బ్రేకింగ్: మేడ్చల్ రైల్వేస్టేషన్‌లో దారుణం, అమ్మాయిపై అఘాయిత్యం
మేడ్చల్ రైల్వేస్టేషన్‌లో దారుణం జరిగింది. ఓ యువతిపై గుర్తు తెలియని దుండగులు దారుణానికి ఒడిగట్టారు. అంతా కలిసి అమ్మాయిపై అత్యాచారానికి యత్నించారు.

మేడ్చల్ రైల్వేస్టేషన్‌లో దారుణం జరిగింది. ఓ యువతిపై గుర్తు తెలియని దుండగులు దారుణానికి ఒడిగట్టారు. అంతా కలిసి అమ్మాయిపై అత్యాచారానికి యత్నించారు. ప్రధాన నిందితుడి తలపై రాయితో కొట్టిన యువతి వాళ్ల చర నుంచి తప్పించుకుని పారిపోయింది. దుండగుల దాడిలో యువతికి కూడా గాయాలయ్యాయి.. ప్రస్తుతం యువతి గాంధీ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటోంది. రీసెంట్‌గా సికింద్రాబాద్ నుంచి MMTSలో ప్రయాణిస్తున్న ఓ యువతి మీద కూడా అత్యాచార యత్నం జరిగింది.
ట్రైన్‌లో ఎవరూ లేకపోవడంతో యువతి మీద అత్యాచారానికి యత్నించాడు దుండగుడు. కానీ యువతి ప్రతిగటించి కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఆ ఘటన మరువకముందే ఇప్పుడు మరోసారి మరో అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ జరగడం అది కూడా ఏకంగా రైల్వే స్టేషన్‌లో జరగడం కలకలం రేపుతోంది. రైళ్లే రైల్వేస్టేషన్లలో అమ్మాయిలపై జరుగుతున్న ఈ వరుస అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పూర్తిస్థాయిలో సర్వేలెన్స్ ఉన్నా ఇలాంటి ఘటనలు మాత్రం తగ్గడంలేదు. ప్రస్తుతం సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.