Bangalore: మరో దారుణం.. కారులో యువతిపై గ్యాంగ్ రేప్‌..

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః.. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని అంటాం. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు మన దేశంలో అన్ని ప్రాంతాల్లో దేవతలు కొలువై ఉన్నారు.. కానీ స్త్రీలు మాత్రం గౌరవించబడటంలేదు. గౌరవం మాట పక్కన పెడితే మాన ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఢిల్లీలో నిర్భయ, కతువాలో అసిఫా, హైదరాబాద్‌లో దిశ, వరంగల్‌లో ప్రీతి. ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రాంతాలు పేర్లు మారుతున్నాయే తప్ప పరిస్థితి మాత్రం మారడంలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 1, 2023 | 12:22 PMLast Updated on: Apr 01, 2023 | 12:22 PM

Bangalore Gang Rape

దేశం తల వంచుకున్న ఈ ఘటనలను గుర్తుకు తెచ్చేలా బెంగళూరులో మరో దారుణం జరిగింది. అందరూ చూస్తుండగా ఓ అమ్మాయిని కారులో ఎత్తుకెళ్లి దారుణంగా రేప్‌ చేశారు నలుగురు కామాంధులు. మార్చ్‌ 25న జరిగిన ఈ దారుణం చాలా ఆలస్యంగా బయటికి వచ్చింది. మార్చ్‌ 25 రాత్రి బెంగళూరులోని నేషనల్‌ పార్క్‌లో ఉన్న యువతి దగ్గరికి నలుగురు వ్యక్తులు వచ్చారు. ఆమె స్నేహితుణ్ణి బెదిరించి అక్కడి నుంచి పంపించేశారు. బలవంతంగా కారులో ఎక్కించుకుని.. రాత్రంతా సిటిలో తిప్పుతూ గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు.

తెల్లవారు జామున అమ్మాయిని ఆమె ఇంటి దగ్గర వదిలేశారు. విషయం పోలీసులుకు చెప్తే చంపేస్తామని బెదిరించారు. కానీ చాలా సిబియర్‌ ఇంజూరీస్‌ అవడంతో ఆ యువతి హాస్పిటల్‌లో చేరింది. రెండు రోజులు బాధను దిగమింగుకుంది. ధైర్యం తెచ్చుకుని తనపై జరిగి అఘాయిత్యాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే విచారణ ప్రారంభించిన పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌.. రెండు రోజుల్లో నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. సతీష్‌, విజయ్‌, శ్రీధర్‌, కిరణ్‌ను అరెస్ట్‌ చేసినట్టు చెప్పారు. ఇలాంటి దారుణం జరిగిన ప్రతీసారీ ఇదే ఆఖరిది అవ్వాలని కోరుకోవడం తప్ప పరిస్థితి మార్చే మారిణామాలు ఒక్కటి కూడా జరగడంలేదు. యువతికి న్యాయం చేసేందుకు ఈ నలుగురు నిందితుల విషయంలో కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో.. పరిస్థితిని మార్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.