Avinash Reddy: కోర్టులో అవినాష్‌ రెడ్డికి ఊరట.. కానీ కండీషన్స్‌ అప్లై..

వివేకా మర్డర్‌ కేసులో తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డికి కాస్త ఊరట లభించింది. ఈ నెల 25 వరకూ అవినాష్ రెడ్డిని అరెస్ట్‌ చేయొద్దంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. అప్పటి వరకూ ప్రతీ రోజూ సీబీఐ విచారణకు రావాలంటూ అవినాష్‌రెడ్డిని ఆదేశించింది. ముందస్తు బెయిల్‌ కోసం అవినాష్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్టు స్వీకరించింది. దీనిపై దుతి తీర్పు ఈ నెల 25న ఇస్తామంటూ చెప్పింది. అవినాష్‌ రెడ్డి విచారణను ఆడియో, వీడియో రికార్డ్‌ చేయాలంటూ సీబీఐని ఆదేశించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 18, 2023 | 06:30 PMLast Updated on: Apr 18, 2023 | 6:30 PM

Avinash Reddy Bail Pitition

రేపటి నుంచి అవినాష్ రెడ్డి విచారణ ప్రారంభం కానుంది. అవినాష్‌ రెడ్డి, ఉదయ్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డిలను కలిపి విచారిస్తామని సీబీఐ తెలిపింది. అవినాష్ రెడ్డి కూడా విచారణకు సహకరిస్తారని ఆయన తరుపు లాయర్లు కోర్టుకు తెలిపారు. నిజానికి అవినాష్ రెడ్డి విచారణ నిన్నే జరగాల్సి ఉంది. కానీ.. ముందస్తు బెయిల్‌ కోరు అవినాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదన నేటికి వాయిదా పడటంతో ఇవాళ విచారణకు కావాలంటూ సీబీఐ తెలిపింది.

ఇవాళ ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈ నెల 25వ వరకూ అవినాష్ రెడ్డి అరెస్ట్‌ చేయొద్దంటూ సీబీఐకి సూచించింది. దీంతో రేపటి నుంచి అవినాష్‌ రెడ్డి విచారణ ప్రారంభం కానుంది. దస్తగిరి వాంగ్మూలం మినహా అవినాష్‌ ఇన్వాల్వ్‌మెంట్‌ గురించి ఎలాంటి ఆధారాలు లేవని అవినాష్‌ రెడ్డి లాయర్‌ నిరంజన్‌ రెడ్డి వాదించారు. ఇన్వెస్టిగేషన్‌లో గూగుల్‌ టేకవుట్‌ డేటాపై ఎలా ఆధారపడతారంటూ ప్రశ్నించారు. సునీల్‌ యాదవ్‌ కదలికలపై దస్తగిరి వాంగ్మూలం, గూగుల్‌ డేటా విరుద్ధంగా ఉన్నాయన్నారు. దస్తగిరి చెప్పింది తప్పా? గూగుల్‌ డేటా తప్పా? కుటుంబ, ఆర్థిక వివాదాలు, వివాహేతర సంబంధాలే వివేకా హత్యకు కారణమై ఉండొచ్చని వాదించారు.

బంధువు కాబట్టి హత్యా స్థలికి వెంటనే వెళ్లారని.. గదిని శుభ్రం చేయడం వెనుక ఎలాంటి కుట్ర లేదన్నారు. కానీ వివేకాకు గుండెపోటు అని ఎందుకు చెప్పారంటూ కోర్టు ప్రశ్నించింది. అక్కడున్న వారు గుండెపోటు అని చెబితే అదే విషయం అవినాష్‌ కూడా చెప్పారని తెలిపారు. నేటి విచారణపై స్పష్టత ఇవ్వాలని, సీబీఐ విచారణకు వెళ్లేందుకు అవినాష్‌ రెడ్డి సిద్ధంగా ఉన్నారన్నారు. హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున రేపు ఉదయం అవినాష్‌ రెడ్డి విచారిస్తామని సీబీఐ తరఫు లాయర్‌ కోర్టుకు తెలిపారు.

అవినాష్‌రెడ్డి నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని, ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దని వాదనలు వినిపించారు. ‘‘గతంలో నాలుగుసార్లు ప్రశ్నించినప్పుడు అవినాష్‌ సహకరించలేదని.. దర్యాప్తులో టెక్నికల్‌ ఎవిడెన్స్‌లు సేకరించామన్నారు. హత్య తర్వాత నిందితులు వెపన్స్‌తో అవినాష్‌ ఇంటికి వెళ్లారని కోర్టుకు వివరించారు.