సూరిని చంపిన భాను కిరణ్‌కు బెయిల్, ఇదే ఇతని బ్యాగ్రౌండ్
మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రదాన నిందితుడు భాను కిరణ్ బెయిల్ మీద విడుదలయ్యాడు. సూరి హత్య కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న భానుకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో 12 ఏళ్ల తరువాత జైలు నుంచి బయటికి వచ్చాడు భాను.
మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రదాన నిందితుడు భాను కిరణ్ బెయిల్ మీద విడుదలయ్యాడు. సూరి హత్య కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న భానుకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో 12 ఏళ్ల తరువాత జైలు నుంచి బయటికి వచ్చాడు భాను. పరిటాల రవిని హత్య చేసిన వ్యక్తిగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో మద్దెల చెరువు సూరి పేరు మార్మోగింది. కానీ కత్తి పట్టిన వాడూ కత్తికే బలవుతాడు అన్నట్టుగా సూరి కూడా కొన్ని రోజులు హత్యకు గురయ్యాడు. పరిటాల రవి మద్దెలచెరువు సూరి కుటుంబాల మధ్య ఏం జరిగిందో రాష్ట్రం మొత్తం తెలుసు. వీళ్ల జీవితాల ఆధారాంగా రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర పార్ట్ 1 పార్ట్ 2 అని రెండు సినిమాలు తీశాడు.
పరిటాల రవి హత్యతో రీల్ రక్త చరిత్ర ముగుస్తుంది. కానీ రియల్‌గా రక్తి చరిత్రలో కీలక పాత్ర పోషించినవాడే ఈ భాను కిరణ్. పరిటార హత్య తరువాత పరిస్థితులు మారిపోయాయి. వాళ్ల ప్రభుత్వం కూడా మారిపోవడంతో రవి కుటుంబ సభ్యులు సపోర్టర్స్ అంతా అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోయారు. ఆ టైంలో సూరి అంచలంచెలుగా ఎదిగాడు. ఒకవైపు రియల్‌ఎస్టేట్, మరోవైపు రాజకీయంతో స్టేట్‌లో తనను తాను పవర్‌ఫుల్ వ్యక్తిగా చేసుకోవడం ప్రారంభించారు. ఆ టైంలో సూరికి రైట్‌హ్యాండ్‌గా ఉన్న వ్యక్తి ఈ భాను కిరణ్. కట్ చేస్తే 2011 జనవరిలో కారులో వెళ్తున్న సూరిని అదే కారులో వెనక సీట్‌లో కూర్చున్న భాను కిరణ్ గన్‌తో షూట్ చేశాడు.
తన టీంతో కలిసి అక్కడి నుంచి పారిపోయాడు. తరువాత భాను కిరణ్‌ను జహీరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపారంలో వచ్చిన ఇబ్బందుల కారణంగా సూరి నుంచి తనకు ప్రాణ హాణి ఉందని.. ఆ కారణంగానే తాను సూరిని చంపేశానని చెప్పాడు భాను కిరణ్. కానీ సూరి హత్య గురించి ఒక్కొక్కరి వెర్షన్ ఒక్కోలా ఉంది. ఈ కేసులో నిజానిజాలు ఏంటి అనే విషయం పక్కన పెడితే.. మద్దెల చెరువు సూరి హత్య అప్పట్లో సంచలనం లేపింది. వాళ్ల పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే రాష్ట్ర రాజధానిలో ఈ మర్డర్ జరగడం సంచనలం రేపింది. ఈ కేసులోనే భాను కిరణ్ జైలుకు వెళ్లాడు. అక్రమ ఆయుధాలు, మర్డర్ కేసులో భానుకు జైలు శిక్ష పడింంది. చివరకు 12 ఏళ్ల తరువాత కోర్టు భాను కిరణ్‌కు బెయిల్ ఇచ్చింది.