Apsara Death Case: జైల్లో వేస్తే ప్రాణం తీసుకుంటా.. అప్సర కేసులో పూజారి వింత ప్రవర్తన..
నిందితుడు సాయికృష్ణ మాటలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయ్. అరెస్ట్ తర్వాత శంషాబాద్ పీఎస్‌లో సాయికృష్ణ వీరంగం సృష్టించినట్లు తెలుస్తోంది. ఆవేశంలో అప్సరను చంపేశానని, పోలీసుల ముందు సాయికృష్ణ కన్నీళ్లు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Apsara Death Case: శంషాబాద్ అప్సర హత్య కేసు నిందితుడు పూజారి సాయికృష్ణకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఐతే నిందితుడు సాయికృష్ణ మాటలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయ్. అరెస్ట్ తర్వాత శంషాబాద్ పీఎస్‌లో సాయికృష్ణ వీరంగం సృష్టించినట్లు తెలుస్తోంది. ఆవేశంలో అప్సరను చంపేశానని, పోలీసుల ముందు సాయికృష్ణ కన్నీళ్లు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అప్సర మిస్సింగ్ కేసు నమోదు కాగా, సాయికృష్ణను పిలిపించి విచారిస్తే ఈ హత్య కేసు బయట పడింది.
అప్సర హత్యకు వారం రోజులు ముందు మనుషులను చంపడం ఎలా అని ఇంటర్నెట్‌లో వెతికినట్లు తెలుస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా కేసులో పూర్తిగా కూరుకుపోయిన సాయికృష్ణ ఇప్పుడు పోలీసుల ముందు కొత్త నాటకాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఆవేశంలో హత్య చేశానని, ఫ్యామిలీ ఏమవుతుందోనని ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. బతకడం తనకు ఇష్టం లేదని పదే పదే పోలీస్ స్టేషన్‌లో చెప్పాడు. జైలులో పెట్టినా ఎప్పుడో ఆత్మహత్య చేసుకుంటానని, కుటుంబ సభ్యులకు ముఖం చూపించలేనని పోలీసుల ముందు బోరున విలపించినట్లు తెలుస్తోంది. ఏడుస్తూనే హత్యకు దారితీసిన పరిస్థితులను వివరించాడు. తనను పెళ్లి చేసుకోకపోతే, ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని అప్సర బ్లాక్‌మెయిల్ చేసిందని పోలీసుల ముందు ఏడుస్తూనే వివరించాడట సాయికృష్ణ.
ఆ ఏరియాలో తనకు మంచి పేరు ఉందని, తెలిస్తే తన పరువు పోతుందని భావించి, ఆవేశంలో హత్య చేశానని వివరించినట్లుగా తెలుస్తోంది. ఇక అటు సాయికృష్ణ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో పోలీసులు టెన్షన్ పడ్డారు. ఏదైనా జరిగితే సమస్య వస్తుందని రాత్రి సాయికృష్ణను న్యాయమూర్తి ఎదుట తీసుకెళ్లారు. సాయికృష్ణకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు. ఆ తర్వాత చర్లపల్లి జైలుకు తరలించారు. ఇక అటు అప్సర అంత్యక్రియలు అంబర్‌పేట శ్మశానవాటికలో పూర్తయ్యాయి. ఏమైనా ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో రేపిన సంచలనం అంతా ఇంతా కాదు.