింది. ఈ లోపాల సహాయంతో హ్యాకర్లు ఫోన్లలోని సెన్సిటివ్ సమాచారాన్ని దొంగలించే అవకాశం ఉంది. ఫోన్‌ను తమ కంట్రోల్‌లోకి తీసుకోవడానికి, రిమోట్‌గా తమ కమాండ్స్‌తో ఫోన్ ఆపరేట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఆథెంటికేషన్ లేకుండానే ఫోన్‌ను హ్యాకర్లు యాక్సెస్ చేయొచ్చు.

ఐఫోన్, యాపిల్ ప్రొడక్ట్స్ వాడే యూజర్ల బ్యాంక్ అకౌంట్లోని డబ్బును కూడా దొంగిలించే వీలుంది. ఐఓఎస్ 17.2 వర్షన్ కన్నా ముందు వర్షన్ సాఫ్ట్‌వేర్ వాడుతున్న ఐ ఫోన్లతో పాటు, ఐఓఎస్, యాపిల్ వాచ్, ఐప్యాడ్‌, మ్యాక్ ఓఎస్, టీవీఓఎస్, సఫారీ బ్రౌజర్లలో కూడా ఈ సెక్యూరిటీ సమస్య ఎక్కువగా ఉంది. అందువల్ల ఐఫోన్ సహా యాపిల్ ఉత్పత్తుల వినియోగదారులు వెంటనే తమ ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.