Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర వీఐపీ పాస్‌లు.. ఆశపడ్డారో అంతే..!
భక్తుల ఆశను సైబర్ నేరగాళ్లు వాడుకుంటూ, మోసాలకు పాల్పడుతున్నారు. ఆన్‌లైన్ మెసేజ్‌లు, లింకులు పంపి మోసం చేస్తున్నారు. 'రామ జన్మభూమి గృహ సంపర్క్ అభియాన్.. APK' పేరుతో ఈ లింక్స్ పంపుతున్నారు.
Ayodhya Ram Mandir: మరికొద్ది రోజుల్లో అయోధ్యలో రామ మందిరం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవం కానున్న సంగతి తెలిసిందే. దీనికోసం కోట్లాది మంది భారతీయులు ఉత్సుకతో ఎదురుచూస్తున్నారు. ఈ అంశాన్ని ఇప్పుడు సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఆలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన వీఐపీ పాస్‌ల పేరుతో కొందరు కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ నెల 22న రామ మందిర ప్రారంభం కానుంది. దీనికి ప్రత్యేక ఆహ్వానితులైన 7 వేల మందికి మాత్రమే ఆహ్వానం పంపారు.
Pawan Kalyan : ఏపీలో పవన్ కళ్యాణ్ ఓటుకి గండం..!
సాధారణ భక్తులకు ఆరోజు ఆహ్వానం లేదు. మరుసటి రోజు నుంచి దర్శనానికి అనుమతించబోతున్నారు. దీంతో భక్తుల ఆశను సైబర్ నేరగాళ్లు వాడుకుంటూ, మోసాలకు పాల్పడుతున్నారు. ఆన్‌లైన్ మెసేజ్‌లు, లింకులు పంపి మోసం చేస్తున్నారు. ‘రామ జన్మభూమి గృహ సంపర్క్ అభియాన్.. APK’ పేరుతో ఈ లింక్స్ పంపుతున్నారు. దీని ప్రకారం.. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించిన వీఐపీ టికెట్లు అందుబాటులో ఉన్నాయని, తాము పంపిన లింక్‌పై క్లిక్ చేసి, యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చనేది ఆ మెసేజెస్ సారాంశం. అలాగే మరికొందరు హిందువులతో షేర్ చేసుకోవాలని, జై శ్రీరామ్ అని మెసెజ్ పంపుతున్నారు. దీంతో కొందరు భక్తులు ఇది నిజమేనని నమ్మి, ఆ లింక్స్‌పై క్లిక్ చేసి, APK యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. అలా లింక్‌పై క్లిక్ చేయగానే.. వారి అకౌంట్లోని డబ్బు క్షణాల్లో కొల్లగొట్టేస్తున్నారు కేటుగాళ్లు.
అలాగే వ్యక్తిగత వివరాలు, ఇతర డేటాను దొంగిలిస్తున్నారు. అయితే, నిజానికి రామజన్మభూమి ప్రారంభోత్సవానికి, ఈ మెసేజులకు ఎలాంటి సంబంధం లేదు. అందువల్ల ఇలాంటి వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు, పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి మెసేజులు వస్తే.. వాటిని ఓపెన్ చేయకుండా ఉండాలి. వీలైతే బ్లాక్ చేయాలి. పొరపాటున ఓపెన్ చేసి, డబ్బులు పోతే.. వెంటనే సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేయాలి. వాటిని పొరపాటున కూడా ఇతరులకు షేర్ చేయకూడదు.